#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #MarkataPrahasanam, #మర్కటప్రహసనం, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
'Markata Prahasanam' - New Telugu Story Written By Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 26/10/2024
'మర్కట ప్రహసనం' తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆ రోజు ఉదయం నీటి పారుదల శాఖ మంత్రి తేలు డాంబిక రావు (తే. డా) ప్రశాంతం గా న్యూస్ పేపర్ చదువుతుండ గా "సార్" అంటూ ఇంటి పనిమనిషి పొన్నియన్ కంగారు గా వచ్చాడు.
"ఏమిటి? ఎందుకా తొందర?" అడిగాడు తేడా.
"ఎక్కడ నుండి వచ్చిందో ఓ కోతి మన మామిడి చెట్టు కొమ్మలు విరిచింది. అద్దాలు పగలు గొట్టింది. తొందర గా కోతులు పట్టే వాడికి కబురు పెట్టండి" అన్నాడు పొన్నియన్ గాబరాగా
"ఏమిటిరా జీవితం ప్రశాంతం గా సాగుతోంది. అనుకున్నా" అని మునిసిపల్ కమిషనర్ కీ ఫోన్ చేసాడు.
"సార్ చెప్పండి," అన్నాడు కమిషనర్ కనకారావు.
"బాబూ కనకం, ఓ కోతి వచ్చింది ఇల్లంతా పాడు చేస్తోంది, ఇప్పటీకే ఇల్లు సగం పాడు చేసింది. కోతులు పట్టే వాడిని పంపు"
"తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందిట"
"నిన్ను సామెతలు చెప్పమనలేదు. త్వరగా మనుషుల్ని పంపు. అసలే నా భార్య ఐరావతం తన పట్టు చీర పాడు కోతి చించిందని కారాలు, మిరియాలు నూరుతోంది"
‘ఇంత మంత్రి ని చాతకాని మనిషి అని పెద్ద మాట అనేసింది’.. మనస్సు లో గింజుకున్నాడు తే. డా.
"ఇద్దరి లో ఒకడు పెళ్ళి చేసుకుని గోవా వెళ్ళి పోయాడు. ఇంకోకడు త. చె పొ. చె లో ఉన్నాడు" అన్నాడు కమీషనర్.
"త. చె పొ. చె అంటే..” అసహనం గా అన్నాడు తేడా!
" అదే సార్ తడి చెత్త పొడి చెత్త "
" చెత్త గోల ఆపు. ఎవడి నో ఒకడిని పంపు "
" సరే సార్ "
*******
నీటిపారుదల శాఖ మంత్రి గారింట్లో మర్కటం కల కలం!
టీవి 24 లో వార్తలు ప్రారంభమయ్యాయి.
“మిగిలిన వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ ఇస్తాడు” అని మొదలు పెట్టింది న్యూస్ రీడర్ స్వప్న
"చెప్పు ప్రదీప్, అసలు కోతి మంత్రి గారింట్లో ఏలా ప్రవేశించింది? "
"అదే స్వప్నా, అడవినుంచి పారిపోయి ఇంట్లో కి వచ్చి ఉండవచ్చు అంటున్నారు"
"ఇంతకీ తే. డా ఏమంటున్నాడు?"
"ఇది ప్రతి పక్షాల కుట్ర అని చెబుతున్న దృశ్యం మనం చూస్తున్నాం"
"సరే ప్రస్తుతం కోతి ఎక్కడ ఉంది? "
" అదే సుమా, తెలియడం లేదు. చెట్టు నుండి దూకి గార్డెన్ లోకి వెళ్ళిందంటున్నాడు పొన్నియన్ "
సరిగ్గా అదే సమయం లో కోతి వచ్చి ప్రదీప్ ని గీరి, మైక్ ని లాక్కుని పోయింది.
టీవి 24 లో వార్తా ప్రసారం తాత్కాలికం గా ఆగింది.
********
"ఇదిగో నువ్వు ఇవ్వాళ మంత్రి గారింటి కెళ్ళి కోతి ని పట్టాలి. కుక్క ని కాదు. మామూలు గా కుక్కలు పట్టడం నీ రెగ్యులర్ డ్యూటి. ఇది స్పెషల్ డ్యూటి." చెప్పాడు కమీషనర్.
"షరే సార్" అన్నాడు తాగుబోతు తంగవేలు.
"ఏంట్రా, ఉదయమే పుచ్చుకున్నావా?"
" లేషు సార్, చాల్రోజులకి నా బ్రాండ్ మార్కెట్ లోకి వచ్చిందని 10 ml పుచ్చు కున్నా."
"త్వరగా మంత్రి గారింటికి తగలడు"
"అలాగే షార్! " అని తూలుకుంటూ తంగవేలు మంత్రిగారింటికి బయలుదేరాడు.
*******
టీవి 24 లో వార్తలు మెదలయ్యాయి.
"మా ప్రతినిధి ప్రదీప్ పై కోతి దాడి చెయ్యడం తో
లైవ్ ఇవ్వలేక పోతున్నాం. ఈ లోగా నరుడు-వానరుడు చర్చా కార్యక్రమం చూడండి. "
జర్నలిస్ట్ వామనరావు చర్చ మొదలు పెట్టాడు.
"మన మంత్రి గారు తన ఇంట్లో కోతి రావడానికి కారణం ప్రతి పక్షాల కుట్ర అన్నారు. మీరేమంటారు?"
"అదే మరి నోరు జారడం. ప్రతి పక్షం ఏమైనా బోను లో పెట్టి ఇంట్లో వదిలిందా? "
"ఐనా ఇంట్లో కోతులు ఉండగా బయటినుండి రావాలా!? " అన్నాడు ప్రతిపక్ష నాయకుడు ప్రసాద రావు వ్యంగ్యం గా.
తే. డా లేచి "మాట తేడా గా ఉంది. సరిగ్గా మాట్లాడక పోతే తలలు లేచిపోతాయి" అని హెచ్చరించాడు టీవి 24 ని.
వామనరావు చర్చ గాడి తప్పుతోందని గ్రహించి, ఎదురుగా ఉన్నా సామాజిక శాస్త్రవేత్త సన్యాసి రావు ని అడిగాడు
"ఎందుకు కోతులు మనుషుల తో ఉండడానికి ఇష్ట పడతాయి?"
"అదే డార్విన్ చెప్పింది. కోతి నుండి మానవుడు వచ్చాడని. ఇద్దరికీ తోకలు ఉంటాయి. మానవుల తోక సూక్ష్మం గా ఉండి కనబడదు. కోతి తోక పొడుగ్గా ఉండి అందరికీ కనబడుతుందీ. అదీ విషయం" అనీ తను పిఎచ్ డి తీరి వెలగ బెట్టాడు.
తోకల చర్చ జరుగుతుండగా ప్రతి పక్ష నాయకుడు
"కొంతమంది తోకలు ఊపితే కనబడుతుందీ. అదే పార్టీ గుర్తుకి. కొంతమంది కి తోక ఊపినా కనబడదు." అని చెప్పాడు.
"తోక లేని వాళ్లు చింపాంజీ లా మీ పార్టీ వాళ్ళ ల్లా”
అడిగాడు ఇంకొకాయన.
తలా,తోక లేని చర్చ కొనసాగుతున్నప్పుడు, ఆఫీస్ మీద దాడి జరుగుతుందని ఫోన్ రావడం తో చర్చ ని వామన రావు ఆపేసాడు.
*******
తంగవేలు కోతి ని వెదకడం మొదలు పెట్టాడు. కానీ కనబడలేదు. ఈ లోపు లో మందు గుర్తు కొచ్చి " నిజం చెప్పేవోడు తాగడు. తాగే వాడు నిజం షెప్పి తీర్తాడు. అని పేరడీ సాంగ్ అందుకున్నాడు.
"బాబూ నీ బ్రాండ్ బ్లెండర్స్ ప్రైడ్ ఉంది. ఫుల్లు పీకుదు గాని రా... రా"
తంగవేలు గది లోకి వెళ్ళ గానే కోతి కనిపించింది. అమాంతం దాని మీద పడి దాన్ని సంచీ లో కుక్కి గబా గబా ఆఫీస్ కి పరిగెత్తి, కమిషనర్ కి చెప్పాడు. మంత్రి గారింట్లో కోతి ని పట్టానని.
"వెరీ గుడ్, మంత్రి గారికి విషయం చెప్తాను. రివార్డ్
ఇస్తారు"
"ఓల్డ్ మాంక్ ఫుల్ కొట్టేష్తాను"
"మా వాడు కోతిని పట్టేసాడు. మీకు మంకీ ప్రాబ్లెం సాల్వ్ ఐంది"
"ఏంటీ కనకం సాల్వ్ ఐంది. ఉడతలు పట్టె వాడిని పంపి, కోతి దొరికిందంటావా? అది ఇప్పుడే నా ముఖం గీరేసి పోయింది!" అని ఆవేశం తో ఊగిపోయాడు తే. డా ఉప్పెన వచ్చినట్టు.
కమిషనర్ కి బుర్ర తిరిగిపోయింది.
అప్ఫుడు తంగవేలు తెచ్చిన సంచీ చూసాడు.
అందులో మంత్రి గారి మనవరాలు ఆడుకునే బొమ్మ కోతి ఉంది!
"ఒరే తంగా, నువ్వు బాగుపడవు రా! డిస్మిస్, వెళ్ళి బార్ లో కప్పులు కడుక్కో" అన్నాడు కమిషనర్
"కోతిని తెష్షి నా తిడుతున్నారు"
అని తూలుతూ వెళ్ళి పోయాడు తంగవేలు.
********
కోతి సమస్య సాయంత్రం తీరింది. పొన్నియన్ దానిని మేడ మీద స్పృహ లేకుండా ఉండడం చూసి, గన్ని బ్యాగ్ లో బంధించాడు. విషయం ఏమిటంటే తంగవేలు, బొమ్మ కోతి ని బ్యాగ్ లో వేస్తున్నప్పుడు, అసలు కోతి, తంగవేలు బ్లెండర్స్ ప్రైడ్ ని ఎత్తుకెళ్ళి, ఫుల్లు గా కొట్టి మేడ మీద పడిపోయింది.
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
Comments