కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link

'Marachipovalani marachi Thalusthunnaa'
New Telugu Story Written By Kidala Sivakrishna
రచన: కిడాల శివకృష్ణ
సాయంత్ర కాలంలో చెరువు గట్టుపై మిత్రులతో కలసి, శివ మిరపకాయ బజ్జీలు తింటూ ఉన్నాడు. ఆ సమయంలోనే మంచి చల్లని గాలి తాకుతూ ఉంది. ఏదో తెలియని ఉత్సాహంతో మనసు ఉరకలు వేస్తూ ప్రశాంతంగా ఉంది.
బజ్జీలు తిన్న తర్వాత మాటలలో తమ ప్రేమ వ్యవహారాల గురించి చర్చిస్తూ ఉంటే, ఒక్కసారిగా శివకి తన ప్రేయసి కళ్యాణి గుర్తుకు వచ్చింది. ఎందుకో శివ కళ్ళలో శివకే తెలియకుండా సముద్రం కనిపిస్తోంది.
ఆ ఘటనను చూసిన శివ మిత్రులు “ఏరా.. ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు..” అంటూ ఓదార్చ సాగారు.
అప్పుడు శివ “ఏమీ లేదురా! గాలి ఎక్కువగా రావడం వలన నా కంట్లో నలుసు పడి కన్నీళ్లు వచ్చాయి” అంటూ నచ్చచెప్పి అందరినీ ఇంటికి పంపి అక్కడే కూర్చుండిపోయాడు.
అయినా తన ప్రేయసి అయిన కళ్యాణిని మరచి పోవాలని సులభంగా నిర్ణయించుకున్నా, ఆ విషయాన్ని మాత్రం శివ మరచిపోయి మరలా తలుచుకుంటూ తన ఊహాలలోకి వెళ్లి పోసాగాడు.
తన ఊహా ప్రపంచంలో మూడు సంవత్సరాల వెనక్కి పోయాడు శివ.
పదేడేళ్ళ వయసున, తరగతి గదిలో కళ్యాణిని చూసేసరికి శివకి మతి పోయింది. చామంచాయ రంగుతో, చంద్రబింబం లాంటి ముఖంతో, చిరునవ్వులు పూయిస్తూ కిలకిల నవుతూ ఉంది కళ్యాణి. ఆ సమయంలోనే శివ మనసులో నిలిచి పోయింది కళ్యాణి. తనతో మాట్లాడాలని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శివ. ఆ ప్రయత్నాలలో మూడు సార్లు విఫలం అయ్యాడు.
నాలుగో సారి కళ్యాణితో మాట్లాడేందుకు అవకాశం వచ్చింది.
“కళ్యాణీ నువు నాకు నచ్చావు, నువ్వంటే నాకు ఇష్టం" అని చెప్పాడు. ఆ మాట విన్న కళ్యాణి ఉలుకు పలుకు లేకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి శివ మనస్సులో భయంతో పాటుగా అలజడి కూడా మొదలైంది. కళ్యాణి ఏమి చెపుతుందో అనే భయం శివను నిరంతరం వెంటాడుతూ ఉంది. ఆ అలజడితోనే నెల రోజులు గడిపాడు శివ.
తర్వాత అలజడి తగ్గింది, కళ్యాణి నుంచి ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అనే మాటతో.
అయినా తన ప్రేమను చూపడం ఆపలేదు శివ. మరలా తిరిగి ఆరు నెలల తర్వాత తన స్నేహితురాలి సహాయంతో కళ్యాణి మనసులోని మాటను తెలుపమని ప్రాధేయపడ్డాడు శివ.
కళ్యాణి, “నువ్వంటే నాకు ఇష్టం లేదు” అని చెప్పుకొచ్చింది.
అప్పుడు శివ “కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం” అని చెప్పాడు.
కళ్యాణి “నేనంటే నీకు ఇష్టం అయితే నన్ను మరచిపో” అని చెప్పి వెళ్ళిపోయింది.
శివ మాత్రం బాధపడుతూ అక్కడే ఉండిపోయాడు.
కళ్యాణి స్నేహితురాలు “ఎందుకు ఇలా చెప్పావు? నిజం చెప్పు కళ్యాణీ.. నీకు శివ అంటే ఇష్టమా.. లేదా..?” అంటూ అడిగింది.
అప్పుడు కళ్యాణి “శివ అంటే నాకు ఇష్టమే” అంది.
“మరెందుకు మరిచిపొమ్మని చెప్పావు” అంటూ ప్రశ్నించింది కళ్యాణి స్నేహితురాలు.
అప్పుడు కళ్యాణి “శివని నేను ప్రేమిస్తున్నాను. కాబట్టే కష్ట పడకుండా సుఖంగా ఉండాలని కోరుకుంటూ నా మీద ధ్యాస లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాను” అంది.
“ఆ విధంగా చేయడం ద్వారా ఎలా మంచి చేసినట్లు అవుతుంది?” అంది కళ్యాణి స్నేహితురాలు.
“అంటే నేను ప్రేమిస్తున్నాను అంటే నా మీద ధ్యాసతో తను సరిగ్గా చదవకపోవచ్చు, అంతే కాకుండా నిరంతరం నా కోసం సమయం కేటాయించడం జరుగుతుంది. ఇదంతా చేసినా మేము ఇద్దరం కలసి జీవిస్తాం అనే గ్యారంటీ లేదు. నన్ను పొందడం ద్వారా శివ చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తప్ప, సంతోషంగా మాత్రం ఉండలేడు అని నాకు అనిపిస్తుంది. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది” అంది కళ్యాణి.
“ఇలా చెప్పడం వలన నీవు ఒక దోషిగా మాత్రమే శివ మనస్సులో మిగులుతావు కదా కళ్యాణీ” అంది కళ్యాణి స్నేహితురాలు.
అప్పుడు “ప్రేమంటే కలిసి జీవించడం మాత్రమే కాదు. ‘మన’ అనుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా జీవించాలి అనుకోవాలి. అదే నేను చేస్తున్నాను. కానీ నన్ను శివ ఎలా అనుకున్నా పరువాలేదు. ఎందుకంటే నాకు శివ సంతోషం ముఖ్యం. అంతే కానీ శివ ఏమనుకుంటాడో నువ్వేమనుకుంటావో నాకు అనవసరం” అంది కళ్యాణి.
ఈ విషయం తెలియని శివ మాత్రం కళ్యాణిని మరిచిపోతే తను సంతోషంగా ఉంటుందా అని సందేహంలో పడ్డాడు. ఎలాగైతేనేమి కళ్యాణి సంతోషం నాకు కావాలి అని తనను మరచిపోవాలని అందరికీ దూరం దూరంగా ఉంటున్నాడు శివ.
ఈ సంఘటనను గమనించిన శివ స్నేహితురాలు “ఎందుకు శివా బాధపడుతున్నావు?” అని అడిగింది.
అప్పుడు శివ “తనను మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
“అరే పిచ్చోడా.. నీకు తెలియని విషయం ఏమిటి అంటే నువ్వు బాధపడకూడదనే కళ్యాణి తనను మరచిపోమని చెప్పింది. అంతే కానీ నీ మీద ప్రేమ లేక కాదు” అని చెప్పింది శివ స్నేహితురాలు.
“అలా ఎందుకు చెప్పాలి మరీ?” అన్నాడు శివ.
“ఎందుకంటే నువ్వు తన ప్రేమలో పడి ఎక్కడ జీవితాన్ని కొల్పోతావో అనే భయంతో అలా చెప్పింది” అంది శివ స్నేహితురాలు.
“అవునా.. నిజంగానా!” అన్నాడు శివ.
“నిజమే” అంది ఆమె.
“ఓ.. చాలా థాంక్స్! ఎలా అయితేనేమి, నేను నా ప్రేమలో విజయం సాధించాను” అంటూ తెగ సంబరపడి “తనను మరచిపోతాను” అంటూ చెప్పుకొచ్చాడు.
సడెన్ గా చినుకులు పడ్డాయి. వెంటనే వర్తమానంలోకి వచ్చాడు శివ.
అరే.. నేను 'నా కళ్యాణిని మరచిపోవాలి' అనే విషయం మరచిపోయాను కదా! అనుకుంటూ తనలో తను నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు శివ.
సర్వే జనా సుఖినోభవంతు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :
నా పేరు: కిడాల శివకృష్ణ.
కలం పేరు:- రాయలసీమ కన్నీటి చుక్క....✍️✍️✍️✍️
వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ ఖాళీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.
నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.
Comments