top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

మనిషి సంఘజీవి

మనిషికి ఇతరుల సహకారమవసరము, తప్పదు.


'Manishi Sanghajeevi' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 07/12/2023

'మనిషి సంఘజీవి' తెలుగు కవిత

రచన : సుదర్శన రావు పోచంపల్లి


భూచర జలచర ఖేచర జీవుల యందున

మానవ జీవుల మనుగడ సాగను

మనిషికి మనిషే తోడ్పాటవసర ముండును

పుట్టిన గిట్టిన ఇతరుల సాయము లేకను

ఎట్టి స్థితిలో నైనను బతుకుట ఎరుగను కష్టమె

తల్లి గర్భము నుండి బయటకు తరలిన నాడే

వల్లక ఇతరుల సాయము వగపుయె మిగులును

చచ్చిన నాడును శవమును మోయను

ఖచ్చిత మనగను పలువురి సాయము కావలె ననగను

పొట్ట కూటికై పోరను నిత్యము ఇతరుల సాయం వలదని

బెట్టును జూపిన బెంబేలగునన బతుకునందున

కవితలు వ్రాసిన వినుటకు కావలె జనమన

ఎగుసము జేయుట కెందరొ మనుషులు

సాయము జేయక సాగదు సేద్యము

అన్ని రంగములలొ అందరు ఉంటెనె

మన్నిక జెందుచు మహిలో నిలుతురు

పశువులు పక్షులు చేపలు మరియును ఇతర జీవులు

ఎవరి సాయము ఎరుగక నుండగ

మానవ జాతియె మనుగడ సాగను

కావలె సాయము కాటికి జేరే వరకును .


- సుదర్శన రావు పోచంపల్లి


24 views1 comment

1 Comment


Surekha Arunkumar
Surekha Arunkumar
Dec 07, 2023

Sir, కవిత సూపర్

Like
bottom of page