#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #MobileChesinaNashtam, #మొబైల్చేసిననష్టం, #TeluguKathalu, #తెలుగుకథలు

Mobile Chesina Nashtam - New Telugu Story Written By - Palla Venkata Ramarao
Published In manatelugukathalu.com On 21/01/2025
మొబైల్ చేసిన నష్టం - తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆదిశేషు కొత్తగా స్మార్ట్ ఫోన్ కొన్నాడు. అతడు పెద్దగా చదువుకోలేదు. అందువల్ల దాన్ని ఎలా ఉపయోగించాలో స్నేహితుడు రాజేష్ ను అడిగి తెలుసుకున్నాడు. మెల్లిమెల్లిగా అందులో ఉండే ఫీచర్లు అన్నిటిని ఉపయోగించడం నేర్చుకున్నాడు. తర్వాత అతనికి సోషల్ మీడియా ఆప్స్ ను ఉపయోగించాలని కోరిక కలిగింది. తన చుట్టుపక్కల వాళ్లు, స్నేహితులు, బంధువులు వాటిని ఉపయోగించి పదిమందిలో కాస్త గుర్తింపు తెచ్చుకోవడం గమనించాడు.
తాను కూడా వాటిని ఉపయోగించి పోస్టులు పెడితే, తనను అందరూ గుర్తిస్తారని అనుకున్నాడు. మళ్లీ రాజేష్ ని అడిగి వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పమన్నాడు. అప్పటికి రాజేష్ చెబుతూనే ఉన్నాడు ఆ మాయలో పడిపోతే కష్టం, నీ పనులకు చేటు అని. అయినా ఆదిశేషు వినలేదు. సరే నీ ఇష్టం అంటూ నేర్పాడు రాజేష్.
క్రమక్రమంగా సోషల్ మీడియా ఆప్స్ ను ఉపయోగించడం మొదలుపెట్టాడు శేషు. ముఖ్యంగా 'సందేశం' అనే ఆప్ ను బాగా వాడుతున్నాడు. అందులో స్నేహితులు, తెలిసిన వాళ్ళు పలకరించుకోవడానికి మాట్లాడుకోవడానికి మంచి అవకాశం ఉంది.
ఒకరోజు పొద్దునే 'సందేశం' యాప్ ను తెరవగానే అందులో ఒక మెసేజ్ కనిపించింది. అది తన స్నేహితుడు దుర్గారావు నుంచి వచ్చింది. అందులో అతని ఫోటో కూడా ఉంది. దాని సారాంశం ఏమిటంటే తాను హఠాత్తుగా జబ్బు పడ్డానని, హాస్పిటల్లో ఉన్నానని, మాట్లాడే పరిస్థితిలో లేనని, తనకు అర్జెంటుగా ఇరవై వేల రూపాయలు అవసరం అయిందని, ఆన్లైన్ ద్వారా డబ్బు పంపమని కోరాడు దుర్గారావు.
స్నేహితుడు ఆపదలో ఉంటే ఆదుకోవడం తన కర్తవ్యం అని భావించి వెంటనే డబ్బు పంపాడు ఆదిశేషు. దుర్గారావుది పక్క ఊరు. అందువల్ల వీలైనప్పుడు పరామర్శించవచ్చులే అనుకుని పనిలో పడిపోయాడు ఆదిశేషు.
మూడు రోజుల తర్వాత కూరగాయల కోసం మార్కెట్ కి వెళ్ళాడు ఆదిశేషు. అక్కడ దుర్గారావు కనిపించాడు. మూడు రోజులకే మనిషి బాగయ్యాడు అనుకుని వెళ్లి దుర్గారావును పలకరించాడు. దుర్గారావు కూడా చాలా రోజులకు కలిశాం అంటూ ఆప్యాయంగా మాట్లాడాడు.
"నువ్వు మూడు రోజులకే కోలుకున్నావు. అందులోను చాలా హుషారుగా ఉన్నావు. నాకు సంతోషంగా ఉంది" అన్నాడు ఆదిశేషు.
దాంతో ఆశ్చర్యంగా "నాకేమైంది నేను బాగానే ఉన్నాను" అన్నాడు దుర్గారావు.
"అదేంటి నువ్వే కదా నీకు జబ్బుగా ఉంది, హాస్పిటల్లో ఉన్నాను, ఇరవై వేలు కావాలని నాకు మెసేజ్ పెట్టావు. నేను నీకు డబ్బు పంపాను కదా!" అన్నాడు.
దాంతో దుర్గారావు మరింత ఆశ్చర్యంగా "నేను నీకు మెసేజ్ పెట్టానా? ఇరవై వేలు పంపావా! ఎప్పుడు?" అన్నాడు.
ఆదిశేషుకు కోపం వచ్చింది. "అవసరం తీరిందని ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావా? నువ్వే కదా సందేశం యాప్ ద్వారా నాకు మెసేజ్ పెట్టింది" అంటూ చూపించాడు ఫోన్లో.
అది చూసిన దుర్గారావు "ఇది నా పేరుతోనే వచ్చింది. కానీ నేను పంపలేదు" అన్నాడు.
"అబద్దాలు చెప్పకు. నువ్వు కాకపోతే నీ ఫోటోతో ఎలా వస్తుంది?” అని అడిగాడు.
"నా ఫోటో సరే. నా నెంబర్ నుంచే వచ్చిందా?" తిరిగి ప్రశ్నించాడు దుర్గారావు.
"ఏమో నేను చూసుకోలేదు. అందులో ఏదో ఫోన్ నెంబర్ కు డబ్బు పంపమంటే ఆ నెంబర్ మీ ఇంట్లో వాళ్ళదేమో అనుకున్నా" అన్నాడు శేషు.
"ఆ నెంబర్ నాది కాదు. నెంబర్ ఎవరిదో అది ఎక్కడి నుంచి వచ్చిందో చెక్ చేసుకోకుండా డబ్బు పంపడం నీ పొరపాటు. ఒకసారి నాకు ఫోన్ చేయొచ్చు కదా!" అన్నాడు దుర్గారావు.
"నువ్వు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావని మెసేజ్ లో ఉంది. అందువల్ల ఫోన్ చేయలేదు" అన్నాడు శేషు.
"మొత్తానికి నువ్వు మోసపోయావు. పైగా నన్ను నిందిస్తున్నావు. ఇది ఎవరో సైబర్ నేరస్తుడు చేసిన పని. నువ్వు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి విషయం ఏమిటో కనుక్కో" అన్నాడు దుర్గారావు.
మోసపోవడమే కాక స్నేహితుడితో పొరపొచ్చాలు వచ్చినందుకు చింతించాడు ఆదిశేషు. పూర్తి విషయపరిజ్ఞానం లేకుండా మొబైల్ ను వాడడం వల్ల అనర్ధాలు జరుగుతాయని అర్థమైంది శేషుకి.
----------
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.
@veeraiahkatam4399
• 4 hours ago
bagundi story