top of page
Writer's pictureLakshminageswara Rao Velpuri

మరమనుషులు


'Maramanushulu' New Telugu Poem


Written By Lakshminageswara Rao Velpuri


రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


అందాల పల్లెకు పండుగొచ్చింది

అంతులేని ఆనందం వెల్లివిరిసింది

ముత్యాల ముగ్గులతో రంగవల్లులు

పసుపు కుంకుమ బొట్లతో నిండైన ఇంటి గుమ్మాలు

సాదర స్వాగతాలు పలుకుతున్నవి ఈ ఏటి మేటి పండగకు

తెల్లారి పోయింది పల్లె లేచింది కనువిందైన పండుగకు

కొత్త అల్లుళ్ల రాకతో సరదాల సరిగమలతో

పిల్ల పాపల ఆనందం

నిండు ముత్తయిదువుల లక్ష్మీ పూజలు

ఇంటింటా స్త్రీ జాతి నోముల పండగ

కంటికింపైన సువాసన భరితమైన పుష్పాలంకరణ

పల్లె నిండా వెల్లి విరిసే

రుచికరమైన షడ్రసోపేత భోజన వంటకాలు

కల్మషం లేని మనుసుల కిలకిల నవ్వులు

పండుగ కోసం తోలుబొమ్మలాటలు

బుర్రకథ హరికథ కార్యక్రమాలు

మనదేశ సంస్కృతికి నిదర్శనాలు

కోయిల కమ్మని రాగాలతో పశుపక్ష్యాదుల అలజడితో

పండుగ వచ్చింది మా పల్లెకు

సుఖసంతోషాల మేలి కలయికతో

కానీ పరిస్థితుల ప్రభావం వలన

పల్లె లను వదిలి పట్నం బాట పట్టిన కుటుంబాల పరిస్థితులు ఎటు ఇమడలేక

సతమత మవుతూ బాధపడుతూనే ఉన్నారు

పండుగ పబ్బాలకు కిక్కిరిసిన పట్టణాలు వదలి స్వగ్రామమునకు వచ్చిన వేళ

ఆనంద పరవశులై

ఆ తీపి గుర్తులతో తిరిగి పట్టణమునకు వచ్చి

ఈ ఆధునికత నిండిన నగరంలో మరమనుషుల వలె జీవిస్తూ


నగర కాలుష్యంలో నరకయాతన అనుభవిస్తూ

స్వచ్ఛమైన పల్లె వాతావరణాన్ని గుర్తు చేసుకుంటూ

అది ఒక మధుర స్మృతి లా భావించుకుంటూ

యాంత్రికమైన జీవనాన్ని నగర ప్రజలు అనుభవిస్తున్నారు

***************

వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.



16 views0 comments

Comments


bottom of page