మోహం
- Hanumantha
- Apr 7, 2023
- 2 min read

'Moham' New Telugu Story
Written By Hanumantha T
'మోహం' తెలుగు కథ
రచన: T హనుమంత
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
నీలి మేఘాన్ని నల్లని మబ్బులు పూర్తిగా కమ్మేసినాయి. నా మత్తు బుర్రకి అదోరకమైన మట్టి వాసన మెలుకువ నిస్తోంది. హైవే మీద వాహనాల హరన్లు నాలో విరక్తిని కలిగిస్తున్నాయి. కదలమని బుర్ర చెబుతున్నా, దేహంలో కదలిక లేదు. పక్కకి తలవాల్చి చూసా. చెట్టు కింద ఒక అమ్మాయి కడుపుతో ఉంది. అది ఎవరో కాదు.. 'నా భర్త' అనుకోని నాతో వచ్చిన నా పెళ్ళాం. మెడలో పసుపు తాడు కూడా కట్టలేదు.
‘సంవత్సరం నుంచి నీవెంట పడి నిన్ను ప్రేమించాను, నీ కోసం ఏమైనా చేస్తా’ అని నమ్మచెప్పినందుకే అది నా వెంట వచ్చింది. మొదట్లో బాగా చూసుకున్నా, తర్వాత పనికి పోక, తినడానికి తిండి దొరక్క, మద్యానికి బానిసై, దాని పైనే ఆధారపడి, ఇదిగో.. ఇలా జీవనం సాగిస్తున్నా. ఇప్పుడు కూడా తాగి ఎక్కడో పడిపోతే, అదే నన్ను ఇక్కడి దాకా తెచ్చింది. వాన చినుకులు గట్టిగా పడుతున్నాయి. ఉరుములు, మెరుపులకు వణుకుతూ అక్కడే కూర్చొంది అది. తనకు కూసింత రక్షణ కల్పించలేని స్థితిలో నేనున్నాను. వాహనాల్లో వచ్చే ఆకతాయిలు తనని ఇబ్బంది పెడుతున్నారు. అయినా నాలో ఏమాత్రము కదలిక లేదు.
***
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కబడ్డీ ఆటలో గెలిచి ఆమెను గెలిచాను. తన పేరు స్వప్న. మా క్లాస్ లో బాగా చదువుకొనే అమ్మాయిల్లో తను ఒకటి. నేనేమో క్లాసులు ఎగ్గొట్టి గేమ్స్ ఆడటం, గుంపులుగా తిరగడం, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వంటి నానా రభస చేసేవాడిని. పరీక్షలు రాసేటపుడు నెంబర్ ప్రకారం నా ముందరే కూర్చునేది. అలా పరిచయమైంది. రోజూ తన వెంట తిరిగేవాడిని, ఇంతకు ముందులా కాక మొదటి నుండి చివరి పిరియడ్ వరకు క్లాస్ లోనే కూర్చొనే వాడిని.
ఎప్పటి లాగానే పరీక్షలో నేను మళ్ళీ ఫైల్ అయ్యాను మామధ్య మరింత స్నేహం పెరిగింది. మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో పాస్ అయ్యాను. అప్పటికే మా మధ్య దూరం చాలా తగ్గి పోయింది.
****
కురుస్తున్న జడివానలో సరిగ్గా చెట్టు దగ్గరికి ఒక బైక్ వచ్చి ఆగింది. నాకు సరిగ్గా కబడలేదు. తడుస్తున్న అమ్మాయికి తన జాకెట్ తో కప్పి, బైక్ మీద ఎక్కించుకొని నా దగ్గరకు వచ్చి ఆగింది. అదే ముఖం మళ్ళీ చూడకూడదనుకున్నా.. వాడి పేరు సురేష్. మా అబ్బాయిల్లో టాపర్. వాడికి మరదలే ఈ స్వప్న. నేను గెలిచిన కబడ్డీ ఆటలో అతను ఓడిపోయాడు. సురేష్ కూడా ఆ అమ్మాయిని ప్రేమించాడు. కానీ వాడికున్న ఇబ్బందులకు స్వప్న వెంట తిరిగేవాడు కాదు. అదే అదునుగా నేను మరింత స్నేహం పెంచుకున్నా.
***
నన్ను వాడి రూం కి తీసుకెళ్ళాడు. తన ఫ్రెండ్స్ తో స్వప్నను హాస్టల్ గదిలో పెట్టాడు. వారం రోజుల్లో నాకో మంచి పని దొరికింది. మూడు నెలలు తిరిగే సరికి నేను, స్వప్న ఇద్దరం ఒకరూంలో ఉంటూ హాయిగా జీవిస్తున్నాం. స్వప్న తనకు దక్కక పోయినా ఆమెకు, తన భర్తనైన నాకు సహాయం చేసాడు.
సురేష్ కబడ్డీలో ఓడిపోయినా, స్వప్నను పొందలేకపోయినా తన ప్రవర్తనతో విజేతగా నిలిచాడు.
T హనుమంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు: హనుమంత
జిల్లా: అనంతపురము
డిగ్రీ 3వ సంవత్సరం
Comments