మార్పు - పార్ట్ 5
- Sudha Vishwam Akondi
- 6 days ago
- 3 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #మార్పు, #Marpu, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika, #TeluguSerialEpisode

Marpu - Part 5/6 - New Telugu Web Series Written By Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 04/04/2025
మార్పు - పార్ట్ 5/6 - తెలుగు ధారావాహిక
రచన: సుధావిశ్వం ఆకొండి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
భాగవతంలోని పద్యాన్ని అపహాస్యం చేస్తాడు డైరెక్టర్ పరాక్రమ్.
అతని కొడుకు సాకేత్ వేగంగా కారు నడిపి యాక్సిడెంట్ కు గురై ఐ సి యు లో చేరుతాడు. పరాక్రమ్ లో కొంత మార్పు గమనించిన అతని తల్లి శారదమ్మ మంచి సినిమాలు తియ్యమని కొడుక్కి చెబుతుంది. ఆరోజే ఆమె మరణిస్తుంది. ఆమె మరణంతో పరాక్రమ్ లో కొంత మార్పు మొదలౌతుంది. పరబ్రహ్మ శాస్త్రి గారి మాటల ప్రభావం కూడా అతనిపైన పడుతుంది.
తన భార్య మాలిని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతాడు రంగనాథ్. కానీ శవం కనిపించదు.
ఇక మార్పు ధారావాహిక పార్ట్ 5 చదవండి.
ఉదయం నిద్రలేవగానే ఫ్రెష్ అయి జయంతిని పిలిచాడు పరాక్రమ్.
"జయా! రంగా నిద్ర లేచాడా?"
"ఉదయమే లేచినట్టున్నారు. ఎప్పుడు లేచింది తెలియదు. అలా కూర్చుని ఉండడం చూసి, ఇప్పుడే మిమ్మల్ని పిలుద్దామని అనుకుంటున్నాను. మీరే అడిగారు"
"ఓ! ఇంకా అదే షాక్ లో ఉన్నట్టున్నాడు. నువ్వు కాఫీ పట్టుకుని రా!" అని చెప్పి, హాల్ లోనికి వచ్చాడు.
హాల్ లో మౌనంగా కూర్చున్న మిత్రుడు రంగనాథ్ వద్దకు వచ్చి, పక్కనే కూర్చున్నాడు పరాక్రమ్. అతడు శూన్యంలోకి చూస్తున్నాడు.
మూడ్ మారుతుందని టీవీ ఆన్ చేసాడు. ఒక్కో ఛానెల్ లో ఒక్కో రకమైన కథనాలు వస్తున్నాయి.
"దిక్కుమాలిన సినిమాలు రాసి, తీసి, జనాల మీదికి వదిలాడు. చేసిన పాపం ఊరికే పోతుందా! కొడుకు సర్వనాశనం అయ్యాడు. పెళ్ళాం చచ్చి పోయింది. శవమే గాయబ్! ఇతడే చంపి మాయం చేసి ఉంటాడు" ఇలా రెచ్చిపోయి చర్చలు చేస్తున్నారు ఛానళ్లలో కూర్చుని.
ఆశ్చర్యం ఏమిటంటే,
"చాలా గొప్పగా తీస్తారు సార్! మీ సినిమాలు అద్భుతంగా ఉంటాయి. మంచి పంచ్ డైలాగులతో, హాలీవుడ్ సినిమాలను తలపించే అద్భుతమైన సినిమాలు" అంటూ ఈయనను ఆకాశానికి ఎత్తేసినవారే ఇలా మాట్లాడుతున్నారు. రెండు నాల్కల మనుషులు. నిర్లిప్తంగా చూస్తున్నాడు రంగనాథ్.
చిరాకు వచ్చి టీవీ ఆపేసాడు పరాక్రమ్.
"చూశావా! మనిషికి మనీ ముఖ్యమే కాదనను. కానీ విలువలకు తిలోదకలిచ్చి సంపాదించడం, ఎంజాయ్ పేరుతో పశువుల్లా ప్రవర్తించడం అన్నది ఎప్పటికైనా హాని చేస్తుంది. మాలిని చెప్పిన మాట విని ఉండి ఉంటే, తను బ్రతికి ఉండేది. వీడూ జైలు పాలయ్యే వాడు కాదు" అన్నాడు పరాక్రమ్.
అభావంగా చూస్తున్నాడు రంగనాథ్. ఇంతలో కాఫీ ట్రే తో వచ్చింది జయంతి. వాళ్లిద్దరికీ చెరో కప్పు కాఫీ ఇచ్చింది. తనో కప్పు తీసుకుని మరో సోఫాలో కూర్చుంది.
"మాలిని ఎన్నోసార్లు నాతో తన బాధ చెప్పుకుంది అన్నయ్యా! మీవాడు చేతులు దాటిపోతున్నాడని ఎన్నోసార్లు వాపోయింది. మనిషికి ఎంజాయ్ మెంట్ ఉండొచ్చు. కానీ అది మితిమీరిపోకూడదు. ఆనందంగా వుండే హక్కులు ఉంటాయి కానీ అవి శృతిమించ కూడదు. వాటితో పాటు కొన్ని బాధ్యతలు ఉంటాయి.
కష్టపడి ఎంతైనా సంపాదించవచ్చు కానీ అది ఎవరికీ హాని కలిగించకూడదు. అత్తయ్య ఎప్పుడూ చెప్పేవారు..
ఒకరు బాగుపడే విధంగా మనం చేయలేకపోయినా పర్వాలేదు కానీ మన మాట వలన కానీ, మన నడక వలన కానీ ఒకరు నాశనం అయితే అది ఎప్పుడూ మంచిది కాదు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అది చెడు చేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలనేవారు.
మీవాడు ఇలా తయారవుతున్నాడని మాలిని చెప్పినప్పుడన్నా విని, మీరు తండ్రిగా తగిన చర్యలు తీసుకుంటే, పరిస్థితి ఇంతగా దిగజారి ఉండేది కాదు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు తెలుసుకుని, పశ్చాత్తాపం చెందితే బాగుంటుంది. మీ వాడిని జైల్లోనే వుండనివ్వండి. అక్కడ మంచి ప్రవర్తన కలిగినప్పుడు, దేవుడి దయ వల్ల విడుదల అయ్యి మంచి వాడిగా అవుతాడు" అని ఇంకా మాలిని రాసిన ఉత్తరం గురించి చెప్పింది.
అదంతా మౌనంగా విని, చేతులు కళ్ళకు అడ్డు పెట్టుకుని రోదించసాగాడు.
పరాక్రమ్ ఓదార్పుగా వీపుపైన చేతితో నిమిరాడు.
జయంతి..
"ఇంతకీ మాలిని ఏమైనట్టు? చనిపోతే శవం అయినా ఉండాలి కదా! ఎలా వెదకడం?" అంది
"అవును. ఓసారి మనం వెళ్లి, బంగ్లా అంత వెదికి వద్దామా!"
"మీ ఫ్రెండ్ ను పిలువండీ! అతను సిఐ కదా! ఎలా చేయాలో చూడవచ్చు. లేదంటే మళ్లీ ఏవేవో అసత్య ప్రచారం చేస్తారు"
సరేనని సిఐ అశోక్ కి కాల్ చేసాడు.
"హలో! అశోక్! ఓసారి ఇంటికి రాగలవా! చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి"
"ఓకే! వన్ అవర్ లో వస్తాను"
*****
ఈలోపు లంచ్ రెడీ చేసింది జయంతి. రంగనాథ్ కు బలవంతంగా తినిపించారు. తామూ తినేసి, రెడీగా వున్నారు.
ఇంతవరకూ సినీ ప్రముఖులు ఒక్కరూ పలకరించడానికి రాలేదు. పైగా తమ అసూయను వెళ్లగక్కారు ఛానెళ్లలో.
*****
"అశోక్! రా! కూర్చో!" అని భార్యతో కూల్ డ్రింక్ తెమ్మని చెప్పాడు
విషయం అంతా అశోక్ కి వివరించాడు పరాక్రమ్.
"ఇదీ విషయం. మాలిని సడెన్ గా ఎటు పోయింది తెలియడం లేదు. కానీ లెటర్స్ ఇలా వచ్చాయి. రంగనాథ్ కు కనిపించిన లెటర్ మళ్లీ చూస్తే అక్కడ లేదు" అని వివరించాడు
జయంతి ఇచ్చిన కూల్ డ్రింక్ సిప్ చేస్తూ.. "ఓ సారి బంగ్లా అంతా వెదికితే! ఆ బషీర్ పగతో ఏమైనా చేసి ఉంటాడా! మీకెవరిపైన అయినా అనుమానం ఉందా?" అన్నాడు అశోక్
"సినీ ఫీల్డ్ లో మామూలే! అసూయపరులు వుంటుంటారు. కానీ ఇంత పగతో చేసేవారుండరు. ఏమీ అర్థం కావట్లేదు"
"ముందు బంగ్లా అంతా చూసొద్దాం! ఏమైనా క్లూ దొరుకుతుందేమో!"
సరేనని అంతా కలిసి అక్కడికి వెళ్ళారు. ఒక రౌండ్ వేసి వచ్చారు. ఎక్కడా అనుమానాస్పదంగా అనిపించలేదు. మళ్లీ కలుస్తానని వెళ్ళిపోయాడు అశోక్.
=======================================================================
ఇంకా వుంది..
మార్పు - పార్ట్ 6 త్వరలో..
=======================================================================
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
Comments