నా గుండె
- Yamini Rajasekhar
- 20 hours ago
- 3 min read
#YaminiRajasekhar, #NaGunde, #నాగుండె, #యామినిరాజశేఖర్, #TeluguStories, #తెలుగుకథలు

Na Gunde - New Telugu Story Written By Yamini Rajasekhar
Published In manatelugukathalu.com On 03/04/2025
నా గుండె - తెలుగు కథ
రచన: యామిని రాజశేఖర్
ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో..
దానిలోని నిజమైన భావోద్వేగం
దానిలోని గాఢత
అనుభవించే వారికే తెలుస్తుంది.
ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎప్పుడు ఏ రూపంలో మనసుని తాకుతుందో.. మధురమైన క్షణాలని ఆస్వాదించమని మాయాజాలం చేస్తుంది..
సముద్ర తీరం లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు.. చుట్టూ ఉన్న పరిసరాలు వారిని గమనించిన మేము తప్ప
ఎవరు లేమనే ఆలోచనతో.. మాటలకన్న మనసులోని
భావాలతోనే అర్ధం చేసుకుంటూ.. మనసారా ముచ్చటించుకోవాలని వున్న చిరునవ్వులే సమాధానంగా
ఓ వైపు తెలియని పరవశంతో..
మనకే ఇలానా.. ఈ అనుభవాన్ని పొందే అందిరికీ ఇలానేనా అని ఇరు కన్నుల్లో రూపాలు నిలుపుకొని.. ఎంతసేపైనా
ఇలానే ఉండిపోతే అనేలా.. ఆకాశమంత నిర్మలంగా
నీలివర్ణంలో, తీరాన్ని స్పృశిస్తూ వీచేటి పిల్లగాలులు..
కనులు మూసినా తెరిచినా కనులు పలికే భావాలు
తెలపాలనుకున్నా, తెలుసునా ననేలా.. మనోసంద్రంలో
ఉబికి వచ్చే లావాలా బయటకు తెలపలేక.. చెప్పలేక
మరో నిమిషం ఏమిటో ఈ గమ్మత్తు అనేలా కనుపాపలో నిలిచిన ఉండేది నా రూపం.
“నేను తప్ప ఇంకెవరు లేరు కదా” అని అలా లిఖిత, లోకేష్ నయనాల లోకి చూస్తూ ఉంటుంది..
“ఎన్నడూ లేనిది నేడు నీలో ఈ సందేహం ఎందుకు వచ్చింది.. నా అంతరంగం నీ ఊహాలతోనే నిండిపోయింది.”
“నీతోనే నాలోకమని నేనిలిచినా.. మనసు ఎందుకో పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది..”
“ఓహో అదా నీ సందేహం! కారణం నీ మనసు ఉన్నదే.. ఇప్పుడు ఎలా ఆలోచిస్తుందో మనసుని పక్కనే పెట్టు. మనసు కన్నా నీ ఆలోచనలలో నన్ను నిలుపుకో. నన్నే చూడు. ఉంటాను. నాలో నీవు తప్ప మరెవరూ లేరు. నేనంటే నీవే కదా. ఇక మరొకరు ఎలా నాలో ఉంటారు.. ఇదే నేటి ప్రేమ కాదు. మనది గత జన్మలోనే కలిశాము. కానీ ఈ జన్మలో మన ప్రేమ సంవత్సరమే దాటింది. అంటే ఒక్కసారి నీ అంతరంగాన్ని ప్రశ్నించుకో లిఖితా! నే తెలపాలనుకున్న నా ప్రేమ ఇదే” అంటాడు.. లోకేష్..
“అమావాస్య లోను నీవు వెన్నెలవే. పున్నమిలోనూ నవ మల్లిక లా నీవు తప్ప ఎవరంటారు.. నా మది నిండా మోయలేని నీ తలపులే.. ఈ ప్రకృతిలోని సొగసులన్ని నీవే.. నీ అందెల సవ్వడి కి.. మైమరచి పోయి.. నిను కలిసిన తొలిసారి పరిచయం.. ఇంకా ఏమైనా చెప్పమంటావా” అని లోకేష్ అడగగా..
“ఇంతకన్నా నేనేమి కోరుకోను.. నీ మెడలో నే హారమై
ఈ కడలిలో ఎగసే అలలే సాక్షిగా నిన్ను నేను నమ్ముతున్నాను.. ఇక ఎప్పటికీ సందేహమే కలుగదు..”
అని చిరుధార కన్నుల నుంచి కారగా
“మరలా ఏమైంది” అని
లోకేష్ అడగక.. “చూడు లిఖిత.. నిన్ను నన్ను కలిపింది ఆ దైవమే. మరి ఇంకెందుకు ఆ బాధ. నీ అధరాలపై ముత్యమంటి దరహాసమే నా ఆయువు..”
అలా లోకేష్ పలుకులకి.. “ఈ నిమిషం చెప్పలేనంత ఆనందం గా ఉంది.. ఎలా తెలిపేది..? నా కన్నులలోకి చూడు” అని చూపిస్తూ.. “నా గుండె వేగం చూడు” అంది.
“లిఖితా! నీది కాదు నా గుండె” అని లోకేష్ అనగా..
సిగ్గుల మొగ్గై వాలిపోయింది..
***
యామిని రాజశేఖర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు యామిని కోళ్ళూరు ....చదువు ఎం.ఏ ...ఎంఫిల్...
నా చదువు మొత్తం తెలుగు మాధ్యమంలో లోనే జరిగింది....
నా అక్షరమే నాలో నింపేను ఉత్సాహంనా అక్షరమే ఆయుధం నా రచనలకు స్ఫూర్తి దాయకం....
గత నాలుగు సంవత్సరాలుగానేను సాహితీ సమూహాల్లో కవితలు,,, వ్యాసాలు....,కథలు,,,రాయటం.... సమీక్షలు చేయటం....పలు సన్మానాలు,,,,ప్రశంసా పత్రాలు అందుకొన్నాను ..... కొన్ని సదస్సులో.... ఐదవ తెలుగు ప్రపంచ సదస్సులో ...అంతర్జాల సదస్సులో పాల్గొన్న,,, నిత్య విద్యార్థిని..... ఇంకా భాష గురించి నేర్వాల్సింది చాలా వుంది.......నేను ఇలా ఈ స్థానంలో వున్నానంటేనాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి,,,, గురువులు...రక్తసంబంధీకులు,,,మావారు,,,,, పిల్లలు.... సాన్నిహిత్యాలు వీరి వెన్నుదన్నే కారణం....
ఎందరో కవులు కవయిత్రులు నుంచి కూడాఎంతో తెలుసుకోవాలి....
ఇంకా బాగా రాయాలి......నా లక్ష్యం ఆశయం నేను చేరుకోవాలి....
ప్రస్తుతానికి ఇదే నా గురించి....ధన్యవాదాలుయామిని కోళ్ళూరు ✍️
Comments