మానవుడు 200 ల నుండి 300 ల ఏండ్లు బతుకవచ్చు.
'Manishi Ayusshu Mudu Vandala Yellu' - New Telugu Article Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 09/01/2024
'మనిషి ఆయుష్షు మూడు వందల ఏళ్ళు' తెలుగు వ్యాసం
రచన : సుదర్శన రావు పోచంపల్లి
మనిషి ఆయుష్షు మూడు వందల ఏళ్ళు
మానవుడు 200 ల నుండి 300 ల ఏండ్లు బతుకవచ్చు.
ఇస్రో చైర్మన్ శ్రీ సోమనాథ్ నిన్న ఒక ప్రకటన చేస్తూ మానవులు 200 నుండి 300 వందల సంవత్సరాల కాలము బ్రతికే అవకాశము ముందు ముందు కలుగబోతుంది అంటున్నారు.
అదే నిజమైతే-
1. ఇప్పుడున్న 800 కోట్ల జనాభా 2400 కోట్ల పైన కావచ్చు.
2, ఇప్పుడే ఆహార కొరత ఉన్న ప్రపంచము ఇంకా 300 ఏండ్ల వరకు తట్టుకునేదెట్ల.
3. నీళ్ళకొరత తీర్చేదేట్ల.
4. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణములొ నివాస యోగ్య మెట్ల.
5. అంత మందికి సరిపోను ఆహార పదార్థాలు, బట్టలు, మందులు సమకూరేదెట్ల.
6. అంత మంది కి వాహనాలు తోడుగ నడుపడానికి దారులేవి.
7. విద్యుత్తు ఉత్పత్తి ఎట్ల.
8. ప్రభుత్వాలు ఉద్యోగుల, ఊపాధ్యాయుల పెన్షనర్ల వేతనాలు భరిస్తాయా.
9. విమానాలు ఎగురగలవా.
10. పాఠశాలలు నడుపగలరా.
11. ఆహార వస్తువులు పండించడానికి భూమి, నీటి వసతి సరిపోతుందా.
12, పరిశ్రమల స్థాపనకు సరిపొను భూమి ఏది.
13. ఇంతకు ముందు గూడా విన్న ప్రకారం మనిషి ఇరువది వేలేండ్లు బ్రతుకవచ్చు అదే నిజమైతె నివాసానికి అన్య గ్రహాలు వెదుకవలసి ఉంటుంది.
14. మనుషులు సమిష్టి కుటుంబంగా బతుకలేరు, ఒంటరిగా బతకడానికి వసతులు ఉండవు.
15. అసలు మనుషులు చస్తే శ్మశానాలు కూడా కరువే.
16. పాల ఉత్పత్తి, మాంసము, కోళ్ళు, గుడ్లు సరిపోను దొరకవు.
17. కంప్యూటరు యుగమైనా టి వీ లు, కంప్యూటర్లు, ఎలెక్ట్రానిక్ పరికరాలు అవసరానికి తగినట్టు ఉత్పత్తి సాధ్యమా.
18. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, చేపలు పెంచేదెట్ల.
19. అడవులన్ని నివాసానికే సరిపోక పోతె అడవి జంతువులు, పక్షులు బతికేదెక్కడ.
20. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాల విరమణ వయసు ఎంతవరకు పెంచగలరు? బతికినంత మాత్రానా వారు సేవలు చేయగలరా.
21. ఇంకా చెప్పబోతె ఎన్నూ ఎన్నెన్నో సమస్యలు.
సుదర్శన రావు పోచంపల్లి
Comentários