#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Melukolupu, #మేలు కొలుపు
Melukolupu - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 08/12/2024
మేలు కొలుపు - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
చక్కని దారిలో నడుస్తూ
చుక్కల్లా ప్రకాశించాలి
మొక్కల్లా ఒదిగి ఎదుగుతూ
మిక్కిలి ఖ్యాతిని పొందాలి
హద్దుల్లోనే జీవిస్తూ
వృద్ధిలోన ప్రవేశించాలి
బుద్ధులు కాస్త దిద్దుకుంటూ
శుద్ధంగా జీవించాలి
కన్నవారిని గౌరవిస్తూ
మిన్నగా ఇల రాణించాలి
వెన్నెల్లాంటి హృదయంతో
వెన్నెముకై భువిని నిలవాలి
నవ్వులు ముఖమున చిందిస్తూ
పువ్వుల సొగసులు రువ్వాలి
దివ్వెల రీతిలో వెలుగుతూ
గువ్వల్లాగ విహరించాలి
-గద్వాల సోమన్న
Comments