top of page

ముక్కు పొడుంతో తిప్పలు

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #ముక్కుపొడుంతోతిప్పలు, #Mukkupodumthothippalu, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


'Mukku podumtho thippalu' - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 10/10/2024

'ముక్కు పొడుంతో తిప్పలు' తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


సుందరం గారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఏకైక పుత్రుడు కామేశాన్ని యం.ఫార్మా చదివిస్తే మహారాష్ట్ర పూణేలో ఒక పెద్ద ఫార్మా కంపెనీలో జాబ్ దొరికింది. కొడుకు పూణేలో ఫ్లాట్ కొని సెటిలయాడు. కోడలు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఒక మనువడు, మనుమరాలు

 కార్పరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు.


 ఊళ్లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉన్న సుందరం గారు రిటైరైనందున భార్యతో కలిసి పూణే కొడుకు కామేశం దగ్గరకు మకాం మార్చేరు.


సుందరం మాస్టారికి వయసుతో పాటు చాదస్తం పెరిగింది. ఊళ్లో అయితే ఎప్పుడూ ఎవరో ఒకరు కాలక్షేపానికి ఉండేవారు. భార్యతో ఊరు కాని ఊరు భాష తెలియని ప్రదేశమైనందున విసుగ్గా ఉంటున్నారు. 


 కొడుకు కోడలు పిల్లలు ఉదయం టిఫిన్లు తిని ఎవరి డ్యూటీలకు వారు, మనవలు స్కూలుకి వెళిపోతారు. సుందరం గారి భార్య సుభద్రమ్మ పూజా కార్యక్రమాల్లో నిమగ్నమవుతుంది.

 సుందరం గారికి పుస్తకాలు, టీ. వీ లో వచ్చే కార్యక్రమాలే కాలక్షేపం. ఆయనకు పెద్దల నుంచి వచ్చిన పెద్ద అలవాటు నశ్యం పీల్చడం. ఆ అలవాటు వదులుకో లేక ముక్కు పొడుం అందుబాటులో లేక నానా యాతన పడుతున్నారు.


అటువంటి సమయంలో...  "ఏమిటోనోయ్, భీమశంకరం ! అసలైన మద్రాస్ అమ్మాళ్ నశ్యం పీల్చి సంవత్సరాలవుతోంది. సరైన నశ్యం దొరక్క నశాళం మొద్దుబారి పోయింది. మా నాన్న గారున్నప్పుడు యన్నెస్ నశ్యం పెద్ద డబ్బా తెస్తే చిన్న డొక్కుల్లో వేసుకుంటే రోజులు గడిచిపోయేవి. నశ్యం డిబ్బా మూత తీస్తే చాలు పొడుం ఘాటు ముక్కు పుటాల్లో దూరేది. ఇంక అరచేతిలో వేసుకుని వేళ్లతో ఒక పట్టు తీసి ముక్కు రంధ్రాల్లో పీలిస్తే 'అబ్బబ్బ' ఆ ఆనందమే వేరోయ్. పొడుం ఘాటు నసాళానికి చేరితే రెండు తుమ్ములొస్తే చాలు, పంచెతో తుడిచి చీదితే

ఆ మజాయే మజా.


 మా నాన్నగారూ ఎలిమెంటరీ స్కూల్ టీచరే. ఆయన దగ్గర ఇత్తడి పొన్నుకాయ, దానికి చిన్న బిరడా ఉండేది. స్కూలుకు పోయేముందు పొన్నుకాయ నిండా పొడుం నింపుకుని వెల్తే సాయంకాలానికి మళ్లా నింపవల్సి వచ్చేది. ఆయన ఎప్పుడూ పంచెలో మొలకి దోపుకునేవారు. పైన సైను బనీను ఉండేది. పాఠం చదివేటప్పుడు ఎవరైన విద్యార్థి తప్పు చెబితే దగ్గరకు పిలిచి ఇత్తడి పొన్నుకాయతో ఒక మొట్టికాయ నెత్తి మీద వేస్తే వాడి నశాళానికి ఘాటు చేరేది. వాడు ఐదు నిముషాల వరకు తల మీద చేత్తో రుద్దుకో వల్సిందే.


 ఆయన స్కూల్ నుంచి ఇంటి కొచ్చేసరికి వేసుకున్న బనీను, కట్టుకున్న తెల్లని పంచె పిట్టలు రెట్టలు వేసినట్టు ముక్కు చీమిడి కలిసిన పొడుం మరకలు ఉండేవి. వాటిని ఉతక లేక మా అమ్మ ఏం శాపనార్థాలు పెట్టేదో ఇప్పటికీ నా తలలో మెదులుతుంటాయి.


 మా తాతయ్య వార్షీకం మా నాన్న కొస్తే, మా నాన్న ఆ వరం నాకిచ్చారు. మా నాన్న మెడ్రాస్ యన్నెస్ నశ్యం పెద్ద డబ్బా తెచ్చి ఇంట్లో పెట్టి ఆయన ఇత్తడి పొడుం కాయలో నింపమని

నాకు అప్పచెప్పేవారు. నింపేటప్పుడు పొడుం ఘాటుకి తుమ్ములు వస్తూండేవి. మెల్లిగా కొంచం కొంచం పీలుస్తు నాకూ ఆనిషా నెత్తి కెక్కింది.


మా తాతయ్య పౌరోహితం చేసేవారు. పూజలు వ్రతాలు కార్యక్రమాలు చేసేటప్పుడు మధ్యలో బ్రేకిచ్చి పంచె నడుం నుంచి చిన్న పొడుం డిబ్బా మూత తీసి చేతిలో ఒక పట్టు వేసి పీలిస్తే కాని చురుకుతనం వచ్చేది కాదట.రెండు తుమ్ములు తుమ్మి వేగం అందుకునే వారట. మా తాతయ్య స్వయంగా లంక పుగాకు పెద్ద రెమ్మలు తెచ్చి వెదురు బద్దల మద్య కట్టి కుంపటి బొగ్గుల సెగ మీద కావల్సిన రంగు వచ్చే వరకు కాల్చి వెదురు బద్దల మద్య నుంచి పైకి తీసి ఆ వేడి మీదే ఆవు నెయ్యి గుల్లసున్నం పట్టించి కల్వంలో నూరి గుడ్డతో వస్త్రకాలితం పట్టి పొడుం తయారు చేసి చేతి డబ్బాలో నిలవ ఉంచుకుని వాడుకునే వారట. నిజంగా ఇంటి పొడుం ఘాటే వేరు శంకరం! "


 పూణేలో కొడుకు దగ్గర ఉంటున్న రిటైర్డ్ స్కూల్ మాస్టరు సుందరం గారు రాజమండ్రి నుంచి వచ్చిన బావమరిది భీమశంకరం వద్ద సుతి మెత్తగా సుత్తి కొట్టడం మొదలెట్టారు.


 "ఇదీ,అన్నయ్యా! ఈయన వరస. ఇంటికి ఎవరైన వస్తే చాలు నశ్యం నస మొదలెడతారు. ఇక్కడ మాకు దగర్లో ఒకరిద్దరు తెలుగు కుటుంబాల వారు ఉంటున్నారు. వీలున్నప్పుడు వారు కాలక్షేపానికే వస్తే, ఈయన ఇక్కడ అసలైన నశ్యం దొరుకుతుందా, ఇప్పటి తరం మనుషులు పొడుం అలవాటు లేక నశ్యానికి కరువొచ్చిందని, పుగాకు ఉత్పత్తులు ప్రభుత్వాలు నిషేదించడం మరీ ఇబ్బందిగా మారిందని, అలవాటు వదులుకోలేక కాఫీ పొడిలో గుల్లసున్నం పొడి కలిపి పీల్చ వలసి వస్తోందని, కనీసం సీనియర్ సిటిజన్స్ కైన గవర్నమెంట్ స్పెషల్ కోటా కింద నశ్యం సప్లై చేస్తే బాగుండేదని ఇంటికి వచ్చిన వారి దగ్గర నస పెడుతుంటే వాళ్లూ రావడం తగ్గించేసారు." అన్నయ్యకు గోడు వెళ్ల బోసుకుంది సుభద్రమ్మ.


 ఆఫీసు పని మీద పూణే వచ్చిన యల్.ఐ.సి. డెవల్పెంటు ఆఫీసర్ భీమశంకరం, బావగారి నశ్యం పాట్లు విని నవ్వడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాడు.


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

   కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


32 views0 comments

Comentarios


bottom of page