మనిషి - ×మనీ
- Pitta Govinda Rao
- Aug 1, 2023
- 3 min read

'Manishi - Money' - New Telugu Story Written By Pitta Gopi
'మనిషి - మనీ' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
కొంతమంది ఉంటారు.. అదృష్టం కొద్దీ ధనవంతులు అవుతారు.
మరికొందరు తండ్రి సంపాదించిన ఆస్తుల వలన లక్షాధికారులు అవుతారు.
ఇంకా చెప్పాలంటే.. తాతలు ముత్తాతలు తమ వారసుల కోసం ఆస్తులు, డబ్బు కూడగట్టి దాచటం వలన సంపన్నులు అవుతారు.
కానీ.. అతి తక్కువ మంది మాత్రమే తమ కష్టం తో సంపన్నులు అవుతారు. అలాంటి వారిలో రమణయ్య ఒకడు.
రమణయ్య ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉన్నాడు.
కారణం.. ?
కలియుగంలో మనిషి కంటే విలువైన వస్తువు ఉంది. అదే డబ్బు.
ఇక రమణయ్య గూర్చి వృద్ధాశ్రమంలో తెలియని తోటి సహచరులు కొందరు ఆయన్ను పలకరించి తన పరిస్థితి గూర్చి అడిగారు. రమణయ్య కు గతం గిర్రున తిరుగుతూ కళ్ళలో నీళ్ళు తప్ప నోట మాట రాలేదు. రమణయ్య కు చూసేందుకు అప్పుడే అక్కడకు వచ్చిన స్నేహితుడు ఒకడు అతడి గూర్చి చెప్పాడు.
"రమణయ్య కష్టపడే వ్యక్తే కాదు గొప్ప ఆలోచన పరుడు. కాబట్టే కష్టంతోనే ఇంత సంపన్నుడు అయ్యాడే కానీ ఒకరి కడుపుకొట్టి కాదు. చేతులతో సహయమే కాదు.. అవసరానికి డబ్బులు కూడా సహాయం చేసి మంచి వ్యక్తి గా పేరు గాంచాడు.
అప్పు కోసం వచ్చిన వారిని కూడా..
"తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అయితే నీ దగ్గర ఉన్నప్పుడు నాలాగానే లేని వారికి ఖచ్చితంగా సహాయం చేయా”లనేవాడు.
మంచిని కోరుకోవటమే కాదు.. మంచిగా బతికాడు, మంచిగా బతుకునిచ్చాడు. ఇంత మంచివాడు అయినా.. కష్టంతో తన ఆదాయం పెంచుకునే గొప్ప ఆలోచన పరుడు అయినా..
తన పిల్లలు తనలా కష్టపడకూడదు అనుకున్నాడో.. ఏమో..
వారిని అసలు కష్టమే తెలియకుండా పెంచాడు.
అయితే పిల్లలు యుక్త వయస్సు కు రాగానే వారి పై కాలం కన్నెర్ర చేసింది. చిన్నవాడికి ప్రాణాంతక క్యాన్సర్ వచ్చింది.
ఆ సమయంలో తల్లడిల్లిన రమణయ్య ఎంత డబ్బు పెట్టడానికి అయినా సిద్దపడి మరీ వైద్యులు తోను, చిన్నకొడుకు విధి రాతతోను పోరాటం చేశాడు.
డబ్బులు ఖర్చు అయితే మరలా సంపాదించుకోవచ్చు కానీ.. మనిషి పోతే మరలా రాడు అని రమణయ్య కు తెలుసు. అందుకే కొడుకు ను ఎలాగోలా బతికించుకున్నాడు.
అయితే అది ఒకటి రెండు రోజుల్లో పూర్తి కాలేదు ఒకటి రెండు సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో సహాయం కోసం వచ్చిన వారిని ఎందుకో తాను సహయపడలేకపోయాడు.
ఏదైతేనేం కొడుకు ను బతికించుకున్నాడు.
ఇక పెద్దవాడు సినిమాలు షికార్లు పేరు తో ఎంతో డబ్బు వ్రుదా చేసినా ఎప్పుడు పల్లెత్తు మాట అనలేదు. సరికదా వాడి ఉద్యోగానికి లక్షల్లో డబ్బులు కట్టాడు.
డబ్బులు కడితే ఉద్యోగం లో స్థిరపడతాడు కదా.. అని ఏ తండ్రికి ఉండదు.. అంతేనా అక్కడితో ఆగకుండా కోడల్ని కూడా వెతికి తెచ్చి ఇంట్లో పెట్టాడు.
చిన్నవాడేమో.. పోరంబోకులా మారి తండ్రి ఆస్తులు పైనే కన్నేశాడు. ఎంతైనా కలియుగం నడుస్తోంది గా.. డబ్బు కు ఉన్న విలువ మనిషి కి ఎక్కడ ఉంటుంది..
ఇద్దరు అన్నదమ్ములు రాజీపడి తండ్రి ఆస్తులు కోసం పోటీపడ్డారు. , ఎదురు చూడసాగారు.
ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసే స్వభావం ఉన్న రమణయ్య చస్తే చస్తాం బతికితే బతుకుతాం అనుకుని ఇద్దరు కొడుకులుకు కష్టపడి పెంచి పెద్ద చేసిన తండ్రి కి విలువ ఇస్తారా.. డబ్బు కు విలువ ఇస్తారా తెలుసు కునేందుకు ముందే ఆస్తులు రాసిచ్చాడు.
అదే అతనిపాలిట శాపం అయింది.
"నాన్నా! రోజువారీ ఉద్యోగం లో ఉంటూ నా దగ్గర ఉండే మిమ్మల్ని చూసుకోకపోతే ఆ పాపం నాకు, నా పిల్లలకు చుట్టుకుంటుంది. అందుకే మిమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తా. అక్కడ నీకు ఏం కావాలంటే అవి వాళ్ళు ఇస్తారు " అన్నాడు పెద్ద కొడుకు.
"నాన్నా! వృద్దులైన తల్లిదండ్రులు పిల్లలకు బారం కాకుండా ఉండాలంటే వృద్ధాశ్రమమే మంఛిది అన్నాడు చిన్నోడు.
అలా రమణయ్య స్నేహితుడు గతాన్ని చెప్పి తాను తెచ్చిన ఆపిల్ ముక్కలను కోసి ఒక్కొక్కరికి ఇస్తూ..
"మనుషులు డబ్బు కు విలువ ఇస్తున్నారో.. మనిషికి విలువ ఇస్తున్నారో.. రమణయ్య కొడుకులు ద్వారా మనం తెలుసుకోవచ్చు " అన్నాడు.
అంతలోనే రమణయ్య స్పృహ తప్పి పడిపోయాడు.. వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆసుపత్రికి తరలించగా రమణయ్య స్వర్గస్తులయ్యారు.
విషయాన్ని ఇద్దరు కొడుకులకు చెప్పగా..
" బతికున్నప్పుడే రూపాయి పెట్టలేదు చనిపోయాక ఆసుపత్రికి డబ్బులు పెట్టి అంత్యక్రియలు చేయటం దండగ. మీరే ఇన్నాళ్లు చూసుకున్నారు కదా.. ఇప్పుడు కూడా మీరే దహన సంస్కారాలు చేయండ" న్నారు
వృద్ధాశ్రమంలో ఉండటం వలన అతని సహాయం పొందిన వాళ్ళకి కూడా విషయం తెలియకపోవటం విచిత్రం.
చేసేదేమి లేక వృద్ధాశ్రమ నిర్వాహకులే స్నేహితుడి సహకారంతో ఒక అనాధ శవంగా రమణయ్య కు దహన సంస్కారాలు చేశారు.
కాలుతున్న శవాన్ని చూస్తూ రమణయ్య స్నేహితుడు
"లక్షల్లో డబ్బు సంపాదించిన మనిషి అదే డబ్బు దగ్గర ఓడిపోయి ఒంటరిగా వృద్ధాశ్రమంలో బతికి, అనాధ శవంగా మారాడు. బతికున్నపుడే మనిషి డబ్బు తో ఓడిపోతే చచ్చాక ఎలా గెలుస్తాడు" అని అనుకుంటు వెనక్కి బయలు దేరుతాడు.
***
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం
Comments