top of page

 మీనాాక్షి టీచర్.. !

Writer's picture: Penumaka VasanthaPenumaka Vasantha


'Meenakshi Teacher' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 24/05/2024

'మీనాాక్షి టీచర్.. !' తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత



మీనాాక్షి అసలు పేరు కాని అందరూ ‘మీనాా!’ అని పిలుస్తారు మీనాాక్షిని. పేరుకు తగ్గట్లే పెద్దకళ్లు, పెద్ద జడ.. ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిందేమో.. ! బాగా గారాబంగా పెరిగింది. 

 

మీనాాక్షి ఏది అడిగితే అది కొని ఇవ్వాల్సిందే. కాలు కింద పెట్టకుండా పెరిగింది. డిగ్రీ వరకు చదివించారు. ఇక పెళ్లి చేద్దామని ప్రయత్నాలు మొదలెట్టారు. అపుడు ఇప్పటి లాగా అమ్మాయిలకి డిమాండ్ లేదు, అబ్బాయిలకు ఉంది. 

 

ముందు చెల్లికి పెళ్లి చేసి మేము చేసుకుంటామని అన్నలిద్దరూ పెళ్లి చేసుకోలేదు. మీనా కొంచం కలర్ తక్కువ అవ్వటం వల్ల, తొందరగా అబ్బాయిల కంట్లో పడేది కాదు. 

 

కొంతమంది అబ్బాయిలకు మీనాా నచ్చినా కూడా, వాళ్ళకు ఆస్తి లేదనీ, మీనాా అమ్మనాన్నకు వాళ్ళు నచ్చేవారు కాదు. ఉద్యోగం వుంటే, ఆస్థి లేక, ఆస్తీ ఉంటే ఉద్యోగం లేక, ఇలా ముప్పై ఏళ్లు వచ్చేవరకు మీనాాకు పెళ్లి కాలేదు. 

 

మీనాాకు పెళ్లి చేసి తాము చేసుకోవాలని కూర్చున్న అన్నలకు, పెళ్లి కాక ముదిరి పోయారు. వాళ్ల కోసమన్నా మీనాాకు త్వరగా పెళ్లి చేయాలని చివరకు ఆస్తి బాగ ఉందని, ఒక పెద్ద కుటుంబంలోని పెద్దకొడుకు మాధవ్ కి మీనాాను ఇచ్చి పెళ్లి చేశారు. వ్యవసాయం చేస్తూ.. మాధవ్ ఆ ఊరిలో ఒక స్కూల్ కూడా రన్ చేస్తున్నాడు. 

 

మీనాా, అత్తవారు చాలా మంచివారు. మాధవ్ కూడా మీనాాను బాగా చూసుకునేవాడు. మీనాా పెద్ద కోడలిగా ఇంటి బాధ్యతలు స్వీకరించింది. మాధవ్ కు ఒక తమ్ముడు, ఒక అక్క, చెల్లి, ఉన్నారు. 

 

మాధవ్ పొలం వెళితే.. మాధవ్ స్కూల్ కి వెళ్లి పాఠాలు చెప్పేది మీనా. ఆ చుట్టుపక్కల మంచి స్కూల్ లేకపోవటం వల్ల మాధవ్ స్కూల్ కి బాగా డిమాండ్. సాయంత్రం ఇంట్లో పిల్లలు ట్యూషన్ కి వచ్చేవారు. పిల్లలతో ఇల్లు కళకళ లాడుతుందేది. 

 

మాధవ్ అక్కకు పెళ్లి అయింది. కాని చెల్లి విమలకు పోలియో వల్ల కాలు కొంచం పెద్ద అడుగులు వేసి నడుస్తుంది, అందువల్ల పెళ్లి కాలేదు. విమలకు టీచర్ ట్రైనింగ్ పూర్తయింది. వీళ్ల స్కూల్లోనే టీచర్ గా పని చేస్తుంది. మరిది ముంబైలో జాబ్ చేస్తాడు. 

 

మరిది పెళ్లి భాద్యతలు తనే నెత్తిన వేసుకుని చక్కగా చేసింది. మీనాకు పిల్లలు పుట్టలేదు. మరిది పిల్లలను, తన సొంత పిల్లలుగా భావించేది. వాళ్ళు సెలవులకు ఇంటికి వస్తె, వాళ్లతో సరదాగా గడిపేది. మీనాకి పిల్లలు లేక పోవటం చూసి మీనాా అమ్మానాన్న, అన్నలు, దిగులు పడ్డారు. వాళ్లకి దైర్యం చెప్పేది. మరిది పిల్లలు నా పిల్లలే.. ! అనేది. ఇంకా స్కూల్ పిల్లలు కూడా నా పిల్లలే.. ! అనేది. "

 

 మాధవ్ వాళ్ల నాన్న పోయినప్పుడు.. “మీనాా..  నాకేమైనా అయితే నువ్వు అమ్మని, మా చెల్లిని, మన స్కూల్ని బాగా చూసుకోవాలి.. !" అనేవాడు మాధవ్. 

"అలా అనకండి.. !” అని మాధవ్ ని తిట్టేది. “మీరు లేకపోతే నేనూ లేను అనేది" మీనాా. 

 

 మీనాా సంతోషాన్ని చూడలేక ఆ దేవుడు మాధవ్ ని హార్ట్ ఎటాక్ రూపంలో తన దగ్గరికి తీసుకెళ్ళాడు. కొన్నాళ్ళు డిప్రెషన్ లో ఉంది మీనా. 

 

 మీనాా అమ్మానాన్న, “మన ఇంటికి వచ్చి వుండు తల్లీ.. ! అత్తంటితో నీకు ఋణం తీరింది”, అంటే మీనాా, ఒప్పుకొలేదు. 


“పుట్టిల్లుతో నా బంధం పెళ్లితోనే తీరిపోయింది. ఇక్కడే.. ఉంటాను. రాలేను నాన్నా.. ! వచ్చినా చుట్టపు చూపుగానే వస్తానే.. తప్ప అక్కడ శాశ్వతంగా వుండలేను” అంది. 

 

“మాధవ్ తో నాకున్న ఈ ఇంటి జ్ఞాపకాలను, మాధవ్ కి ఇష్టమైన ఈ స్కూల్ ని వదిలి రాలేను. స్కూల్ లోని పిల్లలందరూ..  నా పిల్లలే నాన్న. వాళ్లకి ఇపుడు పరీక్షలు కూడా.. ! ఇపుడు నేను వాళ్ళని వదిలి మీతో వస్తె.. వాళ్ల భవిష్యత్ ఏమి కాను?” 


చేసేది లేక మీనాా, అమ్మానాన్నా మీనాా ను వదలలేక వెళ్ళారు


తర్వాత అత్తగారికి ధైర్యం చెపుతూ వుండేది. స్కూల్ కెళ్ళి పిల్లలతో గడపటం వల్ల మాధవ్ లేని బాధని మర్చిపోయేది. డిస్టెన్సు లో బీఎడ్ చేసింది. పూర్తిగా స్కూల్ పై దృష్టి పెట్టింది. 


ఒక పక్క స్కూల్ చూస్తూ, అపుడప్పుడు పొలం వెళ్ళి చూసి వస్తూ వుండేది. స్కూల్లో మాధవ్ విగ్రహం పెట్టించింది. ప్రతి రోజూ మాధవ్ విగ్రహం ముందు ‘మీతో గడిపింది, పది సంవత్సరాలైనా.. ! పది యుగాలు మీతో గడిపనట్లుగా వుంది. మీ స్కూలును, మీరు చెప్పినట్లే చూసుకుంటున్నాను’ అనేది. 

 

 ఆ ఊరి వారు అందరూ మీనాాను మెచ్చుకొన్నారు. ‘మా అబ్బాయిలని తీసుకుని ఉన్న ఊరిలోనే మా కోడళ్ళు మా ఎదురుగా వేరు కాపురాలు పెడుతుంటే మీనాా భర్త పోయినా ఆ కుటుంబంలోనే వుంటూ అత్తగారిని, ఆడపడుచును, చూసుకోవటం ఎంత మంచితనము’ అని ఆశ్చర్యపోయారు. 

 

 అత్తగారు కూడా " నాకు మీనా కూతురు, కోడలు కాదు" అని మురిసిపోయేది. అత్తగారు మీనాా చేతిలోనే పోయారు. 'మాధవ్.. ! మీరు చెప్పినట్లే అత్తగారిని చూసుకున్నా’నని మనసులో అనుకున్నది. 

 

 మళ్ళీ మీనాా అమ్మానాన్న వచ్చారు. "మీనాా.. ! రామ్మా ఇంటికి వెళ్దాము. మీ ఆడపడచు భాధ్యత మీ మరిది చూసుకుంటాడు. నువ్వు మాతో రావచ్చుగా.. ! నిన్ను ఎంత గారాబంగా పెంచాము. ఇక్కడ నువ్వు వీళ్ల కోసం కష్టపడటం చూడలేకపోతున్నాము. హాయిగా అక్కడ ఉందువుగాని రా అమ్మా.. !" అన్నారు. 

 

 "ఇది కష్టపడటమని నేను అనుకోవటం లేదు నాన్నా.. ! నా కిష్టమైన పని కష్టపడటం ఎలా అవుతుంది నాన్న.. ! పదే పదే అడగకండి నాన్నా..  ఆడపడుచు, నేను ఉంటాం ఈ ఇంట్లో. భయం లేదు, సాయంత్రం పిల్లలు వచ్చి చదువుకుంటూ.. ,  ఇక్కడే పడుకుంటారు. పక్కనే మా చిన మామగారు వాళ్ళు ఉంటారు. అపుడప్పుడు మీరూ, అన్నయ్యలు వచ్చి చూసి పొండి. మా మరిది వాళ్ళు కూడా వస్తు పోతుంటారు" అంది. 

 

 "వదినా.. ! నువ్వు అత్తయ్య, మామయ్యాతో నీ పుట్టింటికి వెళ్ళు వదినా.. ! చిన్న అన్నయ్య దగ్గరికి వెళ్తాలే.. నేను.. !" అంది కళ్ల నీళ్ళు తుడుచుకుంటూ ఆడపడుచు విమల. 

 

 "లేదు. మీ అన్నయ్య ‘మనకు పిల్లలు లేకపోయినా.. మా అమ్మ, చెల్లి, మన స్కూలు పిల్లలు మన పిల్లలే.. !’ అని చెప్పేవారు. మీ అమ్మ కూడా నిన్ను వదిలి నన్ను ఎక్కడికి వెళ్లవద్దన్నారు. నేను వెళ్ళను..  నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు” అంది మీనాా. 

 

 ఆ ఊరి వారందరూ..  "మీనా టీచర్ గారు మా పిల్లలకి నాలుగు అక్షరం ముక్కలు నేర్పుతున్నారు. ఆమెను చూసుకొనే భాద్యత మా అందరిదీ. మావూరి ఆడపడుచు మీనమ్మ. మీరు దైర్యంగా వెళ్లం”డని.. మీనా అమ్మానాన్నను సాగనంపారు.


 విమలకు గవర్నమెంటు టీచర్ జాబ్ రావటంతో, మీనాా..  హ్యాపీగా ఫీల్ అయింది. జాబ్ ఉండటం వల్ల విమలతో పనిచేసే టీచర్ పెళ్లి చేసుకుంటానన్నాడు. విమల పెళ్ళికి ఒప్పుకోలేదు. కానీ మీనాా ఒప్పించి విమలకు పెళ్లి చేసింది. 


'మాధవ్, విమలకు పెళ్లి అవ్వదని భయపడేవాళ్లము. ఇపుడు విమల ఒక ఇంటిది అయింది. మీ చేత్తో పెట్టిన వృక్షాలు పెరిగి పెద్దవయ్యాయి, కానీ మీరే లేరు, ఎందుకు నన్నొదిలి వెళ్లారు, మీకు నా మీద ప్రేమ లేదా?’ అని బాధ పడింది విమల. 


 మీనాా, అన్నయ్య వచ్చి "మీనాా.. ! ఇపుడు మీ ఆడపడుచు కూడా లేదు, నువ్వొక దానివే ఎందుకు? ఇక్కడ మన ఇంటికి రా.. !" అన్నాడు. 


 "లేదు అన్నయ్యా.. ! అప్పటి కన్నా ఇపుడు.. నా అవసరం ఇక్కడ వుంది. మా మరిది వాళ్ల అబ్బాయి సాగర్ ని, నేను ఒక్క దాన్నే అని ఇక్కడ మా స్కూల్ లో జాయిన్ చేసాడు. 


 సాగర్ అచ్చు మా ఆయన లాగే వుంటాడు. ఇపుడు ఒంటరి దాన్ననే..  ప్రసక్తి లేదు. వాడిలో మాధవ్ ను చూసుకుంటూ.. 

ఉన్నతముగా తీర్చి దిద్దుతా సాగర్ ను. మనకు పిల్లలుంటే, ఒకరిని డాక్టర్ చేస్తా.. అనేవారు మీ బావ. వీడిని డాక్టర్ను చేసి, ఆయన కోరిక నెరవేర్చుతా.. ! నాన్న పోయి అమ్మ ఒక్కతే..  అయింది. నీకు వీలైతే, అమ్మను ఇక్కడకు పంపు, నాకు తోడుగా వుంటుంది”. 


 ఏమి చేసేది లేక మీనాా, అన్నయ్య..  వాళ్ల అమ్మను మీనాా దగ్గర వదిలి వెళ్లాడు. 


 మీనాాకు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బహుమతి వచ్చింది. స్కూల్ కు కూడా ఉత్తమ స్కూల్ గా పేరు వచ్చింది. దాన్ని తన దివంగత భర్తకు అంకితమని గర్వంగా చెప్పింది. 


 సాగర్ ను డాక్టర్ చేసి ఆ వూళ్ళోనే మాధవ్ పేరు మీద హాస్పిటల్ కట్టించింది. ఈవిధముగా మెట్టిన ఊరిలో పేరును సంపాదించుకుంది. ఇపుడు ‘టీచర్ మీనాాక్షి..’  అంటే, తెలియని వారు లేరు ఆ చుట్టుపక్కల వూళ్లలో. 

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


40 views0 comments

Comments


bottom of page