top of page

మేలి ముసుగు

Writer: Pandranki SubramaniPandranki Subramani

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #మేలి ముసుగు, #Melimusugu, #TeluguStories, #తెలుగుకథలు


Melimusugu - New Telugu Story Written By - Pandranki Subramani

Published In manatelugukathalu.com On 21/03/2025

మేలి ముసుగు - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కాకాతీయ సామ్రాజ్యంలో కాంభోజ నగరమనే ఊరులో ఊక్కునూరు సంస్థానం, ఆకాశం కురిపించే దయా వర్షంతో, నలువై పులా ప్రవహించే పంటకాలువలతో సస్యశ్యామలంగా విరాజిల్లుతుండేది. సంస్థానాధిపతి రామవర్మకు అందచందాలలోనే కాక, మీదు మిక్కిలి తెలివి తేటలతో తొణిసలాడే కూతురు సుగంధి- తండ్రికి రాచకార్యాలలోనే కాక, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా చేదోడు వాదోడుగా ఉండేది. 


కాని అటువంటి సౌభాగ్యవతి ఐన సుగంధికి వివాహం కావడం రానురాను గగన కుసుమ మయిపోతూంది. కారణం- పాణిగ్రహణం మొనరించడానికి వరుడు దొరక కాదు. కారణం మరొకటి-- ఎన్నడూ ఎక్కడా లేని వింతైన కోరికామెది. 


సభామందిరంలో తను ముఖారవిందాన వేసుకున్న మేలి ముసుగుని తానుగా తీసి చూడదు. తొలగించి చూపించదు. ఏనాడైతే తనకు అన్ని విధాల ఈడూ జోడూ గల వరుడు, తగు గుణ సంపదలు గల వాడు స్వయం వరానికి వస్తాడో.. తన ఎదుట తొణకని గంభీర వదనంతో నిల్చుంటాడో.. తన మోముపైనున్న మేలిముసుగు తానుగా తొలగి పోతుంది. అంతేకాదు. అది తానుగా గాలిలో వలయాలు వలయాలుగా ఎగురుతూ తన కాబోయే భర్త ముఖాన వాలుతుంది ప్రణయ సంకేతంగా- 


ఏదో ఒకనాడు ఇలా తనకనుకూలంగా జరుగుతుందనడానికి ఆమె తెలియ చేసిన కారణం మరీ విచిత్రమైనది. అదెప్పుడో తను కౌమార దశలో ఉన్నప్పుడు ఒకనాడు మధ్యాహ్న వేళ ఆశ్రమ పాఠశాలనుండి గృహాభి ముఖురాలై వస్తున్నప్పుడు దారిలో ఎవరో ఋషి పుంగవుడు దప్పికతో అల్లలాడుతూ చెట్టు ఓరన సొమ్మసిల్లి పడున్నాడు. అప్పుడామె వెనక్కి తగ్గకుండా సంకోచ తడబాటుకి తావులేకుండా ఆయనను తక్షణం ఆదుకుంది, పండ్లు తినిపించి పానీయం తాగిపించి సేదతీర్చింది. 


అప్పుడాయన జ్ఞాన దృష్టితో తనకా విచిత్ర వరం ప్రసాదించి వెళ్ళాడని నుడువుతుందామె. ఆ శుభ సమయంలో ఆమెకు ఎదురవబోయే మగపురు షుడు అతి గంభీరుడు- అతి గుణ వంతుడు- అతి ఆత్మీయత గలవాడయి ఉంటాడు. అటువంటి వాడికే తను తల వంచుతుంది. 


సుగంధికి పరువ కాలం ఇలా బరువుగా సాగుతున్నప్పుడు— ఊక్కునూరు పొలిమేరన మనోహరుడనే యువకుడు 

సేద్యం చేస్తూ మనుగడ సాగిస్తుండేవాడు. అతడికి వృద్ధులైన తల్లి దండ్రులతో బాటు పెళ్లీడుకు వచ్చిన తోబుట్టువు కూడా ఉంది. స్ఫురద్రూపి, బలాఢ్యుడూ ఐన మనోహరుడికి చుట్టు ప్రక్కలనుండి ఎన్నిసంబంధాలు వరసకట్టి వెతికి వచ్చినా, చెల్లికి పెళ్లికానిదే ససేమిరా పెండ్లి పీటలపైన కూర్చునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశాడు. 


అంతేకాక మనోహరుడు మరొక షరతు కూడా పెట్టాడు. తన వృద్ధ తల్లిదండ్రులను తన వాళ్లుగా చూసుకునే గుణవంతురాలు, సౌభాగ్యవంతురాలు భార్యగా వచ్చేంతవరకూ తనకు పెండ్లే వద్దని, అప్పటి వరకూ బ్రహ్మచారిగా ఉండిపోతానని కచ్చితంగా తేల్చి చెప్పేశాడు. 


కాని— కాలమెప్పుడూ ఒకేలా ఉండదు కదా- దానికంటూ ఒక ధార్మిక ధ్యేయమంటూ ఒకటుంటుంది కదా-- ఒక రోజతను వారాంతపు సంతకు వచ్చి పలు అంగళ్లు చూసుకుంటూ కావలసినవాటి కోసం వెతుక్కుంటూ అనుకోకుండా ఉక్కునూరు సంస్థాన అంత:పుర ముఖద్వారానికి చేరుకున్నాడు. అప్పుడక్కడ సభామందిరంలో రాజకన్యకు రాజ పురోహితుల సమక్షాన స్వయం వరం జరుగుతూంది. పలుప్రాంతాలనుండి పలు చిన్నపాటి సంస్థానాదిపతులు, అగ్రజ వంశానికి చెందిన పెద్ద సంస్థానాధిపతులు సుగంధి చేతిని అంది పుచ్చుకోవడానికి బారులు తీరి రాసాగారు. అప్పుడక్కడి రాజ భటులు అటూ ఇటూ కంగారు పడిపోతూ- తను మామూలు రైతు బిడ్డనని చెప్తున్నా వినకుండా అందరితో బాటు- ‘నలుగురితో నారాయణా-- గుంపులో గోవిందా! ’ అన్నరీతిన మనోహరుణ్ణి కూడా రాజమందిర ప్రాంగణంలోకి నెట్టేసారు. వాళ్ళలా మనోహరుణ్ణి అక్కడి వరుసలోకి నెట్టేవేయడానికి కారణం లేక పోలేదు. అతడి రూపాన శోభిల్లే ముఖ వర్ఛస్సు అటువంటిది మరి. అంతే కాక— అతడికది మరలరాని తరుణం— విధి విధాత రచించిన దైవీక శాసనం-- 


కొంతసేపటికి అతడి తరుణం రానే వచ్చింది. సుగంధి ముందు ముఖా ముఖిగా నిల్చోవలసి వచ్చింది. అప్పుడతడు ఎటు వంటి జాప్యానికీ తావివ్వకుండా అతడే పరిస్థితిలో ఇంటినుండి బయల్దేరాడో ఎలా రాజమందిరం వేపు నెట్టవేయబడ్డాడో వివరించడానికి నోరు తెరిచాడు. కాని ఆశ్చర్యం! అప్పటికే శుభకార్యం శుభ ముహూర్తాన జరిగిపోయింది. యువరాణి ముఖ 

బింబిం నుండి అంతవరకూ ఎవరికీ ఎన్నడూ చూపించనివ్వని మేలి ముసుగు తానుగా తొలగిపోయింది. తొలగిపోయిన ఆమె మేలి ముసుగు అలా అలా గాలిలో తేలుతూ మనోహరుడి వదనాన్ని చుట్టేసుకుంది. ఆ విధంగా వాళ్ళిద్దరి బంధాలనూ వీడని మల్లె తీగలా పెన వేసుకునేలా చేసింది. 


ఇక పైన కూడా మనోహరుడు రాజాజ్ఞను కాదనగలడా! రాజ పురోహితుల వాక్యాన్ని మీర గలడా! అందాల సౌభాగ్యవతి యువరాణి ఆనతి మీరగలడా! కాని అందలమెక్కే ఆ అందమైన తరుణాన కూడా తనకు తను విధించుకున్న షరతుని గాని, తానుగా ఆనాడు తన వృద్ధ తల్లిదండ్రుల కిచ్చిన మాటను గాని మనసా వాచా కర్మణ: మరవలేదు ఆరైతు బిడ్డ-- . చెల్లెలు పెండ్లి పీటల పైన కూర్చున్న తరవాతనే యువరాణికి మూడు ముళ్లూ వేసాడు రాజసం ఉట్టిపడే గంభీర వదనంతో-- 


శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.






 
 
 

Comments


bottom of page