#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #నాప్రేయసి, #NaPreyasi, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Na Preyasi - New Telugu Poem Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 22/02/2025
నా ప్రేయసి - తెలుగు కవిత
రచన: తాత మోహనకృష్ణ
ఓ కోయిలా..
ఏమిటే నీ గొప్పతనం..?
వసంతం వస్తేనే..
ప్రకృతి పై నీకు ప్రేమ పెరుగుతుంది
గొంతెత్తి అందంగా పాడాలనిపిస్తుంది నా ప్రేయసి
కానీ..
నా ప్రేయసి..
నీకంటే ఎంతో గొప్ప..
తనకి సంవత్సరమంతా వసంతమే
ఎప్పుడూ నా పై ప్రేమ కురుపిస్తుంది
పెదవిప్పి.. ఎల్లప్పుడూ సరదాగా మాట్లాడుతుంది
******
-తాత మోహనకృష్ణ
Comments