మందం అందమే
- Penumaka Vasantha
- 1 hour ago
- 2 min read
#పెనుమాకవసంత, #PenumakaVasantha, #MandamAndame, #మందంఅందమే, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Mandam Andame - New Telugu Story Written By Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 24/4/2024
మందం అందమే - తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
కాళ్ల నొప్పులతో డాక్టరు దగ్గరికి వెళ్ళింది
రివట.
"కాళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఏమి చేయాలి? డాక్టరు!"
"ఎక్కువ వర్క్ చేయండి తక్కువగా తినండి. యోగా చేస్తే ఇంకా బెటర్!"
రివట భారీకాయాన్ని మోస్తున్న తన కుర్చీనీ అనుమానముగా చూసుకుంటూ అన్నాడు డాక్టరు.
"మా ఆవిడ డాన్సరు!" భార్య వైపు చూస్తూ గర్వంతో అన్నాడు వికాస్.
"ఇంకేమీ మరి డాన్సు ప్రాక్టీసు చేయండి బరువు తగ్గుతారు."
"మీరు చెప్పేది బాగానే ఉంది. కొన్నాళ్ళు సాధన చేసి వెయిట్ తగ్గగానే మానేస్తుంది. అపుడు బరువు పెరుగుతుంది. ఎపుడూ చేయాలిగా? డాక్టరు!" భార్య వైపు చూస్తూ అన్నాడు వికాస్.
"అవును ఎపుడూ చేయాలి. అపుడే తగ్గుతారు" అన్న డాక్టరు సలహాతో ఘోరంగా కసిగా డాన్సు ప్రాక్టీసు చేసింది రివట. ఈ వీడియోను రీల్స్ గా చేసి పెట్టాడు వికాస్. ఇంత లావుగా ఉన్న రివట డాన్సు రీల్ చూసి, ఒక ఈవెంట్ వాళ్ళు డాన్సు చేయమని పిలిచారు.
రివట చేసే డాన్సుకు స్టేజి కూలిపోయింది. దీన్ని రీల్స్ లో చూసి చాలా మంది ప్రోగ్రాములు అయిపోయిన తర్వాత పిలిచి డాన్సు చేయిస్తున్నారు రివటను.
పదిమంది స్టేజినీ కూలగొట్టే పనిని ఇపుడు ఒక్కతే చేయటంతో భారీగా డబ్బులు ముట్ట చెప్పుతున్నారు ఈవెంట్ నిర్వాహకులు.
"నా పెళ్లెప్పుడు సైకిల్ లాగా సన్నగా ఉండి నువ్వు ఇపుడు లారీగా మారినా నాకేమీ వర్రీ లేదు. నువ్వెంత మందంగా ఉంటే అంత అందం రివ్వు!" వికాస్ అనటంతో హ్యాపీగా ఫీలయింది మన రివట కుట్టి.
ఇపుడు రివటకు వంద స్టేజీలు కూల్చిన సందర్భంలో 'శతాధిక కూలీనీ' అనే బిరుదు ప్రధానం చేసారు.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Comments