top of page
Writer's pictureRamya Namuduri

నల్లమల నిధి రహస్యం పార్ట్ -1

'Nallamala Nidhi Rahasyam Part - 1' written by Ramya Namuduri

రచన : రమ్య నముడూరి

1980 వ సంవత్సరం.. బలభద్రపురం... కైలాస భూమి...

రాత్రి ఒంటిగంట ఇరవై నిముషాలు... కటిక అమావాస్య... వీధి దీపాలు వెలుగుతూ.. ఉన్నాయి..! గాలి వేగం పెరిగిపోతోంది...! జీవం లేకుండా పడిఉన్న ఎండుటాకులు... ఆ గాలి వేగానికి పైకి లేచి... ఆ గాలిలో గిర గిరా తిరుగుతున్నాయి..! దూరంగా ఎక్కడో... నక్కల ఆరుపులు వినిపిస్తున్నాయి..! ఆ గాలి వేగానికి, చెట్లు, జడలు విప్పుకున్న పిశాచిలాగా.. ఊగిపోతున్నాయి... ఆరోజే చనిపోయిన ఒక అనాధ శవం దహనం చేసిన ప్రదేశం నుండి వస్తోన్న పొగ... ఒక వింత ఆకారం గా మారి.. గాలి వేగానికి అనుగుణంగా కదులుతూ... వింత శబ్దం చేస్తోంది..! ఆ శబ్దం ఏమిటా అని బయటకు వచ్చి చూసిన, కాటికాపరి గుండె జారిపోయింది..! అంతలోనే తేరుకొని... " ఏమీ కాదు...ఏమీ కాదు..!" అనుకుంటూ తనకి తానే ధైర్యం చెప్పుకుని.. అక్కడనుండి కొద్దిగా దూరం జరిగి.. చుట్ట కాల్చడం మొదలు పెట్టాడు..! ఇంతలో.. అతని వెనకనుండి ఒక ఆకారం వేగంగా వెళ్ళిపోయింది..! ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగిచూస్తే... అక్కడ ఏమీ లేదు..! సరే అని రెండు అడుగులు ముందుకు వేసాడో.. లేదో... మళ్ళీ అదే అనుభవం..! ఈసారి ఏదో వింత భాషలో మాట్లాడుతూ... వెనకనుండి...తనకు దగ్గరగా వచ్చినట్టే వచ్చి, వెనక్కి తిరిగేసరికి కనిపించకుండా మాయం అయిపోయింది ..! అదంతా చూస్తోన్న కాటికాపరికి గుండె వేగం పెరిగిపోతోంది..! కానీ పైకి ధైర్యం నటిస్తూ..! " వామ్మో..! ఎవరో నా ఎనకమాట్లే.. తిరుగుతున్నట్టుండాది..! ఏందిది... అ.. ఎవురది..? దమ్ముంటే ముందుకురా..! ఇలా ఎనకమాట్లే తిరుగుతా... భయపెట్టాలని సూడమాకా..! నాకసలే మా చెడ్డ కోపం..! ఈ రంగడంటే.. ఏతనుకున్నావో.. ఏమో..!" అంటూ మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ... చుట్టూ చూస్తూ ఉండగా..! ఒక వింత ఆకరం..! అతని వెనకనే నిలబడి.... " అసైయే ఇసునకీర్ కిర కిర మరియ కిలిగిచు గోరి... గోరి... గోరి.. " అంటూ... ఏదో వింత భాష మాట్లాడుతూ.. వికృతంగా నవ్వుతోంది..! ఆ మాటలు, నవ్వులు వినిపించే సరికి రంగా.. భయం భయంగా.. వెనక్కి తిరిగి చూస్తూ.. ఉండగానే...! ఆ ఆకారం ఇంకా వికృతంగా నవ్వుతూ... కాటికాపరి రంగా మెడను విరిచేసింది..! *****

నల్లమల అడవి... అదేరోజు.... రాత్రి రెండుగంటల, పదకొండు నిముషాలు... నీలగిరి కొండగుహల లోపల... " తవ్వండ్రా .. తొందరగా తవ్వండి ... సాములోరు చెప్పిండు.. అంజనం వేసి మరీ చెప్పిండు... ఈడనే.. గా మారాజు బోలెడంత బంగారం, వజ్రాలు దాచుంచినాడంట..! ఇయాల అయి మనము ఎట్టాగైన... సంపాదించాలి..! బేగా తవ్వు రా...!" పనివాడి మీద అరుస్తున్నాడు బసవయ్య...!

"అయ్యగారు..! ఈడ ఏమీ లేదు...! సానా లోతు తవ్వేసాం..! " అన్నారు ఆ పనివాళ్ళు "ఏందిరా..! తవ్వింది..! ఇంకా తవ్వండి, ఆ సామూలోరు సామాన్యుడు కాడు..! అయన సెప్పిండు అంటే..! ఈడ కచ్చితంగా... ఆ రాజు దాచిన నిధి ఉండే ఉంటాది...! చెప్పింది చేయండి..! ఇంకా లోతుకి తవ్వండి..!" అంటూ గర్జించాడు బసవయ్య..!

వాళ్ళు మళ్ళీ తవ్వడం మొదలు పెట్టారు...! అలా ఇంకో అరగంట సేపు తవ్విన తరువాత... టంగ్ మని శబ్దం వచ్చింది..! అంతే..! బసవయ్య ఎగిరి గంతేసాడు..!

"దొరికింది....! కాకతీయ సామ్రాజ్యపు ఆఖరి మహారాజు ప్రతాపరుద్రుడు ...బలభద్రపురం సామంత కోయరాజు మార్తాండ చేత దాచి పెట్టించిన సంపద దొరికింది...! నేను చేసిన పూజలు, ఇచ్చిన బలులు... ఫలించినాయి...!" అంటూ... సంతోషపడిపోతున్నాడు..!

ఆ పనివాళ్ళు...అక్కడ పూర్తిగా మట్టిని వేరు చేసి చూస్తే..! అక్కడ ఒక పెట్టి కనిపించింది..! "దాన్ని పైకి తీయండ్రా..! " అంటూ సంతోషంతో అరిచాడు బసవయ్య..! వాళ్ళు ఆ పెట్టెను పైకి తీసే ప్రయత్నం చేస్తున్నారు...! ఇంతలో... అక్కడ వాతావరణం అంతా మారిపోయింది...! గాలి వేగం పెరిగిపోయింది... చెట్లు పూనకమ్ వచ్చినట్టు ఊగిపోతున్నాయి..! వాతావరణంలో వచ్చిన మార్పుకి బసవయ్యతో సహా... అక్కడ పని వారికి కూడా భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి..!

"ఒరేయ్..! తొందరగా తీయండ్రా..! వర్షం వచ్చేసేటట్టు ఉంది..! " అంటూ వారిని తొందరపెట్టాడు బసవయ్య..! వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా... ఆ పెట్టెను పైకి తీయలేకపోతున్నారు..! ఆ పనివాళ్ళు అప్రయత్నం గా పైకి చూసేసరికి... ఒక వికృతమైన ఆకారం... బసవయ్య వెనకనే నించుని ఉంది..!

వాళ్ళు.. " అయగోరు...! మీ ఎనకాతలా....!" అంటూ చెప్పబోయి...! గుండె ఆగిపోయి.. అక్కడే పడి చచ్చిపోయారు..! అది పైనుండి చూసిన బసవయ్య...! భయం.. భయం గా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏమీ లేదు..! రెండు అడుగులు ముందుకు వేసాడో లేదో...! " ఊహఫీ.. ఊహఫీ... కిర.. కిర... కిర... మరియా... ఉగిచా.. గోరి... గోరి... గోరి... " అంటూ ఏదో వింత భాషలో.. వికృతమైన గొంతుతో... ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది... వెనక్కి తిరిగి చూసేసరికి... అక్కడ ఉన్న వికృతమైన ఆకారాన్ని చూసేసరికి... బసవయ్య కొయ్యబారిపోయాడు..! ఆ ఆకారం ఒక్కసారిగా బసవయ్య మీదకి దూకి... బసవయ్య గుండెను పెకలించేసి.. "ఉఫియే... గోరి.. కిరాచియా... ..థు...బసవయ్యా..! అమ్మా... ఇష్టకామేశ్వరి... మరియా... ఆన...! ఈ.. మరియా... ఆన... అమ్మా...!" అంటూ.. కోయ భాషలో ఏవో అంటూ... ఆ నల్లమలలో కొలువై ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడివైపు వెళ్లిపోతు... ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది..! ఆ బసవయ్య మనుషులు తవ్విన గుంత లోనే ఆ బసవయ్య శరీరం ఎగిరి వెళ్లి పడింది..! ఆ గుంత మొత్తం మట్టితో పూడుకు పోయింది...! ఆ ఆకారం ఇప్పుడు ఒక అందమైన పదహారెళ్ల అమ్మాయి ఆకృతి దాల్చింది...! ఆ అమావాస్య చీకటిలో... చందమామలా వెలిగిపోతున్న ఆ అమ్మాయి ఆత్మ.. అక్కడనుండి దూరంగా వెళ్ళిపోతోంది..!

*** సశేషం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


నా పేరు రమ్య

నేనొక గృహిణిని

మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు

114 views0 comments

Comments


bottom of page