'Muddula Manavadu' - New Telugu Story Written By Nagamanjari Gumma
Published In manatelugukathalu.com On 12/09/2024
'ముద్దుల మనవడు' తెలుగు కథ
రచన: నాగమంజరి గుమ్మా
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“అసలు దీనికి పెళ్లి కుదురుతుందా అని? ఎప్పుడు దీనికి పెళ్లవుతుందో? దీని కడుపున కాయెప్పుడు కాస్తుందో? నేనెప్పుడు చూస్తానో… నాకు ఈ నూకలు చెల్లేలోగా దాని నెత్తి మీద నాలుగు అక్షింతలు వేస్తానో లేదో?” మంచం మీద కూర్చుని వల్లిస్తోంది వరాలమ్మ.
“అమ్మా! కంగారు పడకే! అన్నీ అవుతాయి. నువ్వు ముని మనవరాలిని చూసే వెళ్తావు. సంబంధాలు చూస్తున్నాం కదా” నెమ్మదిగా చెప్పాడు నరసింహం.
వరాలమ్మకి ముద్దుల మనవరాలు సుజాత. తన తల్లి పోలికే అని నరసింహంకి సుజాత అంటే గారాబం. వరాలమ్మ అయితే ఈగ కూడా వాలనివ్వదు. ఇంటికి దగ్గరగా ఉండేలా మంచి సంబంధం చూసి చేద్దామని నరసింహం ఉద్దేశ్యం. సుజాతకు ఈ ముద్దులు, మురిపాలు వీటితో పనిలేదు. అంత ముద్దు చేస్తున్నారని మంకుగా తయారవలేదు. ఒద్దికగా పెరిగింది. దాంతో పాటు ఒళ్లు పెరిగింది. చక్కగా చదువుకుంది. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అని అనుకుంటుంది.
మొత్తానికి తన కుటుంబానికి తగ్గట్టు, తన కూతురికి సరిగ్గా సరిపోయే మరో మంచి కుటుంబం నుంచి శేఖర్ అనే కుర్రాణ్ణి చూసి సుజాతకు పెళ్లిచేసాడు నరసింహం. వరాలమ్మ మనవరాలిని, మనవణ్ణి దీవించింది. నెలరోజులు మనవరాలి ఇంట్లోనే ఉండి, వాళ్ళ కాపురాన్ని చూసి, తృప్తిగా తిరిగి ఇంటికి వచ్చింది.
“ఏమే సుజాతా! ఈ వారం విశేషం ఏమైనా ఉందా?” వరాలమ్మ ఆరాగా అడిగేది.
“ఉంటే చెప్పనా నాన్నమ్మా” అనేది సుజాత.
“నీ పెళ్లి అయ్యి రెండు నెలలు దాటిపోయింది కదూ! నేను నెల తిరిగేసరికే నెలతప్పేను” అంది వరాలమ్మ. “దీని కడుపున కాయెప్పుడు కాస్తుందో, నేనెప్పుడు చూస్తానో…” వల్లించేది వరాలమ్మ.
రెండు నెలలు కాస్తా ఆరునెలలు అయ్యింది. ఒక శుభ ముహూర్తంలో, కాస్త అస్వస్థతగా ఉండి డాక్టర్ దగ్గరకు వెళ్లి వచ్చిన సుజాత తల్లి కాబోతోందని తెలిసింది. అందరూ సంతోషించారు. కానీ స్కానింగ్ చేసేటప్పటికి మళ్ళీ మరో గాభరా… ‘కడుపులో బేబీ ఉందని తెలుస్తోంది, కానీ కనిపించడం లేదు. తల్లి పొట్టలో కొవ్వు పొరలు మందంగా ఉండటంతో బేబీ కదలికలు స్పష్టంగా తెలియడం లేదు’ అన్నది ఆ రిపోర్ట్ సారాంశం. అందరికి మళ్ళీ గాభరా వేసింది. ఐదవ నెలలో, ఏడవ నెలలో, తొమ్మిదవ నెలలో కూడా అదే రిపోర్ట్…
తిండి తగ్గించబోతే చూలింత. నచ్చినవి, మెచ్చేవి, సరిపడేవి అన్నీ తినేది సుజాత. బరువు తగ్గలేదు… కడుపులో బిడ్డ స్కానింగ్ కి అందలేదు.
మొత్తానికి నెలలు నిండి సుజాతకు సుఖ ప్రసవం అదేనండి కత్తెర ప్రసవం అయ్యింది. నాలుగున్నర కేజీల బరువుతో చక్కటి పిల్లాడు పుట్టాడు సుజాతకు. ముద్దులొలికే బాబుని ఎత్తుకుని ముద్దులాడింది సుజాత.
“భడవా! బొజ్జలో దాగుని ఎంత హడావుడి చేశావురా” అంటూ మురిపెంగా మునిమనవణ్ణి చూసుకుని మురిసిపోయింది వరాలమ్మ.
******* ********** ********** **********
నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
పేరు: నాగమంజరి గుమ్మా
భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు
వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని
నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా
ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.
వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం.
విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం
పురాణ ప్రవచనం చేయడం
రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.
విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.
@ratnamanjari8642
• 6 days ago
ధన్యవాదాలండి.
@dasaradhikari84
• 4 days ago
బాగుంది