top of page

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 9

#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Manchu Thakina Prema - Episode 9 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 30/01/2025

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 9 - తెలుగు ధారావాహిక

రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  

కథా పఠనం: పెనుమాక వసంత



జరిగిన కథ:


శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది. గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు. 


టూర్ లో ఉండగానే నిజ జీవితంలో కూడా హిమకు ప్రపోజ్ చేస్తాడు రవి. తమ ప్రేమ నిజమైతే మరో పది రోజుల్లో తిరిగి కలుస్తామని చెబుతాడు. హిమ, రవి క్లోజ్ గా ఉన్న ఫోటోలు చూసిన హిమ తలిదండ్రులు ఆమెను అనుమానిస్తారు. అరకు టూర్ వెళ్లిన హిమకు ఒక వ్యక్తి డాష్ ఇస్తాడు. 


ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 9 చదవండి. 


“సారీ అండీ.. చూసుకోలేదు” అంటాడు ఎదురుగా వచ్చిన అబ్బాయి.. 


“అయ్యో పర్లేదండీ. నేను కూడా ఏదో పరధ్యానంలో ఉండి నడుస్తున్నాను” అంటుంది హిమబిందు. 


హిమబిందు ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్టు అనిపించి “మీరు షార్ట్ ఫిలిం లో హీరోయిన్ కదా” అంటాడు ఆ అబ్బాయి. 


“అవును కానీ ఆ షార్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ కాలేదు. మీకు ఎలా తెలుసు!”


“అందులో చేసిన అన్నయ్య మా అన్నయ్యకి ఫ్రెండ్. ఒకసారి మా అన్నయ్య మొబైల్లో చూశాను.. మీరేం అనుకోనంటే ఒక మాట చెప్పనా మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారు చాలా అందంగా ఉన్నారు ముఖ్యంగా మీ స్మైల్ అయితే ఎంతో బాగుంది మా కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరం మీ షార్ట్ ఫిలిం రిలీజ్ అవ్వకముందే మీకు ఫ్యాన్స్ అయిపోయాము..”

 

“థాంక్యూ..”

 

“నాకు యాక్టింగ్ పట్ల అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు. తను మా క్లాస్మేట్. అందుకే చేశాను” 


“అవునా.. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి. గొప్ప హీరోయిన్ అవుతారు.. అదేంటో ఈరోజు అనుకోకుండా మిమ్మల్ని కలిశాను. ఆ అన్నను కూడా కలిసాను. ఇప్పుడే మాట్లాడి వస్తున్నాను”. 


“అవునా” అంటూ ఎంతో ఆశ్చర్యంగా అడుగుతుంది హిమబిందు.. 

“తను ఎక్కడున్నాడు ఇప్పుడు?”


“అదిగో.. ఆ మ్యూజియం దగ్గర మాట్లాడి వస్తున్నాను” అంటూ రైట్ సైడ్ ఉన్న మ్యూజియం వైపు చేయి చూపించి చెబుతాడు ఆ అబ్బాయి. 


“థాంక్యూ. థాంక్యూ సో మచ్. నాకు చాలా హెల్ప్ చేశారు మీరు” అంటూ అతనికి థాంక్స్ చెప్పి చకచకా నడుచుకుంటూ అక్కడికి వెళుతుంది.. 


“హలో ఆ బబ్లు చెప్పరా”

 

“ఎక్కడరా” 


“అరకులో రా”{


“ఎప్పుడు వెళ్లావు రా”


“ఏం చెప్పమంటావు రా నా కష్టాలు. మా అమ్మ, నేను ఇంట్లో సరిగా ఉండడం లేదు అని, ఎప్పుడు లొకేషన్స్ షూటింగ్స్ అని తిరుగుతున్నానని నా కాళ్లు చేతులు కట్టేసి ఫ్యామిలీ పిక్నిక్ అంటూ ఇక్కడికి తీసుకు వచ్చింది.. 


“ఓ.. బాగా ఎంజాయ్ చేస్తున్నావా? హిమబిందుని కూడా రమ్మనక పోయావా. ప్రపోజ్ చేసేసావు కదా.. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవాళ్లు”

“ఆ విషయం గురించే నీతో మాట్లాడడానికి కాల్ చేసా”


“ఏమైందిరా..”

 

జరిగిందంతా బబ్లుతో చెబుతాడు రవికాంత్.


“ఏంట్రా నువ్వు చేసింది, అమ్మాయిలు అరుదుగా వారి మనసుని ఓపెన్ చేస్తారు. నువ్వు సరిగ్గా అదే టయానికి కీ తో లాక్ చేశావు. ఇప్పుడు కీ పోగొట్టుకొని ఏడుస్తున్నావు. నీ కర్మ అనుభవించు. పైగా టైం కూడా లేదు. ఇవాల్టితో నువ్వు పెట్టిన గడువు పూర్తయింది. పైగా టెన్ డేస్ తర్వాత కలవకపోతే మన ప్రేమ అంతం అయినట్టే అని నీ నోటితో నువ్వే చెప్పావు. ఇంకా ఎవరిమైనా ఏం చేస్తాం?


నా ప్రేమ కథకు నేనే కదా విలను. నా రాత నాది. తప్పు ఎవరిదనను?” అంటూ సోలోగా సోలో సినిమాలోని పాట పాడుకో”


“అలా అనకురా. ఏదైనా సలహా ఇస్తావని నీకు ఫోన్ చేశాను”

 

“నువ్వు పెట్టుకున్న రూల్ ని బ్రేక్ చేసి కాల్ చేసి మాట్లాడు. లేదా డైరెక్ట్ గా వెళ్లి కలువు”


“అదే అనుకుంటున్నాను రా. కానీ ఇక్కడ నుండి వెళ్లేసరికే మిడ్ నైట్ అయిపోతుంది. ఎలాగా అని ఆలోచిస్తున్నాను..

పాపం తను నేను చెప్పింది నమ్మింది. ఎంతలా ఎదురుచూస్తుందో.. ఎంత బెంగపెట్టుకొని ఉంటుందో.. నా మీద చాలా కోపంగా కూడా ఉండి ఉంటుంది. తనని ఎలా కన్విన్స్ చేయాలో”

 

“మరి ఆ పిచ్చి కండిషన్ ఎవరు పెట్టమన్నారు?”

 

“ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నాను రా. మా ఇద్దరి మనసులు ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటాయి. కాకపోతే ఒకవేళ అలా జరగకపోతే తను ఎక్కడ బాధ పడుతుందో అని నా భయం. నేను పెట్టుకున్న కండిషన్ ప్రకారం జరిగినా జరగకపోయినా తనని నేను ఎప్పటికీ వదులుకోలేను. ఇప్పుడు తనని కలిసి ఎలా కన్విన్స్ చేయాలో చెప్పరా ప్లీజ్”


“గడ్డం పట్టుకుని బతిమిలాడాలి. కాళ్లు పట్టుకొని క్షమించమని అడగాలి. అప్పటికి కూడా క్షమించను”


“ఏంట్రా వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు..”


“మాట్లాడింది ఫోన్లో కాదు. నీ వెనక” అంటూ హిమబిందు వెనక నిలబడి కోపంగా చెబుతుంది.


“బబ్లు, ఫోన్ పెట్టెయ్. మళ్లీ చేస్తాను” అంటూ రవికాంత్ వెనక్కి తిరిగి హిమ ని చూసి షాక్ అయిపోతాడు.. 


“చూసావా హిమ.. మన ఇద్దరి మధ్య మ్యాజిక్ ఉందని ఇప్పటికైనా నమ్ముతావా? నేను ఆరోజు ఆ కండిషన్ పెట్టినందుకు ఫీలయ్యావు ఇప్పుడు ఎంత త్రిల్ గా ఉందో కదా?” అని అంటున్నాడే కానీ హిమబిందు భావాలు అర్థం చేసుకోవడంలో తన పూర్తి ఎఫర్ట్స్ నీ పెడుతున్నాడు.. 


రవికాంత్ మాటలకి కోపం వచ్చిన హిమబిందు నడుచుకుంటూ వెళ్లిపోతుంది.. 


“హిమ, సారీ.. ఆగు ప్లీజ్. నేను చెప్పేది ఒక్కసారి విను”


వినిపించుకోకుండా వేగంగా నడుస్తున్న హిమబిందు దగ్గరకు వెళ్లి తన చేయి పట్టుకుని ఆపుతాడు.. 


‘మంచు ధార బొమ్మ బొమ్మ, 

తప్పుని క్షమించేయమ్మా.. 

వాలు కళ్ళా గుమ్మ గుమ్మ, ప్రేమని పంచేయమ్మ.. 

కోపంగా చూసావంటే, చిరాగ్గా కసిరావంటే

నేనేమైపోవాలి అమ్మ.. 


ఈ జన్మ నీదని ఒట్టేస్తున్నానమ్మ. 

నా ప్రాణమై నిలిచిన పసిడి చిలకమ్మ’


అంటూ ఆమె చెక్కిళ్లపై కదులుతున్న ముంగురులను సరి చేస్తూ, “ఇదిగో గడ్డం పట్టుకుని బతిమిలాడుతున్నా. కావాలంటే నువ్వు అన్నట్టు కాళ్లు పట్టుకొని క్షమించమని కూడా అడుగుతా” అంటున్న రవికాంత్ ని “ఏమీ అవసరం లేదులే”.. అంటూ తన కోపం తీరేలాగా రవికాంత్ ని కొడుతూ ఒక్కసారిగా ఏడుస్తూ తనని హత్తుకుంటుంది.. 


“కలుస్తామో కలవమో అని ఎంత భయమేసిందో తెలుసా.. అసలు ఈ టెన్ డేస్ లో ఏం జరిగిందో తెలుసా, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో తెలుసా” అంటూ ఏడుస్తూ తన భారాన్ని మొత్తం రవికాంత్ తో పంచుకుంది.. 


“తెలుసు హిమ.. ఇతడేగా ప్రాబ్లం” అంటూ తన ఫోన్లో ఉన్న ప్రభాకర్ ఫోటోని హిమకి చూపిస్తాడు.. 


“రవి.. ఇతను.. ఇతను నీకెలా తెలుసు?”అంటూ ఆశ్చర్యపోతూ అడుగుతుంది. 


“హిమ.. టెన్షన్ పడకు. అలా కూర్చుని మాట్లాడుకుందాం రా”, అంటూ పక్కనే ఉన్న రోస్ గార్డెన్ వైపుకు తీసుకుని వెళ్లి, జలపాతం పక్కన ఎత్తైన పర్వతాన్ని ఆనుకొని గులాబీ చెట్ల మధ్యలో ఉన్న ఒక అరుగుపై కూర్చుని ప్రశాంతంగా జరిగిందంతా హిమకు ఈ విధంగా చెబుతాడు. 


“టైం బాలేక పోతే తాడు కూడా పామై కాటేస్తుంది అన్న సామెత మనకు ఈ సమయంలో సరిగ్గా సరిపోతుందేమో అని అనిపిస్తుంది.. 


ఈ ప్రభాకర్ అనే వ్యక్తిని నేను రెండు సందర్భాలలో కలిశాను. మొదటిసారి, ఇతను నైట్ టైం డ్రింక్ చేసి కార్ ఓవర్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్నాడు, ఎదురుగా స్కూటీపై ఐదేళ్ల పాపతో వాళ్ళ అమ్మ వస్తుంది. ఇతను ఓవర్ స్పీడ్ లో ఉండడం వల్ల స్కూటీకి యాక్సిడెంట్ చేశాడు.. ఆ ఇద్దరూ కింద పడిపోయారు. బాగా గాయాలు తగిలాయి. బ్లడ్ పోతుంది కానీ ఇతను అది పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.. 


నేను అతన్ని చేజ్ చేసి తన కారులోనే వాళ్ళిద్దరినీ ఎక్కించి హాస్పిటల్ కి తీసుకువెళ్లి, ట్రీట్మెంట్ ఇప్పించి తనతోనే డబ్బులు కట్టించాను.. మొదట వీటన్నిటికీ ఒప్పుకోలేదు. కేస్ పెడతానని బెదిరించాను. వాళ్ళ వాళ్ళకి కాల్ చేస్తానని తన మొబైల్ తీసుకున్నాను. ఇక చేసేదేమీ లేక అన్నిటికీ ఒప్పుకున్నాడు.. 


అయితే ఆలోపే అతను ఒక ఫేమస్ కంపెనీకి సీఈవో అని, డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఆక్సిడెంట్ చేశాడని, ఆ నోట ఈ నోట తెలిసి పోలీసులు కూడా వచ్చారు. కానీ యాక్సిడెంట్ అయిన ఆవిడ కేసు ఏమి పెట్టలేదు. అయితే అందరి ముందు తన పరువు పోయిందని అతను ‘చా, అందరి ముందు నా ఇమేజ్ డామేజ్ అయ్యింది. నీ అంతు చూస్తాను’ అంటూ నన్ను బెదిరించి వెళ్ళాడు.. చాలా ఫీల్ అయ్యాడు. తన ఇగో హర్ట్ అయ్యింది.. 


ఇక రెండో సందర్భం, 

వీళ్ళ యాడ్ కంపెనీలో చేసే ఒక యాడ్ షూట్ కి నేను కంటెంట్ రాయవలసి వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ద్వారా ఆపర్చునిటీ నాకు వచ్చింది.. 


అయితే మొదట్లో నేను ఒప్పుకోలేదు కానీ యాడ్ డైరెక్టర్ ‘చూడు.. ఇది నీకు చాలా మంచి ఆపర్చునిటీ. ఇందులో నువ్వు సక్సెస్ అయితే ముందు ముందు నీకు చాలా ఆఫర్లు వస్తాయి’ అని చెప్పడంతో సరే అని ఒప్పుకున్నాను.. అంతా అయిపోయిన తర్వాత ఆ డైరెక్టర్ ‘మా సీఈవో సార్ కి నచ్చలేదంట. ఆయన ఇలా రాయమని చెప్పారు’ అంటూ వేరే స్క్రిప్ట్ నాకు ఇచ్చారు.. 


‘అదేంటి అంతా రెడీ అయిన తర్వాత మళ్లీ మార్చమనడం’ అని అడిగాను. ‘అయినా అతను ఇచ్చిన స్క్రిప్ట్ నాకు నచ్చలేదు. నేను ఈ విధంగా రాయలేను’ అని చెప్పాను. 


ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన మేనేజ్మెంట్ కి నా కంటెంట్ బాగా నచ్చింది. అందుకే దాన్నే వాళ్లు సపోర్ట్ చేశారు. అయితే నేను రాయను అని వెళ్ళిపోయాను.. ఆ ప్రభాకర్ రిక్వెస్ట్ చెయ్యకపోగా డిమాండ్ చేస్తూ అడిగాడు ‘నువ్వు ఆఫ్ట్రాల్ స్టూడెంట్ వి. నీ పొకెట్ మనీ కోసం ఇలా చిన్నచిన్న కంటెంట్లు రాసుకుంటున్నావు. నీకు ఇంత పొగరు పనికిరాదు’ అని చాలా చీప్ గా మాట్లాడాడు..

 

అతని మాటల తో నన్ను చాలా హర్ట్ చేశాడు. ఇక ఈ యాడ్ కంపెనీకి ఇప్పుడే కాదు ఫ్యూచర్లో ఎంత అవసరం వచ్చినా కంటెంట్ రాయకూడదని నిర్ణయం తీసుకున్నాను. అయితే నేను తీసుకున్న నిర్ణయం వల్ల అతనికి ఎంతో లాస్ వచ్చిందంట. ఆ ప్రాజెక్టు వాళ్లు వేరే కంపెనీకి వెళ్లిపోయారంట. దానివల్ల అతనికి మనీ లాస్. ఇమేజ్ లాస్.. ఎన్నో ఆఫర్లు లాస్ అయినాయంట.. 


ఒకరోజు నేను కాలేజీకి వెళ్తుంటే అతను కారులో నా ఎదురుగా వచ్చి కార్ ఆపి నా దగ్గరకు వచ్చాడు.. 


‘చూడు రవికాంత్.. నీవల్ల నేను ఎన్నో నష్టపోయాను. అయినా నాకు అంత బాధ అనిపించలేదు. కానీ నువ్వు నా ఈగో ని టచ్ చేసావు. 


అందరికీ ఈగో అంతో ఇంతో ఉంటుంది కానీ నా ఆటిట్యూడ్ అంతా ఇగో తో నిండి ఉంటుంది. దాన్ని నువ్వు టచ్ చేసావు. నిన్ను అంత సులువుగా వదిలిపెట్టను. నీ కెరియర్ ని నాశనం చేస్తాను. రాసి పెట్టుకో’ అని బెదిరించి వెళ్ళాడు.. 


అన్నట్టుగానే నాపై రివెంజ్ తీర్చుకోవడం మొదలుపెట్టాడు. నాకు వచ్చే చిన్న చిన్న ఆఫర్లు కూడా రానీకుండా చేశాడు. ప్రొఫెషనల్ గా చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. తన గురించి ఎంక్వయిరీ చేస్తే అతను చాలా డేంజర్ పర్సన్ అని అయితే చూసే వాళ్లకు చాలా మంచి వ్యక్తిలా కనిపించే కన్నింగ్ ఫెలో అని తెలిసింది.. 


ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ ని కూడా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. మా బ్యాచ్ లో ఒకడిని ఇన్ఫార్మర్ గా పెట్టాడు. వాడికి డబ్బులు ఇచ్చి మన గురించి ప్రతి అప్డేట్ తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ భాగంలోనే మీ ఇంటికి ఫొటోస్ పంపించాడు. అలాగే నిన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి సంబంధమై మీ ఇంటికి రాబోతున్నాడు.. 


హిమ.. మన బ్యాడ్ టైం ఏంటంటే అతను మీకు రిలేటివ్ అవ్వడం. మీ నాన్నగారికి అతనిపై మంచి ఒపీనియన్ ఉండడం.. అతని నెట్వర్క్ చాలా పెద్దది. నాకు తెలిసి ఈపాటికి మీ ఇంట్లో మనం ఇక్కడ కలిసిన విషయం కూడా తెలిసిపోయే ఉంటది.. 


మీ నాన్నగారి దృష్టిలో అతను హీరో, నేను విలన్.”


=======================================================================

                                                ఇంకా వుంది

========================================================================

 

చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








29 views0 comments

Comments


bottom of page