మేటి సూక్తులు
- Gadwala Somanna
- 3 days ago
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #MetiSukthulu, #మేటిసూక్తులు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 49
Meti Sukthulu - Somanna Gari Kavithalu Part 49 New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 31/03/2025
మేటి సూక్తులు - సోమన్న గారి కవితలు పార్ట్ 49 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
మేటి సూక్తులు
----------------------------------------
చదువుతో సంస్కారము
అనుభవంతో పాఠము
నేర్చుకున్న బ్రతుకులో
విజేతే విశ్వంలో
ఐశ్వర్యముతో గర్వము
తగిన సమయాన మౌనము
ఏమాత్రం పనికిరాదు
కలనైనా చూపరాదు
కోట్లు సంపాదించినా
మేడలో నివసించినా
జానెడు పొట్ట కూటికే!
కడకు చేరేది కాటికే!
జీవితంలో నలుగురు
నీకంటూ ఉండాలి
ఇల నవ్వుతూ,నవ్విస్తూ
తృప్తిగా జీవించాలి

మాస్టారు హెచ్చరికలు
----------------------------------------
దారి చూపిన వాడు
మదిని గెలిచిన వాడు
అట్టి వాడే మహిని
గౌరవింపగ రేడు
భువిని పచ్చని చెట్టు
ప్రాణ వాయువు చెట్టు
త్యాగానికి చిహ్నము
పోయు ఆయువు చెట్టు
ముప్పు తెచ్చును అహము
అక్షరాలది నిజము
విడిచిపెడితే మేలు
జీవితాల్లో జయము
గుండె గుండెకు తెలుసు
మనసు బంగరు గొలుసు
అదువు తప్పితే ఇక
అగును కంట్లో నలుసు
అహము పెంచును ధనము
పాడు చేయును గుణము
జాగ్రత్త! అవసరము
లేకపోతే హతము

అక్షరాభిలాష
----------------------------------------
నవ్వులను రువ్వరా!
పువ్వుల రీతిలోన
చుక్కలా వెలగరా!
చక్కని బ్రతుకులోన
మొక్కలా ఎదగరా!
ఎవరెస్టు శిఖరమై
సత్యాన్ని చాటరా!
మువ్వల సునాదమై
కన్నోళ్లను చూడరా!
అత్యంత గొప్పగా
కాఠిన్యము వద్దరా!
కరుణ రసం మేలురా!
ఇంటి ప్రమిద అమ్మరా!
అనురాగ దేవతరా!
అవసాన దశలోన
ఆదరించు ప్రేమగా!

కోకిలమ్మ పలుకులు
----------------------------------------
కడుక్కో! బుర్రలోన
మలినాన్ని శుభ్రంగా
విశ్వావసు వత్సరాన
ఉండిపో! స్వచ్ఛంగా
సాహస పనులు పూనుకొని
నిలిచిపో! విజేతగా
దురాలవాట్లు మానుకొని
మారిపో! ముత్యంగా
ఘనమైన మానవత్వము
గుండెలోన నింపుకొని
దయలేని దానవత్వము
క్షుణ్ణంగా త్రుంచుకొని
పదిమందికి స్ఫూర్తిగా
ఇల ఆదర్శమూర్తిగా
జీవితాన్ని సార్థకము
చేసుకొమ్ము గొప్పగా

సాగరం మనోహరం
----------------------------------------
తనలోన కలుపుకొనును
నదులన్నీ సాగరము
దానిలోని రహస్యాలు
శోధింపగ అబ్బురము
ఎన్నెన్నో జలజీవుల
అమోఘమైన స్థావరము
సాయంకాల సమయాన
చూడంగా మనోహరము
కనువిందు చేస్తుందోయ్!
విశాల సాగర తీరము
ఆహ్లాదం పంచునోయ్!
జీవనోపాధికి ద్వారము
నర్తించే అలలపై
ఆనందం జలమార్గము
మత్స్యకారులకైతే
నమ్ముకున్న దైవము

-గద్వాల సోమన్న
コメント