top of page
Writer's pictureBulusu Ravi Sarma

నాలో - నువ్వు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #NaloNuvvu, #నాలోనువ్వు


Nalo Nuvvu - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma

Published In manatelugukathalu.com On 15/01/2025

నాలో నువ్వుతెలుగు కవిత

రచన: బులుసు రవి శర్మ


నాకు తెలియకుండా

నాతోనే ఉంటావు

కొన్ని గంటల వ్యవధిలో

నేనున్నాను అని తైతక్కలాడతావు


కాస్త తృప్తి పరిస్తే 

నిశ్శబ్దంగా నిద్రలోకి జారుకుంటావు

నువ్వు తలిస్తే మనిషిని 

మృగం చేస్తావు

మృగాల్ని  కూడా

మనుషులకు ఎరవేస్తావు


ఎందరినో మాటి మాటికి 

దరి చేరి హింస పెడతావు

మరి కొందరికి దూరమై

అల్లరి చేస్తావు


నువ్వు 

నాలో ఉన్న ఆకలివి!

నేను

నీకు చిక్కిన మనిషిని!!


-రవి శర్మ



40 views1 comment

1 Comment


రవి శర్మ గారి కవిత "నాలో నువ్వు"

.. ఆకలి నిజం గురించి, బీదల పాట్లు గురించి తెలియ పరిచింది.

పి. వి. పద్మావతి మధు నివ్రితి

Like
bottom of page