top of page
Writer's picturePratap Ch

నమ్మకద్రోహం



'Nammaka Droham' - New Telugu Story Written By Ch. Pratap  

Published In manatelugukathalu.com On 25/03/2024

'నమ్మకద్రోహం' తెలుగు కథ

రచన: Ch. ప్రతాప్


ఒక రోజున అరణ్యం లో ఒక వేటగాడు పక్షులను వేటాడుతుందగా ఆకలితో వున్న ఒక పులి అతని పైకి ఉరికింది. ప్రాణభయంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఒక చెట్టును ఎక్కేసాడు. ఫులికి విపరీతమైన కోపం వచ్చింది. దానికి చెట్టెక్కడం రాదు (దీని మేన మామ అయిన పిల్లి ఈ ఒక్కటి తప్ప అన్ని విద్యలను పులికి నేర్పించింది). మరొకపక్క దానిని ఆకలి తీవ్రంగా బాధిస్తోంది. ఎప్పటికైనా ఆ వేటగాడు కిందకు రాకపోతాడా అప్పుడు వెంటనే చంపి తినెద్దామని చెట్టు కిందనే కాచుక్కూర్చుంది. వేటగాడు కూర్చున్న చెట్టు కొమ్మకు పై కొమ్మ మీద ఒక ఎలుగు బంటి కూర్చొని వుంది. పాపం ఆ ఎలుగుబంటి చాలా మంచిది. రక్షణ కోరి తన ఇంటికి వచ్చిన ఆ వేటగాడిని రక్షించాలనే నిర్ణయించుకుంది. 

 

అప్పుడు పులి ఆ ఎలుగుతో “ ఓ మిత్రమా! చూస్తుంటే చాలా ఆకలితో వున్నట్లున్నావు. నాకు కుడా ఆకలి దంచేస్తోంది. ఆందుకని ఆ మనిషిని కిందకు తోసెయ్యి. వాడిని చంపి ఇద్దరం పంచుకు తిందాం” అని అడిగింది. 

 

ఆందుకు ఎలుగు బంటి” ఓ నేస్తమా. నాకు కూడా బాగా ఆకలి వేస్తున్న మాట నిజమే. అయితే అతిధి దేవో భవ అన్నట్లు ఇంటికి వచ్చిన అతిధిని రక్షించడం నా ధర్మం. ఆందుకని నీ కోరికను నేను మన్నించలేను” అని ఖచితంగా చెప్పేసింది. 

 

అయినా పులిలో ఆశ చావలేదు. 

 

కొంతసేపటికి ఎలుగు బంటి నిద్రపోయింది. అప్పుడు పులికి మరొక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ వేటగాడితో “ మిత్రమా, నాకు బాగా ఆకలిగా వుంది. నాకు నిన్ను తిన్నా, ఆ ఎలుగును తిన్నా ఒకటే. నా ఆకలి తీరిపోతే నేను తిరిగి వెళిపోతాను, నీకు ఏ విధమైన హాని తలపెట్టను, అందుకని ఏ మాత్రం ఆలశ్యం చెయ్యక ఆ ఎలుగును కిందకు తోసెయ్యి” అని అతనికి నచ్చచెప్పింది. 

 

ఆ మాటలతో వేటగాడిలో ఒక కొత్త ఆశ మొలకెత్తింది. ఫులి మాటలు చాలా సమంజసంగా తోచాయి. ఫులి బారి నుండి తప్పించుకోవడానికి ఇదే చక్కని మార్గమని తలచి వెంటనే తనకు ఆశ్రయమిచ్చి రక్షించిన ఎలుగు బంటిని బలంగా కిందకు తోసేసాడు. 

 

అయితే అదృష్టవశాత్తు కిందకు పడబోయిన ఎలుగుబంటికి చప్పున తెలివి వచ్చి రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే దొరికిన చెట్టు కొమ్మను అంది పుచ్చుకొని కిందకు పడకుండా కాపాడుకుంది. 

 

వెంటనే పులి ఎలుగుబంటితో” ఓ మిత్రమా! చూసావా, మనుషులెంత దురాశాపరులో? నువ్వు అతనిని ఆశ్రయం కల్పించి రక్షించావు, కాని అతడు నిన్నే చంపజూసాడు. అతడిని ఇక ఉపేక్షించకు, వెంటనే నాకు ఆహారంగా సమర్పించు. ఒక్కరికి ఇలా చేస్తే తక్కిన మానవ జాతిని బుద్ధి వస్తుంది ” అని నచ్చజెప్పింది. 

 

ఆ వేటగాడి దురాశకు, నమ్మకద్రోహానికి ఎంతో కోపం పడిన ఆ ఎలుగు బంటి అతనికి తగిన గుణపాఠం చెప్పాలని పెద్దగా అరిచింది. ఆ అరుపులకు భయపడిపోయిన ఆ వేటగాడు చేతులు పట్టు తప్పగా కింద పడిపోయి ఆకలితో వున్న ఆ పులికి ఆహారమైపోయాడు. 

***

Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు Ch. ప్రతాప్. నేను వృత్తి రీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ప్రస్తుత నివాసం ముంబయి. 1984 సంవత్సరం నుండే నా సాహిత్యాభిలాష మొదలయ్యింది. తెలుగు సాహిత్యం చదవడం అంటే ఎంతో ఇష్టం. అడపా దడపా వ్యాసాలు, కథలు రాస్తుంటాను.

 


95 views0 comments

Comments


bottom of page