మనిషి - మనుగడ
- A . Annapurna
- 23 hours ago
- 3 min read
#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #మనిషిమనుగడ, #ManishiManugada, #TeluguSpecialArticle, #AnnapurnaArticles, #సామాజికసమస్యలు

Manishi Manugada - New Telugu Article Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 02/04/2025
మనిషి మనుగడ - తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
నలుగురిలో కలవలేని వారు ఒంటరితనం శాపం అనుకుంటారు. నిన్ను నువ్వు తెలుసుకోడానికి ఒక అవకాశంగా భావించు. నిన్ను అనుక్షణం అంటిపెట్టుకుని తిరిగే మనిషి వలన వ్యక్తిత్వం కోలుపోతావు. నీకంటూ ఒక గుర్తింపు వుండదు.
ఇంకొకరిమీద ఆధారపడటం నీకు బలహీనత కాగలదు.
వయసులో ఎవరిని లెక్కచేయవు. అహంకారంతో విర్రవీగుతావు. అందరూ నీమాట వినాలని, అందరిని అదుపులో ఉంచాలని అనుకుంటావు.
అందరిని దూరం చేసుకుంటావు, నీమీద ఎవరికీ సానుభూతి లేదు, నీకు ఎవరూనచ్చరు. కనుక నిన్ను కూడా ఎవరూ మెచ్చరు. అభిమానం ప్రేమ అంటే నీకు తెలియదు. ఎదుటివారిని భయపెట్టడమే తెలుసు.
పెళ్ళీకాగానే భార్యను, తర్వాత పిల్లలను, బంధువులను చులకన చేసేవు. ఎవరివలన లాభంవుందా.. నాకు ఉపయోగపడతారా.. అనే స్వార్ధం నీది.
అందుకే స్నేహితులు లేరు.. ఆత్మీయులు లేరు.. వయసు మళ్ళిన తర్వాత ఎవరైనా పలకరిస్తే చాలు.. అనిచూస్తావు. కానీ నీ దరిదాపులకు ఎవరూ రారు.
భార్యను అడుగుతావు, ‘మీరు అంతా నన్ను దూరం పెడతారు ఎందు’కని.
అది 'మీవల్లనే' అని చెప్పే చొరవ ఆమెకు లేదు. ఆమెను బానిసగా చూసేవు. ఆమె నిరసనగా చూసి తప్పుకుంటుంది.
పిల్లలను అడుగుతావ్.
నేను ఇప్పుడు ఖాళీగా వున్నాను, నాతొ కాసేపు మాటాడమంటావు.
వాళ్ళు చదువుకోవాలనో ఆడుకోవాలనో నా స్నేహితులు వస్తారనో చెబుతారు. అప్పుడైనా ఆలోచిస్తావా ఎందుకని నన్నుచూసి తప్పుకుంటున్నారని..
బాల్యస్నేహమే ఐనా కొద్దికాలం మధ్య వయసు పరిచయాలుకూడా అంతేకానీ వృద్ధాప్యంలో పరిచయం స్నేహం దగ్గిరతనం మాత్రం కడదాకా ఉంటాయి.
ఎవరిని విమర్శించవద్దు. ఎవరిలోనూ లోపాలు ఎంచవద్దు. ఎవరిని దూరం పెట్టవద్దు. ఎందుకంటే నువ్వు కోరుకున్న రోజు హఠాత్తుగా నీ దగ్గిరకు రారు. స్నేహం అవసరం కాదు.
ఒకరికొకరు తోడుగా గతకాలపు జ్ఞాపకాలను పంచుకునే ఆత్మీయత అని తెలుసుకో.
కష్టాలను వూహించకు. ఆశతో ఏవేవో కోరుకోకు. సంతోషంగా ఉండటంగురించి ఆలోచించు..
ఎవరి విషయంలోనూ తలదూర్చకు. నీకునువ్వే ఆనందాన్ని వెదుక్కో. వ్యాపకాన్ని వెదుక్కో.
ఏమిలాభం ఇప్పుడుకొత్తగా నీతో చేరలేరు.. నీకు అవసరం తెలిసిందని జాలిపడరు..
పిల్లలు ఎదిగారు. భార్యకు స్వతంత్రం వచ్చింది. నీకు స్నేహం విలువ తెలియదు. అన్నీవున్నాయి కానీ నీకు ఆసరాలేదు. అందఱూ వున్నారు కానీ ఏకాకివి.
అది నీలోపమే. ఎదుటివారిది కాదని తెలుసుకో. నీకు నువ్వే శాంతిని పొందు.
మనిషి మనుగడ
***
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాగురించి పరిచయం.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు.
చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే
వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)

Comments