top of page
Writer's picturePitta Govinda Rao

నమస్తే సొసైటీ


'Namasthe Society' - New Telugu Story Written By Pitta Gopi

'నమస్తే సొసైటీ' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ఒక IAS అయి ఉండి ఏ ప్రాంతం గ్రామ సందర్శనకు వెళ్ళినా ప్రజలతో కలిసిపోయే వ్యక్తి. పనితనంలోనూ నీతి నిజాయితీ, ధైర్యం కలిగిన ఆంటోనీ గొప్ప వ్యక్తి గా పేరుగాంచాడు.


ఒక నాడు కొందరు గ్రామస్తులు తో కలిసి చల్దన్నం తింటుండగా, 'ఇంత సాదాసీదా వ్యక్తి ని చూడలే'దని ఒక ముసలాయన ఆంటోనీ జీవితం గూర్చి ఆరా తీశాడు.


అప్పుడు ఇలా చెప్పాడు ఆంటోనీ..


ఆంటోనీ తల్లిదండ్రులు తమ గ్రామంలో అందరి కంటే పేదవాళ్ళు.


కానీ ఆంటోనీ మాత్రం తమ ఏరియాలో అందరికీ కంటే చదువు లో దిట్ట.


ఈ విషయం చదువురాని తల్లిదండ్రులు కు కూడా తెలుసు.


అందుకే ఎంత కష్టమైనా ఆంటోనీ ని చదివిస్తూ పెద్ద చేశారు.


వయసు కు వచ్చిన ఆంటోనీ ఒకనాడు తన మనసులో మాటను తల్లిదండ్రులకు చెప్పాడు

"అమ్మా! నాన్నా..! నాకు IAS చదవాలని ఉంది" అని అన్నాడు.


" ఆ IAS అంటే మాకేటి తెలియదు కొడుకా.. నువ్వు ఏది చేయాలంటే అది చెయ్యి. మేము నీకు డబ్బులు సముకూరుస్తాం "అన్నాడు తండ్రి.


"నేను పట్టణం పోయి IAS కోసం శిక్షణ తీసుకుంటాను నాన్నా.. ఒకటి, రెండు నెలల్లో ఫీజు పంపండి" అని చెప్పి పట్టణం పోయాడు ఆంటోనీ.


నెల అయ్యిందో లేదో అమ్మా నాన్న కూలికి వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురవటంతో ఆంటోనీ తల్లిదండ్రులు మరణించారని తెలుసుని ఇంటికి వచ్చాడు.


ప్రమాదం వలన మరణించిన ఆంటోని తల్లిదండ్రులను పరామర్శించటానికి నాయకులు, అధికారులు, ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఆంటోని ని ప్రభుత్వం ఆదుకుంటుందని మీడియా ముందు ఏవో కూతలు కూసి పబ్లిసిటీ కోసం వచ్చి వెళ్ళారు.


తల్లిదండ్రులు సంపాదించిన డబ్బులతో దుఃఖాన్ని దిగమింగి కర్మకాండలు చేశాడు.


శిక్షణ నిర్వాహకులు లక్షల్లో ఫిజు అడుగుతున్నారు.


ఇంకా శిక్షణ నాలుగు నెలలు ఉంది. చేతిలో చిల్లు గవ్వలేదు.


ఇల్లు అయినా అమ్ముదామంటే పూరిగుడిసే.. ఎవరూ కొనటానికి ముందు కు రారు.


అదికారుల దగ్గరకు వెళ్ళి గోడు వెళ్ళదీసుకున్నాడు. ఈరోజు అంటూ, రేపంటూ తిప్పిస్తూ కాలం గడిపారు.


నాయకుల చుట్టూ తిరిగాడు.

"నీ చదువు బాధ్యత మాది" అన్నారు.

వారి పై నమ్మకం లేక కలెక్టర్ ను కలిశాడు.

"తప్పకుండా సహయసహకారాలు అందిస్తా"మన్నాడు.


వారి మాటలు గాలి మాటలేనని కాలం ముందుకు వెళ్ళాకా ఆంటోని కి అర్థం అయింది.


"అప్పు ఇస్తే IAS అవుతానని, ఎప్పటికైనా తమ డబ్బులు వడ్డీ తో సహా చెల్లిస్తానని" గ్రామస్తులను అడిగాడు.


"వీడేం IAS అవుతాడు.. తల్లిదండ్రులు, ఆస్తులు లేని వీడికి అప్పు ఇస్తే ఎక్కడికో పారిపోతాడని ఇవ్వమంటే ఇవ్వము" అన్నారు.


తన సొంత ఆలోచన తో ఉన్న పూరిగుడిసెను కుల్చి వేసి ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టి, వచ్చిన డబ్బులో నెల ఫీజు చెల్లించాడు, మంచి పుస్తకాలు కొన్నాడు.


గ్రామంలోనే ఉంటూ చెట్టు పుట్టల వద్ద, నీరు పారని బ్రిడ్జి ల కిందన తలదాచుకుని, చదివి IAS కి ప్రిపేర్ అయ్యాడు.


పుస్తకాలు కొనగా మిగిలిన డబ్బు తో పరిక్ష కేంద్రానికి పోయి పరిక్ష రాసి గ్రామం చేరుకున్నాడు.


వందశాతం నమ్మకం తో ఫలితాలు కోసం ఎదురు చూస్తు.. పక్క గ్రామాలు పోయి ఫలితాలు వచ్చే వరకు పని చేస్తు డబ్బులు సంపాదించాడు.


అది చూసిన గ్రామస్తులు IAS అవుతానని బీంకరాలు పలికి పని చేస్తున్నాడని ఎగతాళి చేశారు.


అన్నీ భరించాడు.


ఫలితాలు వచ్చాయి.


ఆంటోని IAS టాప్ ర్యాంక్ సాధించాడు.

ఆంటోనీ కి ఆనందం తప్ప ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే తనకు IAS టాప్ ర్యాంకే లక్ష్యం గా చదివాడు.


ఇక ఆంటోనీ గ్రామానికి కారులు వరుస కట్టడం మెదలయ్యాయి


ఆంటోనీ గ్రామంలో అధికారులు వచ్చి ఆంటోనీ ఫొటోలు మరియు అధికారులు, నాయకుల ఫొటోల తో కూడిన బ్లానర్ లు పెట్టడం.. ఆంటోనీ కి సన్మాన కార్యక్రమం పెట్టాలని ఫిక్స్ అయ్యాయి.


ఈ కార్యక్రమానికి లక్షల ఖర్చు పెట్టారు.


ఓ నాయకుడు సభలో మాట్లాడుతూ..

"ప్రభుత్వం మారుమూల విద్యార్థుల టాలెంట్ ను వెలికి తీస్తుం”దని అనటంతో ఆంటోనీ ఆ నాయకుడి వద్ద మైకు లాక్కుని..


"ఇలాంటి అబద్ధాలు చెప్పుకుని బతికే వాళ్ళకి ఓట్లు వేసి గెలిపిస్తే పేదలందరు, ఎన్నటికీ కూడా పేదలుగానే మిగిలిపోతారు. స్వయం కృషితో మీ బలాన్ని మీరు నమ్ముకోండి.


"తల్లిదండ్రులు చనిపోయి ఒంటరిగా ఉన్న నన్ను ఏ ప్రభుత్వం, ఏ నాయకులు, ఏ అధికారులు చేరదీయలేదు.


"ఇంటి స్థలం అమ్ముకుని చెట్టపుట్టలో చదువుకుని IAS సాదించాను.


"నా విజయం నాది ఇంకెవరికి దక్కదు.


"IAS చదవాలని ఉందని తల్లిదండ్రులు ఆస్తులు లేవని ఆదుకోవాలని ఎంత తిరగినా పట్టించుకోని వాళ్ళు సాధించాక దండలు వేయటానికి వచ్చి తమ వల్లే సాధించానని చెప్పుకోటం కోసం లక్షలు పోసి ఈ సభ పెట్టడం సిగ్గుగా లేదా..


"అవతల నాలాంటి కలలు కని పేదరికం అడ్డుగా మారి సాకారం చేసుకోలేని ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళని ఆదుకోండి. ఇలాంటి పిచ్చి వేషాలు వేసి పబ్లిసిటీ కోసం ఖర్చులు పెట్టేకంటే పదిమంది కి సేవ చేసి మీ పనితనం నిరూపించుకోండి.


గ్రామస్తులుతో సహా అందరూ నేను సాదించాక వచ్చారే తప్ప నేను ఆకలితో, నిద్ర లేని రాత్రులు గడిపినపుడు గంజి కూడా పెట్టలేకపోయారని ఇప్పుడు మాత్రం అభినందించటానికి వచ్చి ఏం లాభమని ఈ సమాజం ఇంతే మీకో నమష్కారం, ఈ సొసైటీ కో నమష్కారం" అన్నాడు.


"మనిషి లో నమ్మకం ముఖ్యం.

ఆ నమ్మకానికి కష్టపడే తత్వం తోడైతే సహాయం చేస్తామని చెప్పి, చేయని ఇలాంటి చెంచాగాళ్ళతో మనకు పనే ఉండదు" అనటంతో అక్కడ సభలో అధికారులు, నాయకులు, ప్రజలు తలవంచుకుని నిశ్శబ్దం గా తప్పు ఒప్పుకుని ఆలోచనలో పడ్డారు.


ప్రభుత్వం తరపున దేన్ని ఆశించకుండా సభ నుంచి వెళ్ళిపోయాడు ఆంటోనీ.


అలా తన గతాన్ని చెప్పటంతో ముసలాయన తో పాటు గ్రామస్తులు కన్నీరు పెట్టుకుని

" నీలాంటోళ్ళే దేశంలో అందరూ అధికారులు ఉంటే ఇంకా మాకు ఈ కష్టాలు ఉండేవే కాదయ్యా..


ఏం చేస్తాం. దేవుడు నీ ఒక్కడినే సృష్టించాడు. అంతా మన ఖర్మ బాబు.. మన ఖర్మ! నువ్వు వందేళ్లు చల్లగా ఉండయ్య.. చల్లగా ఉండు" అంటూ దీవిస్తూ కంటతడి తుడుచుని వెళ్ళిపోయాడు ముసలాయన.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


26 views1 comment

1 Comment


@vankalaappanna9205 • 3 hours ago

సూపర్ గోపి

Like
bottom of page