#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #నమస్తే నవ్వండీ!, #Namasthe Navvandi, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 39
Namasthe Navvandi - Somanna Gari Kavithalu Part 39 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 19/03/2025
నమస్తే నవ్వండీ! - సోమన్న గారి కవితలు పార్ట్ 39 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
నమస్తే నవ్వండీ!
----------------------------------------
చిన్నారుల నవ్వులు
విరబూసిన పువ్వులు
వదన సదనములోన
వెలుగులీను దివ్వెలు
మధుమాసము మాదిరి
దరహాసము సొగసులు
తెలుసుకొనుము చదువరి
వెలుగుతాయి మొగములు
నవ్వులే ఔషధము
చూస్తే ఉషోదయము
పెంచును ఆరోగ్యము
పంచును ఆనందము
నవ్వులేని మోములు
దట్టమైన మబ్బులు
హాయిగా నవ్వరా!
ఖర్చు అసలు లేదురా!

సారు గారి సూచనలు
----------------------------------------
వెదజల్లును నవ్వులు
చిన్నారుల పెదవులు
విరజిమ్మును తావులు
వనంలోని పువ్వులు
దిద్దుతారు గృహములు
సదనంలో వనితలు
వెలిగిస్తారు బ్రతుకులు
జ్ఞానంతో గురువులు
నడిపిస్తారు మిత్రులు
సరైన మార్గంలో
ఉంటారు అండగా
ఆపద సమయంలో
కన్నవారి సేవలు
మరువలేం జన్మలోను
వారు చూపు మమతలు
ఉండవు ఎవరిలోను

బాస్ హితోక్తులు
----------------------------------------
నెమ్మది లేకుండా
ఎంత ఉన్నా సున్న
బ్రతుకున మనశ్శాంతి
స్వర్గము కన్నా మిన్న
పెట్టుకోకు కలహము
వదలుకోకు స్నేహము
ఎట్టి పరిస్థితుల్లో
కోల్పోకు శాంతము
రేపొద్దు వివాదము
చూడొద్దు చోద్యము
కల్గియుంటే మేలు
ఘనము మైత్రి బంధము
వినయము మనోహరము
గర్వము హానికరము
ఏది మేలో ఎరుగుము
జ్ఞానంతో నడువుము

పరిమళించే పువ్వులు
----------------------------------------
పువ్వులండి పువ్వులు
పలు రకాల పువ్వులు
అందరిని అలరించు
అందమైన పువ్వులు
ముద్దుగా జడలోన
ప్రేమగా మెడలోన
కొలువుదీరు పువ్వులు
భక్తిగా గుడిలోన
త్యాగానికి గురుతులు
మురిపించును మనసులు
తాకినా నలిపినా
విరజిమ్మును తావులు
శ్రేష్టమైన సేవలు
చేయునోయి పువ్వులు
స్త్రీలకు ప్రాణంతో
సమానమే పువ్వులు
సుతిమెత్తని పువ్వులు
మదిని దోచు పువ్వులు
వికసిస్తే మాత్రము
పసి పిల్లల నవ్వులు
పరిమళించు పువ్వులు
పవిత్రమైన పువ్వులు
అన్నీ కార్యాల్లో
ముందుండే పువ్వులు

చిలుక పలుకులు
----------------------------------------
చెట్టుపై చిలుకమ్మ
ముద్దుగా వాలింది
ఎంచక్కా పాపతో
మాట్లాడ సాగింది
పెద్దవారి మాటలు
శ్రద్ధగా వినమంది
కన్నోళ్ల త్యాగాన్ని
గుర్తించుకోమంది
గుడ్డిగా ఎవరినీ
ఇల నమ్మొద్దు అంది
మాటలతో బురిడీ
కొట్టిస్తారంది
కష్టించే తత్వము
కల్గియుండాలంది
లేకుంటే నష్టము
జీవితాల్లో అంది
ప్రేమతో అందరిని
ఆకట్టుకోమంది
స్నేహితులకు ద్రోహము
ఎప్పుడూ వద్దంది
చిలుకమ్మ పలుకులకు
పాప తల ఊపింది
ఉప్పొంగే మదితో
సందడే చేసింది
-గద్వాల సోమన్న
댓글