#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #MarumallelaRaniMakutamLeniMaharani, #మరుమల్లెలరాణిమకుటంలేనిమహరాణి

Maru Mallela Rani Makutam Leni Maharani - New Telugu Poem Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 19/02/2025
మరు మల్లెల రాణి -- మకుటం లేని మహరాణి - తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
మరు మల్లెల రాణి -- మకుటం లేని మహరాణి.
స్వఛ్ఛమైన తెల్లని నీ రూపం - మంచి మనసుకు ప్రతిరూపం .
కన్నె మనసుకు దర్పణం - మగువ మనసుకు శృంగారం.
స్నేహానికి చిరునామా - చిరునవ్వుకు నజరానా.
అందమైన మల్లెల గుబాళింపు - సొగసైన కన్నెమదిని దోచె.
మధురమైన ఊహాజగతిలో- కలల రాకుమారుడిని చూపె.
మల్లెతీగ వంటి మగువకు మనసెరిగిన తోడు జత
కలిస్తే జీవితమంతా చల్లని పందిరియే.
మృగేష్ణ, మల్లియ, ప్రయ, శూన్య, ముద్గరము, హసంతి, సుభగ, చంద్రిక, మల్లిక వంటి పేర్లు ఎన్ని ఉన్నా నీ సౌకుమార్య సుగంధ పరిమళము అనంతము.
శెంటు- అత్తరు - పర్ఫ్యూమ్ వంటి సుగంథ ద్రవ్యాలలో వాడినా వాడిపోని విరిసిన మరుమల్లియవు.
నాగుపాము లాంటి వాలుజడలో అందముగా కూర్చబడి ప్రియుని మదిని దోచి , మానస వీణను సుతారంగా మీటి , ప్రణయరాగాలు పలికించే రాగమల్లికవి.
సరాగాల పూదోటలో విహరించి , శృంగార సామ్రాజ్యంలో విహరింప చేసే నాగమల్లివి - సిరి మల్లివి.
దొంతర,కాడ,శంకు, బొడ్డు, కొండ,కంచె,.నాగ మల్లి యని రకములు ఎన్ని ఉన్నా సుదతి సోయగాలకు సుమనోహర పుష్పానివి.
దోబూచులాడే పున్నమి చంద్రుని కాంతిలో, మల్లె పందిరి నీడన, జవరాలు సరసన ఉంటే
తనువు - మనసు ఏకమై ప్రణయ గీతిని ఆలపించే రతీ-మన్మథుల మానస చోరీ - ప్రణయ చకోరి.
ఇంతుల పూబంతుల నడుమ మరుమల్లెల రాణి- మకుటం లేని మహరాణివి.
-నీరజ హరి ప్రభల
Comments