top of page

మేధావి భట్టు

కవులను గూర్చిన కథలు..2 వ భాగం 


'Medhavi Bhattu' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 02/05/2024

(కవులను గూర్చిన కథలు - పార్ట్ 2)

'మేధావి భట్టు' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




అది ఒక పల్లెటూరు. ఆరోజున ఆ దేశపు రాజుగారు ఆఊరు వస్తున్నారని తెలిసింది. రాజుగారికి స్వాగతమివ్వడానికి ప్రజలందరూ ఊరి పొలిమేర దగ్గరికి చేరారు. కొంతసేపటికి మంగళ వాయిద్యాలు వినబడ్డాయి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, కాల్బలంతో రాజుగారు దయచేసారు. ఆ వైభవాన్ని చూసేసరికి గ్రామస్తులలో మేధావిభట్టు అనే కవీశ్వరుడికి రాజుగారి మీద పద్యం రాద్దామని బుద్ది పుట్టింది. మొలలో గంటం వుంది కానీ తాటాకు లేదు. అప్పుడు ఎదురుగా వున్న తాటిచెట్టును చూచి 


 " సాళువ పెద తిమ్మ మహీ 

 పాలవరుడు వీడె వచ్చె బద్యము వ్రాయన్ 

 గెలనులే దాకొక్కటి

 తాళమ ముత్తునియ లగుచు ధరపై బడుమా 


అని అశువుగా పద్యం చదివేసరికి, ఆ తాటిచెట్టు ఫెళఫెళ విరిగి నెలమీద కూలింది. ఇది చూచి సాళ్ళవ పెద తిమ్మారాజు, కవిరాజుకి మొక్కి ఆయన దీవెనలు పొందాడు. మేధావిభట్టు 15వ శతాబ్దము లో ఉన్న కవిశ్వరుడు. మన దురదృష్టవశం చేత, ఈయన వ్రాసిన గ్రంధాలు ఏమీ ఈనాటికి మిగలలేదు.


 ప్రౌఢకవి మల్లన్న 

 ---------------


ఈయన క్రీ. శ.1450 ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో నివసించిన కవీశ్వరుడు. ఈయన ప్రౌడమైన కవిత్వం చెబుతాడు కనుక ప్రౌఢకవి అన్నది పౌరషనామమై ఉంటుంది. ఒకరోజు ఈయన గుడియన్న నృపతి అనే రాజును దర్శించే నిమిత్తం, ప్రయాణమై వెడుతో వుండగా, కొండవల్లి కోటకు పడమటగా వున్న దారిలో ఉన్న బ్రమ్మదండీ డొంకలో ప్రమాదవశాత్తు పడ్డాడు. రెండు కాళ్లలోను ముళ్ళు లోతుగా గుచ్చుకుని రక్తం కారింది. ఆయన కన్నులు కోపంతో ఎఱ్ఱబడ్డాయి. బొమ్మచెముడు డొంకవైపు చూచి 


" గుడియన్న నృపతి బోడగన

 నడవంగా కొండపల్లి నగిరి పడమటన్

 కుడిఎడమ మడమ గాడిన 

 చెడుముండులు బ్రాహ్మదండి చెట్టునడుల్లన్ 


అని పద్యం చెప్పాడు. ఆ చెట్టుకు వున్న ముళ్లన్నీ ఒక్కసారిగా తుప్పురాలినట్టుగా రాలిపోయాయి. ఆయన వాక్కులో వున్న మహిమ అటువంటిది. ఆయన రచించిన " రుక్మాంగద చరిత్రము " అన్న పద్యకావ్యం చాలా రసవంతముగాను మృధుమధురంగా ను వుంటుంది.


రెండవ భాగం సమాప్తం 


 మూడవ భాగం త్వరలో 


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.















51 views0 comments

Comments


bottom of page