'Marandi Mahilalu' - New Telugu Article Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 18/06/2024
'మారండి మహిళలూ!' తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
హైదరాబాద్ నగరం విదేశాలతో సమానంగా అన్ని రంగాలలోను అభివృద్ధి చెందుతోంది. కొన్నిటిని విదేశాలనుంచి అనుకరిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు స్వేచ్ఛా విహంగాలుగా తయారు అయ్యారు.
ఆధునికతకు నేను వ్యతిరేకం కాదు. కానీ కొన్ని విషయాల్లో ఒక పరిధి ఉండాలి అంటాను. అలాగే పాతకాలం నాటి అర్ధంలేని ఆచారాలను నేను ఇష్టపడను. మా కుటుంబాలలో ఎవరైనా పాటించాలి అంటే నేను ఖండిస్తాను. ఈ ఆచారాలు పెంచి పోషించేది ఆడవాళ్లు అనేది నిజం. మగవారు చివరికి పురోహితులు కూడా '' మీకు నచ్చినట్టు చేసుకోండి.. ” అని తప్పుకుంటారు.
మా దగ్గిర బంధువు వరుసకు పిన్నికూతురు భర్త చనిపోయారు. అతని వయసు ఏభై. అతడు ఆదర్శవాది. సాంప్రదాయాలు అంటూ ఆడపిల్లలకు అన్యాయం జరిగితే అడ్డుపడేవాడు. కర్మకాండలపట్ల నమ్మకాలు లేవు. వాళ్ళ ఇరవై మూడేళ్ళ కొడుకు డాడీకి నచ్చినట్టు చేస్తాను అని పాటించాడు.. తండ్రి పోయినపుడు అతడి తల్లి మాత్రం కోడలిని సాంప్రదాయం ప్రకారం చేయాలి .. అంటూ పట్టుపడితే ఎదిరించి అమ్మని కాపాడుకున్నాడు.
ఆవిడకు అమెరికాలో ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు. అటుఇటూ తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్య నేను అమెరికా నుంచి వచ్చాక చూడటానికి వెడితే మా కజిన్ నన్ను చుట్టుకుని బావురుమంది, అన్ని విషయాలు చెప్పి.
నాదగ్గిర చనువు ఎక్కువ. మాఇంటికి దగ్గిర వాళ్ళ ఇల్లు. కనుక మాఇంటికి తీసుకువచ్చి ధైర్యం చెప్పాను.
''ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కనుక ఎవరినైనా ఎదిరిస్తాను ''అంది.. నా కజిన్.
''నేను ఎన్నిరోజులో ఉండను. ఆరునెలలు నీకు చాలు, ఒక దారిలోకి రావడానికి. ఫైనాన్స్ మేటర్, పిల్లల చదువు, ఇంటి విషయాలు నువ్వే చూసుకుంటున్నావు. ఏమి వర్రీ అవ్వకు. ఎవరికీ నువ్వు సమాధానం చెప్పవలసిన పనిలేదు. నీ ఇష్టప్రకారం నీ కొడుకుతో ఆలోచించి చేసుకో” అంటూ నాలుగు మంచిమాటలు చెప్పేక కుదుటపడింది.
ఒకరోజు వాళ్ళ అత్తగారు వచ్చిందిట. నేను తాళి నల్లపూసలు వేసుకోరాదంటూ గొడవ చేసిందని మకజిన్
ఏడుస్తూ ఫోను చేస్తే వెంటనే నేను, మావారు వెళ్లి ఆవిడకి బ్రెయిన్ వాష్ చేసాం.
“ఏమండీ.. మీరు మీ భర్త పోయినపుడు ‘నేను మాంగల్యం తీయను, సూత్రాలు తీయను, బొట్టు తీయను,
మా ఆయన అలా వుంచుకోమని చెప్పేరు’ అంటూ మీ అత్తగారిని ఎదిరించారు.
చిన్నపిల్లను ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చిన మార్పుకు సమర్దించాల్సింది మీరే.. ఇది తప్పుకదూ.. మీకో సాంప్రదాయం మీ కోడలికో సంప్రదాయమూనా .. మీకు నోరెలా వచ్చింది? మర్యాద ఇచ్చి పుచ్చుకోండి.
అమ్మాయికి నేను తోడు వున్నా అని dhiryam చెప్పండి. లేదంటే మీరు ఇక రాకండి.
మీ అబ్బాయితోనే బంధుత్వం తెగిపోయింది. మంచిగా ఉంటే తల్లిలా తోడువుంటేనే రండి..” అంటూ ఆవిడకు చీవాట్లు పెట్టేం.
ఆవిడ దిగివచ్చి, “నాకు పర్వాలేదండి, ఇరుగూ పొరుగు ఏమనుకుంటారో అని .. అంతే..” అంటూ మర్నాడే
ఆవిడవుండే ఊరుకి వెళ్ళిపొయిన్ది. సాగితే పెత్తనం చేస్తుంది.. లేకుంటే సైలెంట్ అయి పోతుంది. అదీ ఆవిడ బుద్ధి.. అని అర్ధం అయింది నాకు.
ఆవిడ సమస్య తీరింది. కానీ చూడండి .. పక్క ఫ్లాటులోకి వచ్చిన మరో బంధువు ''ఉదయం పూట బయటకు రాకు. ఏడాదివరకూ ఎవరి ఇంటికి వెళ్ళకు.. ఆరోగ్యం బాగుండనివాళ్లను చూడకు.
నువ్వు వెళ్లి వచ్చాక కర్మ కాలి వాళ్ళు పొతే .. నిన్నే అంటారు, ‘నువ్వు వచ్చావు.. అందుకే నాకూ ఇలా జరిగింది’ అని” అంటూ వూరికే సతాయించేదట.
అప్పుడు నేను అన్నాను.
''ఇది నాయిల్లు. నాఇష్టం వచ్చినట్టు వుంటాను. నీకు తప్పుగా అనిపిస్తే నువ్వే ఇల్లు మారు.. అని ధైర్యంగా చెప్పు. అందరికంటే చిన్నదానివి. నిన్ను వేధిస్తే వాళ్ళకే కీడు జరుగుతుంది.. వాళ్ళు ఏది చేయకు అని చెబితే అదే చేసి చూపించు.
‘మీకూ ఏదోరకంగా కష్టం వస్తుంది.. నువ్వు ఏమి సుమంగళిగా వుండవు. నన్ను బాధపడితే ఏమి వస్తుంది
నీకు..’ అని దులిపి పారేయి..” అన్నాను కోపమొచ్చి.
నేను చెప్పినట్టు అది చెప్పలేదు కదా! అని జాలివేసింది.. నాకు.
“ఈ సారి మీ ఇంటికి వచ్చినపుడు నాకు పరిచయం చేయి. చెబుతా ఆవిడపని” అన్నాను.
చాలా రోజులకు నాకు అవకాశం వచ్చింది.
''ఏమండోయి, బంధువులు కావలసినవాళ్లు కనిపెట్టి వుంటారు.. అనుకున్నా ! మీకు ఇదేం బుద్ధి? మా చెల్లి సుమంగలిగానే ఉంటుంది. మీకు నచ్చకపోతే ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళండి. దాని ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. ఏం చేస్తారు?” అన్నాను.
ఆవిడ తలుపులు మూసుకుంది లోనికిపోయి.
మా కజిన్ కొడుక్కి అమెరికాలో MS చేయడానికి వీసా వచ్చింది. నేను సిటిజెన్ ని కనుక మా కజిన్ కి
విజిటర్స్ వీసా ఇప్పించి నాతోబాటు అమెరికా తీసుకుని వచ్చాను.
ఇక్కడ ప్రశాంతంగా హాయిగా వుంది. ఇంతకీ అందరూ అమెరికా వెళ్ళలేరు.
ఏమి మారింది.. మనుషులు ఎప్పటి ఆలోచనలతోనే మూఢ నమ్మకాలతోనే వున్నారు.
మనసులు కుళ్లిపోయాయి. ఫ్యాషన్లు, జుట్టు కత్తిరించుకోడం, మేకప్పులు చేసుకోడమూ, పిజ్జాలు బర్గర్లు
తినడం, వొళ్ళుకదలకుండా టీవీలకు అతుక్కుపోడం కాదు. లేదంటే దేముడు పూజలు అంటూ ముసుగు వేసుకోడమూ కాదు. మనిషికి కష్టమొస్తే ఆదుకోడం నేర్చుకోండి. మూఢ నమ్మకాలు పెంచిపోషించే పనులు మానుకోండి.
మరణం శాపం కాకూడదు. అనుకోని దుర్ఘటన. ఆ షాక్ నుంచి తేరుకోడం సులువుకాదు, చిన్నవాళ్లకు. పెద్దవారు ఐతే సిద్ధంగా వుంటారు.
అల్లకల్లోలం అయిన ఆమె మనసును సేద తీర్చే ప్రయత్నం చేయడం మన బాధ్యత.
బాధకు ఉపశమనం ఏమిటో చూడాలి. రాక్షసుల్లా ప్రవర్తించకూడదు. కొత్త జీవితం ఉంటుందని జరిగింది మరిపించే దారి ఏమిటో వెదకాలి. చేయూత ఇవ్వాలి. మంచి మాటలతో బాధను మరిపించాలి.
అందరిలో ఆదర్శంగా ఉండాలి. అది తోటి మహిళల కర్తవ్యమ్ కావాలి. ఇదే నా సందేశం.
**************************************************************************
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
Comments