'Meghana' - New Telugu Poem Written By M. Laxma Reddy
Published In manatelugukathalu.com On 21/06/2024
'మేఘనా ..' తెలుగు కవిత
రచన: M. లక్ష్మా రెడ్డి
కళ్ళు..పలికే ఓ గీతం నవ్వు.. ఓ సమ్మోహనం నువ్వు.. ఓ అద్భుతం నాకోసం .. ఓ ప్రపంచం.. చిరుగాలికి సడిలేక నర్తించే ముంగురులు..నా మిణుగురులు.. నీ రాకతో మెరుపుతో అలరారే నా నయనాలు.. సీతాకోకలు.. నిను దాటి నను చేరే భానుని కిరణాలు.. ఉత్సాహ ప్రభాతాలు.. నను దాటి నువు నడిచే సాయంకాలాలు.. నిస్తేజ నిశ్శబ్దాలు.. నీ వదనం.. ఓ సోయగం నీ గమనం.. ఓ విజయం సన్నని వానజల్లులా ఆ కబుర్లు.. అల్లేసే హరివిల్లులా నీ ఊహలు.. నీతో సమయాన్ని ఎలా నిలపాలో తేలిని వైనం నీ వేళ కరుగుతున్న క్షణాల్తో.. ఏదో వైరం.. నువ్వుంటే క్షణాలు తీరిగ్గా కదలొచ్చుగా.. నువు రాకుంటే గంటలు చకచకా సాగొచ్చుగా.. నీ చూపే.. ఓ పరవశం.. ఓ నవ్వు..ఎద నీ వశం.. నీతో సమయం.. ఓ అందమైన జ్ఞాపకం.. నీతో జీవితం . ఇంకేం అక్కర్లేని లోకం.. నీ కాటుకా..నా వేటకా.. నీ కురులా . నాకై శరాలా.. నీ మాటలు.. ఆ ప్రవాహంలో..నే మూగబోయా నీతో అడుగులు.. ఆ మైకంలో నే దారి కోల్పోయా అనునిత్యం నీ మాటలే ప్రేరణ.. ఏనాటికీ వీడలేని ఆకర్షణ.. తుంపరై జారవే.. మేఘనా.. బంధమై చేరవే వేగాన.. నీ ప్రేమలో.. నీ ఊహల్లోనేగా..ప్రతి క్షణాన నీ చెంత నిలిచి అమరున్నవనా .ఈ నిమిషాన |
M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి. మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి. గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/laxmareddy నేను లక్కీ.. లక్మారెడ్డి రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా.. అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు.. నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను.. నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను... ధన్యవాదాలు... |
Comments