top of page
Writer's pictureVagumudi Lakshmi Raghava Rao

మర్యాద

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Maryada, #మర్యాద,#TeluguMythologicalStory


Maryada - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 20/11/2024

మర్యాద - తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


సుశ్రవస జయత్సేనుల కుమారుడు అవాచీనుడు తలిదండ్రుల సుపథాన్ని అనుసరిస్తూ, కుల గురువు వశిష్ట మహర్షి దగ్గర వేద పురాణేతిహాసాల మూలాలను అభ్యసించాడు. వేద పురాణేతిహాసాలను అనుసరించి రాజ ధర్మం ను ఎలా అనుసరించాలో కూడా తెలుసు కున్నాడు. కాల ధర్మం యుగ ధర్మం, పురాణ ధర్మం, మానవ ధర్మం, మానవీయతా ధర్మం, జ్ఞాన ధర్మం వంటి ధర్మాల నడుమ వ్యత్యాసాన్ని తెలుసుకున్నాడు. 


 అన్ని ధర్మాల కన్నా యుగ ధర్మం మిన్న. లలాట లిఖితం యుగ ధర్మాన్ని అనుసరించి ఉంటుంది అన్న సుశ్రవస మాటలను ప్రజలందరూ మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా నమ్ముతూ, యుగ ధర్మాన్నే అనుసరించేవారు. 


 మునులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, పండితులు, పంతుళ్లు, పంతులమ్మలు కూడా యుగ ధర్మ మూలాలనే ప్రజలకు నేర్పించడానికి ప్రయత్నించేవారు. 

యుగ ధర్మ మూలాలను చక్కగా గ్రహించి, అనుసరించడానికి అందరూ సుశ్రవస దగ్గర కొంత కాలం శిక్షణ పొందాలనుకునేవారు. 


 తన తల్లి సుశ్రవసను సమస్త లోకం ఆదరించే విధానం చూసి అవాచీనుడు మిక్కిలి సంతోషించే వాడు. తన తల్లిని దర్శించుకునే ప్రజలందరు మహా అదృష్టవంతులు అనుకునేవాడు. తన తల్లి సుశ్రవస ప్రవచించే యుగ ధర్మ మార్గమే ఉత్తమ మార్గం అనుకునేవాడు. 

 ఒకనాడు సుశ్రవసను, జయత్సేనుని వారి కుల గురువు వశిష్ట మహర్షి కలిసాడు. ముగ్గురూ అవాచీనుని భవిష్యత్తు గురించి చర్చించసాగారు. 


"అవాచీనుడు సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేయగల స్థాయికి ఎదిగాడు. సమస్త యుద్ద విద్యల తో పాటు వేద విద్యలను కూడ బాగానే వంట పట్టించు కున్నాడు. అతనికి పట్టాభిషేకం చేసే శుభ ఘడియలు ఆసన్నమైనవి" అని వశిష్ఠ మహర్షి సుశ్రవస జయత్సేనుల తో అన్నాడు. 


 వశిష్ట మహర్షి మాటలను విన్న జయత్సేనుడు "దేవి.. మీ అభిప్రాయం ఏమిటి?" అని సుశ్రవసను అడిగాడు. 


"నాథ! వశిష్ట మహర్షి వారు మన వంశ పురోభివృద్ధి కోరుకునేవారు. వారి దివ్య వాక్కులు సదా ఆచరణీయమైనవి. మన అవాచీనుడు చిరుత కన్నా వేగంగా పరిగెత్తగలడు. అతడు కొండల మీద వేగంగా పరిగెత్తిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కొండలని కమ్మేసిన విష ధరుడనే రాక్షసుని సంహరించే నేపథ్యంలో అవాచీనుడు కొండల మీద వేగంగా పరుగులు తీసి విష ధరుని సంహరించాడు. అలాగే వనాల్లోని వృక్షముల మీద మన అవాచీనుడు వేగంగా పరుగులు తీసి అహంతుడనే అసురుని సంహరించాడు. ఇక భూమి మీద వేగంగా పరుగులు తీసి అనేకమంది శత్రువుల శిరములను మన రాజ్య దేవత అమ్మవారికి బలి ఇచ్చాడు. 


 మన అవాచీనుడు రాజ్య సంరక్షణ విషయంలో మహా వీరుడనే చెప్పాలి. అయితే ఎవరికి, ఎప్పుడు, ఎలా మర్యాదను ఇవ్వాలి అనే విషయం లో మన అవాచీనుడు నేర్చుకోవలసింది చాలా ఉంది" అని సుశ్రవస, భర్త జయత్సేనుడు తో అంది. 


"అమ్మా సుశ్రవస! నిక్కము వక్కాణించావు. తల్లీ నిక్కము వక్కాణించావు. కుమారుని గుణగణాలను చక్కగా గుర్తించావు. పిల్లల గుణ గణాలను గుర్తించడంలో ఎవరైన తల్లి తర్వాతనే అనే వాస్తవాన్ని తెలియ చెప్పావు. 


అవాచీనుడు అసలు మర్యాద తెలియని మనిషి అని అనలేం కానీ ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలి అన్న విషయం లో నువ్వన్నట్లు కొంచెం తడబడుతుంటాడు.. ఈ విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో నువ్వే చెప్పు?" సుశ్రవస తో అన్నాడు వశిష్ట మహర్షి. 


"మహర్షోత్తమ! మా విదర్భ దేశానికి చెందిన నా సోదరుని కుమార్తె మర్యాద అనే రాకుమార్తె ఉంది. ఆమె చిన్న తనం నుంచి మంచి వాతావరణం లో పెరిగి పెద్దదయ్యింది. తప్పు ఎవరు చేసిన వారిని ప్రశ్నించే ధైర్యం మర్యాదకు మెండుగ ఉంది. కొందరు ఆమెను ఆడ ప్రహ్లాదుడు అని అంటూ ఉంటారు. 


మంచి చేసిన వారు చిన్నవారైన, పెద్ద వారైన వారిని తగిన విధంగా సత్కరిస్తుంది. మర్యాద పేరుకు తగిన విధంగా మంచి మర్యాద బాగా తెలిసిన మహిళామణి అని మా పుట్టింటివారి ద్వారా తెలుసుకున్నాను. 


 మర్యాద సూర్య వంశ రాజులకు, రాణులకు చంద్ర వంశ రాజులకు, రాణులకు యింకా వివిధ వంశాల రాజులకు, రాణులకు, తదితరవంశాల వారికి తగిన విధంగా మర్యాదలు చేసి వారి వారి మన్ననలను పొందిందట. అలాగే మునులు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, సురులు, నరులు తదితరులందరికి తగిన విధంగా మర్యాదలు చేస్తూ వారివారి మన్ననలను పొందుతుందట. 


ప్రతి సమాజానికి, సంస్కృతికి వాటి స్వంత మర్యాదలు అంటూ కొన్న ఉంటాయి. వాటిని గమనించి నడుచుకునే వారే చరిత్రలో నిజమైన మర్యాదస్తులుగా మిగిలిపోతారు. మర్యాద కు ఎక్కడ ఎలా మసలు కోవాలో బాగా తెలుసునట. అలాంటి యువతి అవాచీనునికి భార్య అయితే అతనిలో చాలా మార్పు వస్తుంది అని నా అభిప్రాయం. మర్యాద అవాచీనుల విషయం లో మీరే పెళ్లి పెద్ద కావాలి. '" అని సుశ్రవస వశిష్ట మహర్షి తో అంది. 


 "అమ్మా సుశ్రవస.. నీ ఆలోచన దివ్యంగా ఉంది. అవాచీనుని పెళ్ళి విషయంలో నేనే పెళ్ళి పెద్దను అవుతాను” సుశ్రవసతో అన్నాడు వశిష్ట మహర్షి. 


 సుశ్రవస జయత్సేనుని వద్ద సెలవు తీసుకున్న వశిష్ట మహర్షి విదర్భ రాజ్యానికి వెళ్లాడు. రాజ్యం లోని ప్రజలందరూ వశిష్ట మహర్షి ని సాదరంగా ఆహ్వానించారు. వారికి ఆ సద్గుణం మర్యాద వలన వచ్చిందని పదుగురు చెప్పగా వశిష్ట మహర్షి విన్నాడు. విదర్భ రాజు వశిష్ట మహర్షి ని ఉచిత ఆసనం ఇచ్చి తగిన విధంగా సత్కరించాడు. 


 అనంతరం విదర్భ రాజు తన సోదరి సుశ్రవస యోగ క్షేమాల గురించి వశిష్ట మహర్షి ని అడిగి తెలుసుకున్నాడు. తన కుమార్తె మర్యాద యాగశాల ల్లో మహర్షులకు చేస్తున్న సేవలను రాజు వశిష్ట మహర్షి కి ప్రత్యక్షంగా చూపించాడు. 


 మహర్షులకు మర్యాద చేసే మర్యాదలు వశిష్ట మహర్షి ని బాగా ఆకర్షించాయి. అవాచీనునికి తగిన భార్య మర్యాద యే అని వశిష్ట మహర్షి మనసులో అనుకున్నాడు. తను వచ్చిన విషయాన్ని వశిష్ట మహర్షి విదర్భ రాజు కు చెప్పాడు. తన మనసులోని కోరిక అదే అవ్వడంతో విదర్భ రాజు మిక్కిలి సంతోషించాడు. 


 తన తండ్రి ద్వారా విషయాన్ని తెలుసుకున్న మర్యాద వశిష్ట మహర్షి ని తగిన విధంగా సత్కరించింది. అనంతరం "మహర్షోత్తమ! రాజ్యం లో రాజూ, రాణీ అలాగే ఉన్నత స్థానంలో ఉన్నవారు, ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. రాజ్యాభివృద్ధికి సిరిసంపదలు ఎంత ముఖ్యమో మంచి మర్యాద తెలిసిన రాజు రాణి ప్రజలకు అంత ముఖ్యం. కొండంత బంగారం కన్నా కూసింత మర్యాద మిన్న. ప్రజలు ఉన్నవాడిని ముఖం ముందు పొగిడితే మంచి మర్యాద తెలిసిన వాడిని అన్నిచోట్ల పొగుడుతారు. 


అలాగని పరుల పొగడ్తల నిమిత్తం మంచి మర్యాదలు ఉన్నట్లు నటించ రాదు. మంచి మర్యాదలు అనేవి మనసు నుంచి పుట్టాలి కానీ ఆడంబరం నుంచి పుట్ట రాదు. ఇది నాకు అలవడిన గుణం" అని మర్యాద వశిష్ట మహర్షి తో అంది. 


 మర్యాద మనస్తత్వం తెలుసుకున్న వశిష్ట మహర్షి పెద్దలందరితో సంప్రదింపులు జరిపి మర్యాద అవాచీనుల వివాహం జరిపించాడు. 


 మర్యాద తన భర్త అవాచీనుని మనస్తత్వం గ్రహించింది. ప్రజల దగ్గర, సామంత రాజుల దగ్గర, అధికారుల దగ్గర, పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో మర్యాద తన భర్త అవాచీనునికి దగ్గర ఉండి నేర్పించింది. 


 తన భార్య మర్యాద ఆచరించి చూపించే సమస్త కార్యక్రమాలు అవాచీనునికి బాగా నచ్చాయి. మర్యాద ప్రజలను ఆదరించే తీరు అవాచీనునికి బాగా నచ్చింది. 

ఒకసారి రాజ్యంలోని అధిక శాతం మంది మనుషులకు అంటు వ్యాధులు సోకాయి. అప్పుడు మర్యాద ప్రజల అంటు వ్యాధులను రూపుమాపేందుకు ముందడుగు వేసింది. 


అప్పుడు ఆమెకు హిమాలయ పర్వతాలలో ఉన్న సురదళాలు అవసరమయ్యాయి. అదే విషయాన్ని మర్యాద తన భర్త అవాచీనునికి చెప్పింది. అవాచీనుడు గాలి కంటే వేగంగా హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడి సుర దళాలను తీసుకుని వచ్చి మర్యాదకు ఇచ్చాడు. మర్యాద ఆ సురదళాలతో ప్రజల అంటు వ్యాధులను నయం చేసింది. ప్రజలందరూ మర్యాద అవాచీనులను దైవాలకన్నా మిన్నగా చూసారు. 

 సుశ్రవస, జయత్సేనుడు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న అవాచీనునికి పట్టాభిషేకం చేసారు. 

 మర్యాద అవాచీనుల సంతానం అరిహుడు.

 

 సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








45 views1 comment

1件のコメント


mk kumar
mk kumar
2024年11月21日

"మర్యాద" కథలో, అవాచీనుడు అనే యువకుడు వేదపాండిత్యం యుగధర్మాన్ని పాటించి, ధర్మపతివృత్తిగా ఎదుగుతాడు. అతను మర్యాదను నేర్చుకునే ప్రక్రియలో, తల్లి సుశ్రవస, వశిష్ట మహర్షి మార్గదర్శకత్వంతో తన జీవితంలో విలువైన మార్పులు తెస్తాడు. మర్యాద వల్ల ప్రజలతో మంచి సంబంధాలు నిర్మించి, ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. కథలో వ్యక్తిగత మార్పు, కుటుంబ సంబంధాలు, సామాజిక సేవలు ముఖ్యమైన అంశాలుగా చర్చించబడతాయి.


いいね!
bottom of page