top of page
Writer's pictureVeereswara Rao Moola

నకిలీ చిత్రం

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #NakiliChithram, #నకిలీచిత్రం, #TeluguKathalu, #తెలుగుకథలు, #TeluguCrimeStory


Nakili Chithram - New Telugu Story Written By - Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 26/11/2024

నకిలీ చిత్రం - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల


స్థలం : ముంబై ఆర్ట్ గ్యాలరీ


రవివర్మ అసలు చిత్రం వేలం పాడుతున్నారు. ఐదు లక్షల తో ప్రారంభమెన పాట 5 కోట్లకి చేరుకుంది. రవివర్మ చిత్రం పేరు "సత్యవతి". 5 కోట్లు ఇచ్చి ఆ చిత్రాన్ని దక్కించుకున్నాడు మధుసూధన్. గత పదేళ్లుగా వంశపారపర్యం గా వచ్చే ఆర్ట్ బిజినెస్ చేస్తున్నాడు.

హైదరాబాద్ లో ఆర్ట్ గ్యాలరీ ఉంది అతనికి.

 *******

స్థలం :హైదరాబాద్.


రాత్రి పన్నెండు గంటలకి మధుసూదన్ ఫోన్ మోగింది. 


"ఎవరు?" 


"నేను ఎవరో తరువాత తెలుస్తుంది" 


"నీకు ఏం కావాలి" 


"పాపం కష్టపడి రవివర్మ చిత్రాన్ని దక్కించుకున్నావు. కాని అది ఫేక్ పెయింటింగ్" 


"ఏమిటి?" 


 అవతల లైన్ కట్టయ్యింది. 


అర్ధరాత్రి గ్యాలరి కి వెళ్ళి చూసాడు. రవివర్మ సంతకం తేడా గా ఉంది. అద్దం తొలగించి చూస్తే ఒక చోట ఆయిల్ పెయింట్ కొద్ది రోజుల క్రితమే వేసినట్టుంది. 


మై గాడ్! 

మర్నాడు ముంబయి కి ఫోన్ చేసాడు. వాళ్ళు ఒరిజినల్ పంపామన్నారు.


ఒక్క సారి గా మధు కి బి. పి పెరిగింది. ఐదు కోట్లు నష్టం! 


 ********

"సార్ నేను హొటల్ స్మ్రతి నుండి ఓనర్ గోవర్థనం రెడ్డిని మాట్లాడుతున్నా. లాస్ట్ వీక్ మీ దగ్గర తీసుకున్నా ఎమ్. ఎఫ్. హుస్సేన్ "గుర్రాలు" పెయింటింగ్." 


"అవును సార్! ఇంకా ఏమైనా కావాలా?" మధుసూదన్.

 

"కాదు. హుస్సేన్ పెయింటింగ్ నకిలి అని తేలింది. వెనక్కి తీసుకుని ఎమౌంట్ రీఫండ్ చెయ్యండి". 


"అలాగే, పెయింటింగ్ పంపండి"


‘ఏం జరిగిందబ్బా.. పెయింటింగ్ లు ఫేక్ అవుతున్నాయి’.. ఆలోచనలో పడ్డాడు. 


మధుసూదన్ ఆర్ట్ గ్యాలరి మార్కెట్ ప్రతిష్ట దెబ్బతింది. అతని పోటిదారుడు నవీన్ గ్యాలరి కి ఆర్డర్స్ పెరిగాయి.

 

ఆ తరువాత కొరియర్ సంస్థల ద్వారా ఫేక్ పెయింటింగ్స్ అందాయి. మధుసూదన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. 


 *********

ప్రైవేట్ డిటెక్టివ్ ప్రకాష్, మధుసూదన్ ఎదురుగా ఉన్నాడు. జరిగినదంతా చెప్పాడు మధు. ఎలాగైనా ఫేక్ కనిపెట్టమన్నాడు. అంతా విని ప్రకాష్ ఒక ప్రశ్న అడిగాడు. 

"మీ గ్యాలరీ లో ఇంతకు ముందు ఎవరైనా పనిచేసి మానేశారా?" 


"రవి చేసేవాడు" 


"ఎందుకు మానేశాడు?" 


"ఒక సారి పెయింట్ ని అజాగ్రత తో కాన్వాస్ మీద ఒలకపోసాడు. కాస్ట్లీ కాన్వాస్ అది. వెంటనే ఉద్యోగం నుండి తీసి వెళ్ళి పొమ్మన్నా" 


"అతని ఫోన్ నెంబర్ ఉందా?" 


"లేదు. ఇక్కడ మానేశాక మార్చేసాడు"


" ఐ సీ "


" మీ నాన్న గారికి మీరు ఒక్కరే సంతానమా? " అడిగాడు ప్రకాష్ 

" అవును"


" సరే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను "


 ********

ప్రకాష్ రీతి కొరియర్ సంస్థ కి వెళ్ళాడు. అక్కడ తన గురించి పరిచయం చేసుకున్నాడు. 


"మధుసూధన్ గారి పెయింటింగ్ లు ఫేక్ అవుతున్నాయి. " అన్నాడు ప్రకాష్. 


"అలాంటింది ఉండదు సార్. మేము ఒరిజినల్ ప్యాకింగ్ ని డిస్ట్రబ్ చెయ్యము."


"మరి ఎందుకిలా జరుగుతోంది?" 


"సోర్స్ దగ్గరే ఏదో సమస్య ఉండచ్చు" 


" సరే ఈ సారి మధుసుధన్ ఆర్ట్ గ్యాలరీ కి కొరియర్ వస్తే నాకు ఫోన్ చెయ్యి"


"అలాగే సార్ "

 *******

"సార్ నేను రీతి కొరియర్ నుండి మాట్లాడుతున్నా"


"చెప్పు" అన్నాడు ప్రకాష్.


"ఇప్పుడే ఒక మధుసూధన్ ఆర్ట్ గ్యాలరీ కీ ఒక పెయింటింగ్ "out for delivery" లో ఉంది. "


"ఎటు వెళ్ళింది వ్యాన్?"


"గాంధి నగర్ వైపు"


రీతి కొరియర్ వ్యాన్ ఆర్ట్ గ్యాలరీ వైపు కాకుండా వేరే సందు లోకి పోయింది. ప్రకాష్ కి అనుమానం వచ్చింది. 


మాస్క్ ధరించిన వ్యక్తి సందులో పాత ఇంటి మొదటి అంతస్థు కి వెళ్ళాడు. ప్రకాష్ వెంబడించాడు. చిన్న చాకు తో ఒరిజినల్ పెయింటింగ్ తీసి కంప్యూటర్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. 


అరగంట లో డూప్లికేట్ తయారయ్యింది. దాన్ని తీసుకు వచ్చి అసలు ప్యాకింగ్ లో పెడుతుండగా 

"ఆగు" అన్నాడు ప్రకాష్ పిస్తోలు గురిపెట్టి. 


"ఎవరు దీని వెనుక ఉన్నారు చెప్పు" అన్నాడు.


అవతలి వ్యక్తి ఈ హఠాత్పరిణామానికి అదిరిపడి "ఎవరు.. ఏలా వచ్చావు?" 


అతను జవాబు చెప్పే లోగా అతని వీపు లోకి గుండు దిగి పోయింది.

బుల్లెట్ వచ్చిన దిశ గా ప్రకాష్ చూసాడు. అతను హెల్మేట్ ధరించాడు. వెంటనే దూకి హీరో హోండా పై పారిపోయాడు. అప్పుడు అతని టు వీలర్ నెంబర్ చూసాడు. అది AP7X3456. చనిపోయిన వ్యక్తి జేబు నుండి మోబైల్ తీసుకున్నాడు ప్రకాష్. 

గుండు దిగిన వ్యక్తి రవి! 


 **********

"ఏదైనా క్లూ దొరికిందా?" అడిగాడు మధుసూదన్ ప్రకాష్ ని. 


"డూప్లికేట్ లు హైదరాబాద్ లోనే తయారవుతున్నాయి. ప్యాకింగ్ ఒరిజినలే ఉంటుంది"


"అలాగ"


"ఎవరో తెలుసుకునే లోపులో అతను హత్య కి గురయ్యాడు."


"ఆ! "


"త్వరలోనే ఇందులో ఎవరు ఉన్నారో తెలుస్తుంది. "


 *******

రవి కాల్ రిజిస్టర్ వెరిఫై చేసాడు ప్రకాష్. ఒక నెంబర్ కి ఎక్కువ సార్లు వెళ్ళింది. అతను నవీన్ ఆర్ట్ గ్యాలరి కి సంబంధించిన వ్యక్తా? 


ఫోన్ ట్రేస్ చేస్తే దిల్ సుఖ్ నగర్ దగ్గర సిగ్నల్ చూపిస్తోంది. ఆ వ్యక్తికి మళ్ళీ ప్రయత్నిస్తే బాసర చూపిస్తోంది. ప్రకాష్ బాసర కి బయలుదేరాడు. 


 *******

బాసర లో గోదావరి తీరాన ముప్ఫై ఏళ్ళ వ్యక్తి తన తల్లి కి పిండం వదులుతున్నాడు. మంత్రాలు చదివేటప్పుడు మధ్యలో తన తండ్రి పేరు చెప్పాడు. ఆ పేరు విని ఆశ్చర్య పోయాడు. ఆపేరు మధుసూదన్ తండ్రి పేరు రంగనాధ్! రంగనాధ్ ఈ వ్యక్తి కి, మధుసూధన్ కి తండ్రా? 


ప్రకాష్ అతన్ని పరిచయం చేసుకున్నాడు. అతని పేరు మహీధర్! 


"నువ్వు నీ డూప్లికేట్ పెయింటింగ్ ల వ్యవహారం అంతా తెలుసు. పోలీస్ కేస్ ఉంది. నేను చెప్పిన మాట వింటే నీకు న్యాయం జరుగుతుంది." 


"న్యాయం" అని నవ్వి “చిన్నప్పుడే నా తల్లి కి అన్యాయం జరిగింది” అని కళ్ళు ఒత్తుకున్నాడు మహీధర్. 


 *******

మధుసూదన్, మహీధర్, ప్రకాష్ హాల్లో ఉన్నారు. 


"చెప్పు ప్రకాష్, కేస్ సాల్వ్ ఐందా? "


"చాలావరకు "


అప్పుడు మహిధర్ చెప్పడం ప్రారంభించాడు. 


"రంగనాధ్ కాకినాడ లో రంగారావు అనే ఆర్టిస్ట్ దగ్గర డ్రాయింగ్ నేర్చుకునే వాడు. అప్పుడే రంగారావు కూతురు కమల ని ప్రేమించాడు. రంగనాధ్ వల్ల కమల గర్భవతి అయినది. తరువాత రంగనాధ్ ముంబాయి వెళ్ళాడని తెలిసింది. చాలా సంవత్సరాలు ఆంధ్రా రాలేదు. అన్ని అవమానాలు భరిస్తూ కమల మహీధర్ ని పెంచింది. నా తల్లి ని కష్టాల్లో కి నెట్టిన రంగనాధ్ ని విడిచి పెట్టకూడ దనిపించింది. అందుకే బిజినెస్ దెబ్బ తీసాను. "


మధుసూదన్ ఆశ్చర్యపోయాడు. 


"నాకో అన్నయ్య ఉన్నాడని తెలిసి ఆశ్చపోతున్నా"


"అలాగే ఆశ్చర్య పోతూ చనిపో " అంటూ పిస్తోలు తో పేల్చాడు. 


బుల్లెట్ మధుసూదన్ కుడిచేతి నుండి దూసుకు పోయింది. 


"ఎందుకు తొందర పడ్డావు? నీ వాటా తీసుకో" అని మధసూదన్ సోఫా లో కూలిపోయాడు. 


ప్రకాష్ ఎలర్టయ్యాడు. వెంటనే మహీధర్ ని వెనకనుండి కొట్టి పోలీసులకు అప్ఫగించాడు. 


 ********

రెండెళ్ళ తర్వాత జైలు నుండి విడుదలై మహీధర్ మధుసూదన్ ఆర్ట్ గ్యాలరీ లో పని చెయ్యడం 

ప్రారంభించాడు. 


"నువ్వూ ఓనర్ వే" 


"కాదు తమ్ముడూ నాకు జీతం చాలు. ఇది నువ్వు నిర్మించిన సామ్రాజ్యం" అన్నాడు మహీధర్ 


ప్రకాష్ మహీధర్ కి ఫోన్ చేసాడు రవి బ్రతికే ఉన్నాడని. 


మహీధర్ హాయి గా ఊపిరి పీల్చుకున్నాడు. 


 సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






46 views0 comments

Comments


bottom of page