#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #MruthyormaAmruthangaMaya, #మృత్యోర్మాఅమృతంగమయ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు
Mruthyorma-Amruthanga Maya - New Telugu Story Written By - Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 15/11/2024
మృత్యోర్మా అమృతంగ మయ - తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
1942 ఆగస్ట్ 8:
గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు నిచ్చారు. ఆయన స్ఫూర్తి తో ఎంతో మంది ఉద్యమం లోకి దూకారు.
ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ ఆగస్టు 7, 1942:
"పార్వతీ, రేపు చాలా ముఖ్యమైన రోజు. ఉదయం 5 గంటలకే పేపర్ బయటికి వెళ్లి పోవాలి. అందు లో మా బృందం కొన్ని పాంప్లెట్లు పెట్టాలి." ఆవేశం గా చెప్పాడు నరసింహం.
"రేపు ఒక్క రోజు, మీరు ఎక్కడికి వెళ్ళకండి" అంది పార్వతి.
"ఏం"
"రేపు మన పెళ్ళి రోజండి"
"దేశం కన్నా మన పెళ్ళి రోజు ఎక్కువ కాదు. నన్ను వెళ్ళనియ్యి"
నరసింహం బ్రిటీష్ వారికి తెలియకుండా, రహస్యంగా, "కేసరి" అనే పత్రిక నడుపుతున్నాడు. నరసింహం రాత్రి పన్నెండు గంటల వరకూ వార్తలు కంపోజ్ చేస్తున్నాడు. చాలా ఉత్సాహం గా ఉన్నాడు.
సరిగ్గా ఒంటి గంట కి ప్రెస్ బయట కాల్పులు వినిపించాయి. బ్రిటీష్ సైనికులు ప్రెస్ ని చుట్టుముట్టారు. నరసింహం పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని అప్పటికే ఆలస్యమయ్యింది. గుండు అతని ఛాతి లోకి దూసుకు పోయింది.
నరసింహం నేల కొరిగాడు. నరసింహం స్నేహితుడు, ఫణి శర్మ నమ్మకం గా ఉన్నట్లు నటిస్తూ, కేసరి ముద్రించే ప్రెస్ గురించి సమాచారం బ్రిటిష్ వాళ్ళ కి ఇచ్చాడు.
********
"అమ్మా! ఘోరం జరిగింది. ప్రెస్ మీద బ్రటీష్ వాళ్లు కాల్పులు జరిపారు. నువ్వు ఉన్నపళం గా ఈ ఊరు ని విడిచి పెట్టాలి. లేకుంటే బ్రిటీష్ వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు." అని పార్వతి స్నేహితురాలు ఒక నల్లని బురఖా కప్పి రైల్వే స్టేషన్ కి తీసుకు పోయింది పార్వతిని.
పార్వతి దు:ఖాన్ని దిగమింగి మద్రాసు వెళ్ళే రైలు ఎక్కింది. తన కడుపు లో ఉన్న బిడ్డ కోసమేనా తను బ్రతకడం తప్పదు అనుకుంది.
******
పదేళ్ళ తర్వాత
అప్పటీకే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. పార్వతి నెల్లూరు లో చిన్న హోటల్ నడుపుకుంటూ తన కొడుకు పార్ధూ ని చదివించుకుంటోంది. చాలా మంది ఆమె యవ్వనానికి వలలు వేసినా, వారికి చిక్కకుండా చాకచక్యం గా నెట్టుకొస్తోంది.
పార్ధూ కి పదహారేళ్ళు వచ్చాయి. ఇండియన్ ఆర్మీ లో చేరుతానన్నాడు. పార్వతి భయపడింది.
"తండ్రి ని, కొడుకుని పొగొట్టుకోలేను రా" అని పార్ధూని పట్టుకుని ఏడ్చింది.
పార్ధూ పట్టుపట్టాడు. పార్వతి అయిష్టం గానే తల ఊపింది.
********
పార్ధూ భారత సైన్యం లో పెద్ద ర్యాంకులకు ఎదిగాడు. మేజర్ జనరలయ్యాడు. పార్ధూ కి వివాహమయ్యింది. ఒక పిల్ల వాడు పుట్టాడు. పార్వతి మనవడికి దేశభక్తి కధలు చెబుతూ కాలక్షేపం చేస్తోంది
*******
1999 మే 3
కార్గిల్ సరిహద్దు దగ్గర ఇండియా కి, పాకిస్తాన్ మధ్య యుద్దం ప్రారంభమైంది. మేజర్ జనరల్ పార్ధూ వ్యూహాత్మకం గా వ్యవహరించి పరిస్థితిని అదుపు చెయ్యాడానికి ప్రయత్నిస్తున్నాడు. భారత్ ఎక్కువ మంది సైనికులను పోగొట్టుకుంది.
పార్ధూ తన టీం లేకుండా, భారత సరిహద్దును దాటి, మువ్వన్నెల జెండా తో పాకిస్థాన్ సైనికులను ఎదుర్కున్నాడు. వరుస గా సైనికులను పేలుస్తూ వెళ్ళాడు. అప్పుడే లోయ అంచు దగ్గర లో ఉన్న పొద నుండి పాకిస్తాన్ సైనికుడు పార్థూ ని, పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చాడు. బాలెన్స్ తప్పి లోయలో పడిపోయాడు పార్థూ.
********
కార్గిల్ యుద్దం ముగిసింది. భారత ప్రభుత్వం మేజర్ జనరల్ పార్థూ మరణించి ఉండవచ్చు లేదా పాకిస్తాన్ సైనికులకు దొరికి ఉండవచ్చు అని ప్రకటించింది.
ఆ వార్త విని కుప్పకూలిపోయింది పార్వతి!
భారత ప్రభుత్వం మరణానంతరం పార్థూ కి పరమవీర చక్ర ప్రకటించింది. ఆ అవార్డు స్వీకరిస్తూ పార్థూ భార్య కన్నీరు పెట్టుకుంది.
*********
పదేళ్ళ తర్వాత స్వామి ప్రణవానంద నెల్లూరు వచ్చారు. ఆయన ప్రవచనాలు వినడానికి పార్వతి వెళ్ళింది. వెళ్ళి ఆశ్చర్య పోయింది. ఆయన లో పార్దూ పోలికలు కనిపిస్తున్నాయి. ఆయన తో మాట్లాడడానికి ప్రయత్నించింది పార్వతి. శిష్యులు అనుమతించ లేదు.
********
లోయలో పడిపోయిన పార్ధూ కి నాలుగు రోజుల తర్వాత
తెలివి వచ్చింది.ఒంటి నిండా గాయాలతో, పాకుతూ, భారత భూభాగం వైపు వెళ్ళాడు. అక్కడ సైనికులు గుర్తు పట్టి ఆర్మీ హాస్పీటల్ లో చేర్చారు. నుదుటి మీద గుండు ను తొలగిస్తే ప్రాణానికే ప్రమాదం అని దానిని అలాగే వదిలేసారు. మిగిలిన గాయాలకు చికిత్స చేసి.
తల లో గుండు ఉండడం వల్ల విపరీతమైన తల నొప్పి వచ్చేది పార్ధూకి. జరిగిన సంఘటన వల్ల గతం మరిచిపోయాడు. అక్కడే కొన్నాళ్ళు తిరిగి, తరువాత ఎవరికీ కనబడలేదు.
******'**
ఐదేళ్ళ తర్వాత
హరిద్వార్ :
అతనిని పరీక్షించి తన కార్యానికి తగిన వ్యక్తి అని, అతని నుదుటి మీద గుండు బాధ పెట్టకుండా మంత్రజలం చల్లారు స్వామి చేతనానంద. అతని గతం కన్నా భవిష్యత్ ముఖ్యమని స్వామి చేతనానంద భావించారు. తన కార్యాని కి తగినట్లు అతనిని మలిచి అతనికి ప్రణవానంద గా నామకరణం చేసి, సన్యాస దీక్ష ఇచ్చారు. పార్థూ ప్రణవానంద గా మారిపోయాడు. ప్రణవానంద దేశమంతా తిరిగి ధర్మ ప్రచారం చేస్తున్నారు. పార్థు ప్రణవానంద అని పార్వతికి ఎప్పటికీ తెలియలేదు.
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
ఈ కథ భారత స్వాతంత్ర్యోద్యమం మరియు కార్గిల్ యుద్ధం నేపథ్యంలో రాయబడింది. ఇది త్యాగం, ధైర్యం మరియు దేశభక్తి విలువలను ప్రతిబింబిస్తుంది. పార్వతి మరియు పార్థూ లాంటి పాత్రలు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. బాగుంది