#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #Nadumkattu, #నడుంకట్టు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #తెలుగుజాతీయాలు
Nadumkattu - New Telugu Story Written By Patrayudu Kasi Viswanadham
Published In manatelugukathalu.com On 05/01/2025
నడుం కట్టు - తెలుగు కథ
రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
శివలింగపురం అనేది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామానికి రవాణా సౌకర్యం లేదు. ఆ గ్రామంలో పాఠశాల లేదు. చదువుకోవాలంటే చాలా దూరం నడచి వెళ్ళాలి. ఆ గ్రామంలో చదువుకునే వారి సంఖ్య తక్కువ. అదే గ్రామానికి చెందిన వివేక్ అనే యువకుడు ఉన్నత చదువులు పూర్తి చేసుకుని స్వగ్రామానికి వచ్చాడు. అన్నింటా వెనుకబడి ఉన్న తన గ్రామం రూపురేఖలు మార్చాలి అనుకున్నాడు. అందుకు తగిన ప్రణాళిక రచించాడు.
గ్రామస్తులు అందర్నీ ఒకచోటకు చేర్చి వారిని చైతన్యపరిచాడు. చదువు విలువ చెప్పాడు. పచ్చదనం, పరిశుభ్రత ఆవశ్యకతను తెలియచేశాడు. రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల పడే ఇబ్బందులను గుర్తుచేశాడు.
గ్రామస్తులు అందరూ చేయి చేయి కలిపారు. మొదటగా మట్టితో చక్కని రహదారిని నిర్మించారు. రహదారికి ఇరువైపులా, చెరువు గట్లమీద మొక్కలు నాటారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. గ్రామంలో బడి ఏర్పాటు చేస్తే గ్రామంలో ఉన్న పిల్లలందరిని ఆ బడి లోనే చేర్చుతామని గ్రామస్తులు చెప్పారు.
వివేక్ గ్రామ పెద్దలతో కలిసి పట్నం వెళ్లి అధికారులను కలిసాడు. తమ గ్రామస్తులు చేసిన కృషిని వివరించాడు. అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేసారు. స్వచ్ఛ గ్రామంగా ప్రకటించారు. సిమెంట్ రోడ్లను, పాఠశాలను మంజూరు చేశారు.
గ్రామాభివృద్ధికి కారకులైన గ్రామస్తులను, వారిని చైతన్య పరచిన వివేక్ ను అభినందించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ “మా గ్రామస్తులంతా నడుం కట్టబట్టి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది” అన్నాడు.
వివేక్ చెప్పిన మాట సోములుకి అర్థం కాలేదు. సమావేశం తర్వాత వివేక్ ని కలిసి ‘అల్లుడూ, అందరం నడుంకి తువ్వాలు ఎప్పుడూ కడుతూనే ఉన్నాం. మళ్ళీ నువ్వు మేమంతా నడుం కడితే రోడ్డు వచ్చింది అన్నావేంటి?” అడిగాడు.
“నడుం కట్టడం అంటే పూనుకోవడం. ఇది ఒక పలుకుబడి. మీరంతా తువ్వాలు భుజాన వేసుకోడమో, నడుంకి కట్టడమో చేస్తారు కదా, అలాగే ఏదైనా పనికి ఉపక్రమించే ముందు పనికి ఆటంకం కలగకుండా, నడుముకు బలం చేకూర్చడానికి భుజం మీద ఉన్న తువ్వాలును నడుం చుట్టూ కట్టుకుంటారు కదా, అదే నడుంకట్టడం అంటే. వైదిక కర్మలలో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది” అని వివరించాడు వివేక్.
“అదేనా... ఏదో అనుకున్నానులే. మీరు చదువుకున్నోళ్ళు మీకన్నీ తెలుస్తాయి.” అన్నాడు సోములు.
***
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷
Comments