top of page
Writer's pictureGadwala Somanna

మాతృభాష తెలుగు వెలుగు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #MathrubhashaTeluguVelugu, #మాతృభాషతెలుగువెలుగు


Mathrubhasha Telugu Velugu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 12/12/2024

మాతృభాష తెలుగు వెలుగు - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


మాతృభాష మధురము

మాట్లాడుము సతతము

మన భాష ఉన్నతము

మనకదే గౌరవము


నిర్లక్ష్యము చేయకు

చులకనగా చూడకు

తల్లి భాష గొప్పది

వల్లిలా మెత్తనిది


రాయలు కొనియాడిన

రమ్యమైన భాషది

సంగీతానికి అనువు

చక్కని తెలుగు మనది


దేశభాషలందున

తెలుగే ఘనమైనది

అక్షరాల సత్యము

తలపోయుము నిత్యము


అమ్మ నేర్పే భాష

గుండెలకదే శ్వాస

తెలుగోళ్లగా మనము

ఘనపరచుట ధర్మము


మాతృభాష ప్రగతికి

మనం కృషి చేయాలి

తెలుగు ఘనత జగతికి

ఎలుగెత్తి చాటాలి


-గద్వాల సోమన్న



19 views0 comments

留言


bottom of page