top of page
Writer's pictureGadwala Somanna

మేలి మేటి సూక్తులు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #మేలిమేటిసూక్తులు, #MeliMetiSukthulu


Meli Meti Sukthulu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 15/12/2024

మేలి మేటి సూక్తులుతెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


చేతనైతే ఉపకారము

అందించాలోయ్! సహకారము

పెంచుకోవాయాలోయ్!  మదిని

జీవుల పట్ల మమకారము


మంచి పనులకు శ్రీకారము

చుట్టాలోయ్! జీవితంలో

బడుగుజీవులకు ప్రాకారము

అవ్వాలోయ్ ఈ లోకంలో


చేయకూడదోయ్! అపకారము

కాదు కాదు! మంచి లక్షణము

పలు సమస్యలకు పరిష్కారము

చూపించాలోయ్! తక్షణము


ఆత్మవిశ్వాసమాధారము

అందాలొలికే మందారము

దైనందిన జీవితాల్లో

ధ్యానించాలోయ్! ఓంకారము


హానికరమే అహంకారము

చేయును తప్పక  నాశనము

పెద్దల మాటల ధిక్కారము

అభివృద్ధికిలను అవరోధము


మానాలోయ్! దురాచారము

హర్షించదు సభ్య సమాజము

చేతికందిన అధికారము

కాకూడదు దుర్వినియోగము


-గద్వాల సోమన్న



13 views0 comments

Commenti


bottom of page