top of page
Writer's picturePenumaka Vasantha

మూగ కళ్ల వూసులు

#పెనుమాకవసంత, #PenumakaVasantha, #MugaKallaVusulu, #మూగకళ్లవూసులు, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


'Muga Kalla Vusulu' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 26/10/2024

'మూగ కళ్ల వూసులు' తెలుగు కథ

రచన: పెనుమాక వసంత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 "రక్తం చాలా పోయింది. త్వరగా ఇతన్ని ఐసియులో చేర్చండి. పల్స్ చాల వీక్ గా కొట్టుకుంటుంది" అని డాక్టర్, సిస్టర్స్ ను ఆదేశించాడు. 


 "ఒకే డాక్టర్.. !” అంటూ అతన్ని ఐసీయూ లో జాయిన్ చేసారు సిస్టర్సు. "ఇతన్ని కేరుగా చూడండి”, అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. 


 "సిస్టర్, ఎలావుందీ? ఐసీయూలో పొద్దున చేరిన పేషెంట్ కు, అన్నీ సరిగాఇస్తున్నారా?" అని అడిగింది ఆ వార్డ్ ఇన్చార్జి రమ్య, సిస్టర్ ను. 


 సిస్టర్ తలవూపినా, డాక్టర్ ప్రత్యేక కేర్ తీసుకోమనటం గుర్తొచ్చి ఒకసారి ఆ పేషెంట్ ను చూసేందుకు లోపలికి వెళ్ళింది రమ్య. 


యాక్సిడెంట్ కేసు, ఒక్క మొహం తప్ప అన్నీ భాగాలకు కట్లు వున్నాయి. 


'కానీ మొహం ఎక్కడో పరిచయం వున్న మొహంలాగా వుందే.. !' అనుకుంటూ దగ్గరకు వెళ్ళి చూసింది. 


 ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 


 'ఇతను సుదీప్! ఇక్కడికి ఎలా వచ్చాడు? అయ్యో దేవుడా! ప్లీజ్.. సుదీప్ ను కాపాడు. సుదీప్.. నువ్వు బ్రతకాలి' అయ్యో సుదీపుకు ఎందుకు ఇట్లా అయిందని ఆ రోజంతా రమ్య బాధ పడింది. 

 

 ఆ రోజు గడిస్తే కానీ చెప్పలేమన్నారు డాక్టర్స్. ఆ రోజు రమ్యకు నైట్ డ్యూటీ. సిస్టర్ పడుకుంటే తను లోపలికి వెళ్ళి సుదీపును చూసి వచ్చింది. 


రమ్య సుదీప్ చెవిలో, “సుదీప్.. ! ప్లీజ్.. నువ్వు బతకాలి. ఇపుడే నువ్వు చనిపోగూడదు. లే.. !” చెప్తూనే వుంది. 


ఆ మాట విన్నప్పుడు కొంచం సుదీప్ లో కదలిక కనపడగానే, బయటకు వచ్చింది రమ్య. 


 మళ్ళీ లోపలికి వెళ్ళి, చెవిలో "సుదీప్ ప్లీజ్ లే.. ! నువ్వు బతకాలి. ఐ లవ్ యూ.. !" అని మళ్ళీ చెప్పింది. ఆ మాటలకు ఒక నిముషం కదిలాడు. 


 అలా ఆ రెండు రోజుల్లో సుదీపును కాపాడటానికి ట్రై చేసింది రమ్య. ఆతర్వాత సుదీప్ కళ్ళు తెరిచి చూసాడు. రూంకు షిప్ట్ చేసి సుదీప్, ప్రమాదం నుండి బయట పడ్డాడని చెప్పాడు డాక్టర్. 


 సుదీప్ కు చెవిలో నువ్వు బతకాలి అని చెప్పిన మాధురి గొంతు గుర్తుకు వచ్చింది. నా మాధురి నా కోసం వచ్చింది. ఇక్కడే ఎక్కడో వుందని తన రూంలోకి వచ్చిన సిస్టర్స్ ను పరిశీలనగా చూస్తూ అనుకుంటున్నాడు సుదీప్. 

 

 మాధురి గూర్చిన తలపులోకి సుదీప్ వెళ్ళాడు. మాధురి తను ఒకే కాలేజీలో చదువుకున్నారు. తన కన్నా రెండేళ్ళ జూనియర్. తను ఎక్కే కాలేజి బస్ ఎక్కేది. ఇద్దరూ చూపులతో చూసుకోవటం తప్ప ఒక్కసారి మాట్లాడుకోలేదు. 


తన డిగ్రీ అయిపోయి బ్యాంక్ఎగ్జామ్ లో సెలెక్ట్ అయి సిటీలో పోస్టింగ్ వస్తె, ఇక్కడకు వచ్చి జాయినయ్యాడు. 


 ఆ తర్వాత తన నాన్నతో మాధురినీ పెళ్లి చేసుకుంటానని అడిగాను. 


"ఆ అమ్మాయిది మన కులమేనా?" అడిగాడు. 


"మన పక్కన వూరిలో ఉంటారు మనకులం కా”దన్నాడు తను.


"అయితే, వద్దు ఈ సంబంధం" అన్నాడు నాన్న. 


"నేను ఆ అమ్మాయినే చేసుకుంటా”నన్నాడు తను. 


"సరే నేను వాళ్ళింటికి వెళ్ళి కనుక్కుని ఏ విషయం చెప్తా”నన్నాడు నాన్న. 


 "ఒరే సుదీప్! ఆ వూరెళ్ళి కనుక్కుంటే ఆ అమ్మాయికి పెళ్లి అయిందట. నువ్వు నే చెప్పేది నమ్మవు గానీ ఇదిగో వాళ్ల నాన్నతో మాట్లా”డని ఫోన్ మాధురి నాన్నకు ఇచ్చాడు సోమయ్య. 


 ఆయన "బాబు, మా అమ్మాయికి పెళ్లి మా బావమరిదితో అయింది. మీ నాన్న చెప్పేది నిజం" అన్నాడు. 


తనమీద తనకు అసహ్యం వేసింది. అపుడే మాధురితో మాట్లాడి తన ప్రేమను చెప్పాల్సింది. నాన్న వాళ్ళు సంబంధాలు చూస్తున్నా.. ఈ రెండేళ్ల నుండి నచ్చటంలేదని ఎవర్ని ఒప్పుకోవటం లేదు. 


 తను స్పృహలో లేనప్పుడు తన చెవిలో మాట్లాడిన గొంతు మాధురిదే, డౌట్ లేదు. 


తామిద్దరూ మాట్లాడుకోకపోయినా బస్ లో మాధురి ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే తన గొంతు వినే వాడు. అందువల్ల మాధురి గొంతు తనకు బాగా తెలుసు. 


తన వైపు ఎపుడు చూడటంతో, తన మీద ప్రేమ వున్నట్లుగా అనిపించేది. ఒక్కరోజు మాధురి 

బస్ ఎక్కకపోయినా తనకేదో వెలితిగా వుండేది. 


బస్ దిగి ఇద్దద్దరూ క్లాస్ రూం వరకు చూసుకుంటూ వెళ్ళేవాళ్ళు. తన పక్క రూంలో మాధురి క్లాస్. 


మధ్య మధ్యలో తనను తన క్లాస్ కెళ్ళి చూస్తూ వుండేవాడు తను. 


 మాధురి క్లాస్ లోని రవి తనకు ఫ్రెండ్. వాడిని కలిసి, ఎలాగైనా మాధురి గురించి

తెల్సుకోవాలనుకున్నాడు.


హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి సుదీప్ వెళ్ళేటప్పుడు సుదీప్ కంట పడకుండా జాగ్రత్త పడింది మాధురి. 


 రవికి కాల్ చేసి మాట్లాడితే, ఇంకా మాధురికి పెళ్లి కాలేదని ఈ సిటీలోనే ఏదో జాబ్ చేస్తూ ఇంటిని

పోషిస్తుందని చెప్పాడు. 


 అయితే మాధురికి పెళ్లి కాలేదు.. ఎలాగైనా తన్ను కనిపెట్టి, నా ప్రేమను తెలియచేస్తా ననుకున్నాడు సుదీప్. 


 మెడికల్ బిల్ కోసం హాస్పిటల్ కు వెళ్ళాడు. డాక్టర్ తో మాట్లాడుతూ "మీ స్టాఫ్ లో మాధురి పేరు కలిగిన వాళ్ళు వున్నారా? డాక్టర్.. !"అడిగాడు సుదీప్. 


 "ఈ మధ్యే, రమ్య మాధురి అనే అమ్మాయి జాయిన్ అయింది. రిసెప్షన్లో వుంటుంది,  సిస్టర్! రమ్యను పిలువు. ఎందుకు మీరు ఆమె గురించి అడుగుతున్నారు?” సందేహంగా అడిగిన డాక్టర్ తో అసలు విషయం చెప్పాడు సుదీప్. 


ఇంతలో సిస్టర్ వచ్చి "ఇవాళ రమ్య లీవ్ సర్.. !" అంది. 


"ఆమె ఇంటి అడ్రస్ నాకు కావాలి సర్ ప్లీజ్.. !" అంటే అడ్రస్ చెప్పాడు డాక్టర్. 


 అడ్రస్ కనుక్కుని ఆమె వుండే రూంకు వెళ్ళాడు. రూం మేట్ "రమ్య పొద్దున తన వూరు వెళ్ళింది. వాళ్ల నాన్నకు బాలేదని. ఎల్లుండి కానీ రాదు" అంది. 


 తను వూరికి ప్రయాణమయ్యాడు. ఈవెనింగ్ ఇంటికి చేరుకుని రెస్ట్ తీసుకుని, మర్నాడు మాధురి వుండే వూరు వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి "వాళ్ల నాన్నను తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళింది" అని మాధురి అమ్మ చెప్పింది. 


 ఆ పక్క నున్న పేటలో హాస్పిటల్ కెళ్లాడు. అక్కడ బయట కుర్చీల్లో మాధురి కూర్చుని వుంది. 


ఫస్ట్ టైం "మాధురి, బావున్నావా?" అంటూ ఎదురు కుర్చీలో కూర్చుంటూ అడిగిన సుదీప్ ను చూసి షాక్ అయింది మాధురి. 


ఇంతలో సిస్టర్ వచ్చి మాధురినీ పిలవటంతో లోపలికి వెళ్ళింది. ఈలోపు 'అమ్మయ్య! మాధురి కనపడిం’దని ఊపిరి పీల్చుకున్నాడు సుదీప్. 


తర్వాత వచ్చిన మాధురితో చాలా సేపు మాట్లాడాడు సుదీప్. 


"థాంక్స్! నన్ను బతికించినందుకు. "


ఆశ్చర్యంగా సుదీప్ వైపు చూసిన మాధురితో  "నాకు అంతా తెల్సు" అని జరిగిందంతా చెప్పాడు సుదీప్.


 సుదీప్ వాళ్ల నాన్న బెదిరింపు గుర్తుకొచ్చి తన ఫ్యామిలీ బావుండాలంటే సుదీప్ కి దూరంగా వుండాలనుకుంది మాధురి. 


 "కానీ, సుదీప్.. మా మామయ్యతో పెళ్లి కుదిరింది. వచ్చే నెలలో నా పెళ్లి.. !" అంది మధురిమ. 


"అదేంటి? అపుడే నీ పెళ్లి అయిందనీ మీ నాన్న చెప్పాడు ఫోన్లో. అయితే అపుడు అవ్వలేదు. ఇపుడు అవుతుందన్నమాట. పెళ్లికి నన్ను పిలుస్తావా?" అన్నాడు ఆట పట్టిస్తూ సుదీప్. 


 "లేదు. నాకు కొన్ని కుటుంబ బాధ్యతలున్నాయి. నువ్వు ఇంకెవరైనా చేసుకో.. !" అని బతిమాలింది మాధురి సుదీప్ ను. 


 "చేసుకునే వాడినైతే రెండేళ్ల క్రితం చేసుకునేవాడిని. సరే నువ్వు లేకుండా నేను బ్రతకను, కనీసం నా శవం మీద పూలదండ వేసి వెళితే నా ఆత్మ శాంతిస్తుంది. నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకుంటూ వుండు" అని చెప్పి బాధగా వెళ్ళాడు సుదీప్. 


 సిటీకి వచ్చి బ్యాంక్ జాబ్ చేస్తున్నాడు సుదీప్. మధురిమ వచ్చి డ్యూటీలో జాయిన్ అయింది. డాక్టర్ పిలిచి సుదీప్ విషయం మాట్లాడాడు. 


"అతన్ని పెళ్లి చేసుకో రమ్యా.. , !" అంటే 

"నాకు కొన్ని బాధ్యతలువున్నాయి. మా నాన్నకు హెల్త్ బాగాలేదు. మా చెల్లి చదువుకుంటుంది దాని బాధ్యత నాదే డాక్టరు.. !" అంది. 


 "ప్రతి దానికి ఒక సొల్యూషన్ వుంటుంది. మీ చెల్లెలికి మన హాస్పిటల్లో జాబ్ ఇస్తే తను మీ ఇంటిని పోషిస్తుంది. సుదీప్ మంచివాడుగా వున్నాడు పెళ్లి చేసుకో.. ! నువ్వు పెళ్ళైనా జాబ్చేసి కొన్నాళ్ళు మీ ఇంటిని ఆదుకో.. !" అని సలహా ఇచ్చాడు డాక్టర్. 


 ఒకరోజు హాస్పిటల్ కి సోమయ్య వచ్చి మాధురితో "మా అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మా.. పెద్దవాడిని అడుగుతున్నాను. నువ్వు లేకపోతే వాడు చస్తానని అంటున్నాడు" అన్నాడు. 


 ఇక చేసేదిలేక సుదీప్ కు కాల్ చేసింది.


రింగ్ టోన్ ‘ఓ మధూ.. !’ అని మోగుతూ వుంది. 

సుదీప్ ఫోన్ ఎత్తితే, "సాయంత్రం కలుద్దామా?" అంది మాధురి. 


 సాయంత్రం సుదీప్ తో అంది మాధురి.

"మనం అసలు మాట్లాడుకోలేదు, ఎపుడు ఒకసారి కూడ. ఎందుకు సుదీప్ నా మీద నీకు ప్రేమ"

మురిపెంగా చూస్తూ అంది. 


 "మట్లాడుకోకపోయినా మన కళ్లు చాలు మనకు ఒకరిమీద ఒకరి ఎంత ప్రేముందని తెలియ చెప్పటానికి. మనిద్దరిది, మూగ సైగల ప్రేమ. అంటే, మన ప్రేమ గుడ్డిది, మూగది, చెవిటిది కూడా. నువ్వు చెవిలో నీ ప్రేమను చెప్పావు కదా! అదే నిన్ను నాకు పట్టించింది" అన్నాడు సుదీప్. 


ఆ మాటలకు సిగ్గుగా నవ్వింది మాధురి. 


సమాప్తం


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


29 views0 comments

Comments


bottom of page