'Nammakam' - New Telugu Story Written By Shilpa Naik
Published In manatelugukathalu.com On 17/08/2024
'నమ్మకం' తెలుగు కథ
రచన: శిల్పా నాయక్
తెల్లవారు జామున 4 గంటలు:
సీతాపురం పోలీస్ స్టేషన్ టెలీఫోన్ కి, కాల్ వస్తుంది. దానిని అట్టెండ్ చేసి కానిస్టేబుల్ గోపి కి హలో చెప్పేలోపు అవతలి వైపు నుంచి ఒక అమ్మాయి కంగారుగా, "హలో పోలీస్.. మా ఇల్లు పోస్ట్ ఆఫీస్ పక్కన మూడో ఇల్లు.. మా ఇంట్లో దొంగలు పడ్డారు.. వాళ్ళు మా అమ్మ నాన్న తమ్ముడ్ని చంపేసి.. నా కోసం.. ఆ! " అని ఫోన్ కట్ అవుతుంది. ఇదంతా విన్న గోపి, తన తోటి కానిస్టేబుల్ రాముతో, “రాము, ఎవరో అమ్మాయి కాల్ చేసి తన ఇంట్లో దొంగతనం, హత్య జరిగిందని చెప్పింది. "అని చెప్తాడు.
ఇదంతా విన్న రాము పట్టనట్టుగా గోపితో, "పోయిన వారం కూడా ఇలా కొంతమంది ఇలాగే ఫోన్ చేసి మార్కెట్ లో హత్య జరిగిందని చెప్తే కంగారుగా నేను, వెంకట్ సర్ వెళ్ళాము. తీరా వెళ్ళాక తెలిసింది, హత్య జరిగింది మస్తాన్ కొట్టులో మేకలదని. సి. ఐ సర్ లీవ్ లో ఉన్నప్పటి నుంచి ఆ ఆకతాయిల అబ్బాయిలు ఇలా రోజు ప్రాంక్ కాల్స్ చేస్తున్నారు. ఒకసారి సర్ మళ్ళీ డ్యూటీ జాయిన్ అవని. అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి. ”అని చెప్తూ ఫోన్ లో గేమ్స్ ఆడుతుంటాడు.
గోపి, "కానీ ఆ అమ్మాయి అడ్రస్ కూడా చెప్పింది. " అని చెప్తాడు.
రాము అసహనంగా, "అయితే నువ్వే వెళ్లి చూడు. " అని సమాధానిస్తాడు. గోపి కాసేపు ఆలోచించి తను ఆ ఇంటికి వెళ్తున్నటుగా చెప్పి సైకిల్ వేసుకొని వెళ్ళిపోతాడు. రాము కూడా విసుగ్గా నేను కూడా వస్తున్నా ఆగని చెప్తూ సైకిల్ వైపు పరిగెడతాడు. ఇద్దరు ఆ ఇంటికి చేరుకుంటారు.
మరుసటి రోజు ఉదయం:
స్టేషన్ వెళ్ళడం కోసం రెడీ అవుతున్న ఎస్. ఐ. కార్తీక్, కుమార్ కి ఫోన్ రావడంతో వెంటనే రేడి ఐయి కావ్య ఇంటికి బైక్ లో చేరుకుంటాడు. అక్కడ చాలా మంది జనం ఉండడం గమనించిన కార్తీక్ ని, ఎదురుగా కానిస్టేబుల్ వచ్చి ఇంటి లోపలకి తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అవుతాడు.
కార్తీక్ ఉంటున్న ఊరులో ఇలాంటి క్రైమ్ అసలెప్పుడు జరగలేదు. దొంగతనాలు కూడా పెద్దగా జరగని ఊర్లో ఇలాంటి మాస్ మర్డర్స్ జరగడం ఇదే మొదటిసారి. కార్తీక్ డిపార్ట్మెంట్ జాయిన్ ఐయి కేవలం 2 సంవత్సరాలే కావడంతో ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ చెయ్యాలో కూడా కార్తీక్ కి తెలీదు.
"సర్, ఉదయం 4కి స్టేషన్ కి కాల్ వచ్చింది. దొంగతనం జరిగింది, దొంగలు మా అమ్మ నాన్న తమ్ముడ్ని చంపేసారు అని. ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం ఫ్యామిలీయే చనిపోయారు" అని కానిస్టేబుల్ వెంకట్ మాటలకి అసలు ఏం చెప్పాలో కూడా కార్తీక్ కి అర్ధం కాలేదు.
"అంతే కాదు అందరికి గాయాలు కడుపు మీద ఉన్న, కావ్య అనే అమ్మాయికి మాత్రం సూసైడ్ చేసుకున్నటుగా గొంతు మీద ఉండడం వింతగా ఉంది సర్” అని తన అభిప్రాయం చెప్తాడు.
కార్తీక్ వెంకట్ మాటలకి అవునన్నట్లుగా తల ఊపి బాడీస్ ని ఫోరెన్సిక్ కి పంపండని చెప్పి ఇల్లంతా తిరిగి చూస్తాడు. ఇంటి తలుపులు, కిటికిలు అన్ని మూసి ఉండడం వల్ల దొంగల పని కాదేమో అని కార్తీక్ కి అనుమానం వస్తుంది. కానిస్టేబుల్స్ చుట్టు పక్కల ఉన్న వాళ్ళ నుంచి స్టేట్ మెంట్స్ తీసుకుంటారు.
అదే రోజు మధ్యాహ్నం:
ఎస్. పీ రామకృష్ణ స్టేషన్ వచ్చి కేసు గురించి తెలుసుకుంటాడు.
కార్తీక్ (సెల్యూట్ చేస్తూ): సర్, ఫైల్
రామకృష్ణ (ఫైల్ తీసుకుంటూ): కేసు లో ఇనిషిల్ ఫైండింగ్స్ ఏంటి?
కార్తీక్: సర్ చనిపోయిన వాళ్ళందరూ ఒక్కే కుటుంబానికి చెందిన వారు. 47 ఏళ్ళ సుబ్రహ్మణ్యం, అతని భార్య 39 ఏళ్ళ సుజాత, వారి పెద్ద కూతురు 20 ఏళ్ళ కావ్య మరియు చిన్న కొడుకు 19 ఏళ్ళ కుమార్. సుబ్రమణ్యంకి టౌన్ లో బట్టల దుకాణం ఉంది. రీసెంట్ గా ఆ షాప్ కి రేనోవేషన్ కూడా చేయించాడు. వ్యాపారం బాగానే సాగుతుంది. సుజాత హౌస్ వైఫ్. కావ్య, కుమార్ టౌన్ లో వేరే వేరే కాలేజీలో డిగ్రీ 2న్ద్ అండ్ 1స్ట్ ఇయర్ చదువుతున్నారు. శత్రువులు ఎవరు లేరు. చుట్టుపక్కల వారితో బాగానే ఉండేవారు సర్.
రామకృష్ణ: ఎలా చనిపోయారు?
కార్తీక్: సుబ్రహ్మణ్యం, సుజాత, కుమార్ కడుపులో కత్తి పొటు వల్ల బ్లాడ్ల్ లాస్ ఐయి చనిపోయారు. కావ్యకి మాత్రం గొంతు కోసి చంపినట్టు అనిపిస్తుంది.
రామకృష్ణ(ఫైల్ చూస్తు): ఇందులో దొంగతనం గురించి కాల్ వచ్చిందని ఉండేంటి?
కార్తీక్: అవును సర్, చనిపోయే ముందు కావ్య దొంగలే తన పేరెంట్స్ ని చంపారని చెప్పింది. సో, అది తెలుసోకోవడానికి కానిస్టేబుల్స్ ఇంటికి వెళ్లారు సర్. కాని ఇంట్లో డబ్బు, నగలు అలాగే ఉన్నాయి.
రామకృష్ణ: ఓకే, మోటివ్ ఏమై ఉండొచ్చు?
కార్తీక్: ..
రామకృష్ణ: కార్తీక్, ఈ కేసు గురించి నువ్వేమనుకుంటున్నావ్?
కార్తీక్ మౌనంగా ఉండడం రామకృష్ణకి నచ్చలేదు.
కార్తీక్ (మెల్లగా): సర్ ఈ కేసు ని హండిల్ చేసేంత అనుభవం నాకు లేదనిపిస్తుంది. దయచేసి ఈ కేసునీ సి. ఐ గారి..
రామకృష్ణ (కోపంగా): నువ్వొక్క పోలీస్ వాడివని మర్చిపోకు. సి. ఐ ఆక్సిడెంట్ ఐయి హాస్పిటల్ లో ఉన్నాడని తెలుసు, కోలుకోవడానికి 3 నెలల టైం పడుతుందని నీకు తెలుసు. కేసు డీటెయిల్ గా ఎనాలిసిస్ చేస్తేనే కదా ఎలా సాల్వ్ చెయ్యాలో తెలిసేది. ధైర్యంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చెయి. ఏమైనా రిఫరెన్స్ కావాలంటే నన్నడుగు.
కార్తీక్ ఎదో చెప్పబోయే లోపు రామకృష్ణ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
అదే రోజు రాత్రి కార్తీక్ ఇంట్లో:
కార్తీక్ తన రూంలో క్రైమ్ ఫొటోస్ చూస్తు, స్టేట్ మెంట్స్ చదువుతుంటాడు. అప్పుడే వెంకట్ రేపు పొద్దునే ఫోరెన్సిక్ డాక్టర్ ని కలవడానికి వెళ్ళాలని మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చుసిన కార్తీక్ ఏదైనా క్లూ దొరికితే బాగుంటుందని అనుకుంటారు.
మరుసటి రోజు ఉదయం:
కార్తీక్, వెంకట్ ఇద్దరు పోస్టుమార్టం జరిగిన హాస్పిటల్ కి చేరుకున్నారు.
కార్తీక్: గుడ్ మార్నింగ్ డాక్టర్
డాక్టర్: గుడ్ మార్నింగ్
కార్తీక్: రిపోర్ట్స్ వచ్చాయని..
డాక్టర్: ఓహ్ ఎస్, చనిపోయిన టైం 3 టు 4'0 మధ్యలో జరిగి ఉండొచ్చు, కావ్యకి తప్ప మిగితా ముగ్గుర్ని 7 సార్లు పొడిచి చంపారు. కానీ కుమార్ కి ముందు 4 సార్లు పొడిచి ఆ తర్వాత సమయం తీసుకుని మళ్ళీ 3 సార్లు పొడిచినట్టుగా ఉంది. ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చనిపోయిన వారెవ్వరూ హంతకుడిని ఎదిరించలేదు.
కార్తీక్ (తడబడుతూ): అంటే ముందు వాళ్లకి మత్తు మందు ఇచ్చి సృహ కోల్పోయాక చంపి ఉంటారా?
కార్తీక్ తడబాటును గమినించిన డాక్టర్
డాక్టర్(నవ్వుతూ): మీకిది 1స్ట్ కేసు అనుకుంటా. ఎస్ ఏ సీనియర్ డాక్టర్, మీకొక సలహా ఇస్తున్న. ప్రశ్న ఏదైనా ధైర్యంగా అడగండి. అది డాక్టర్ అయినా క్రిమినల్ అయినా ఎందుకంటే అడిగినా ప్రతి ప్రశ్నకు ఎదో ఒక సమాధానం కచ్చితంగా ఉంటుంది. కేసు విషయానికి వస్తే, మీరు చెప్పినట్టుగా మత్తు మందు ఇచ్చినట్టు ఎటువంటి గుర్తులు లేవు. ఫుడ్ లో కలిపి ఇవ్వలేదు. వేరే ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇన్ఫోర్మ్ చేస్తాను.
కార్తీక్, వెంకట్ అక్కడ నుంచి జీప్ లో స్టేషన్ వస్తూ ఉంటారు. వెళ్ళే దారిలో వెంకట్ కార్తీక్ తో కేసు గురించి మీ అభిప్రాయం ఏంటని అడుగుతాడు. దానికి కార్తీక్ వెంకట్ నే తిరిగి అదే ప్రశ్న అడుగుతాడు. వెంకట్, "నాకిది దొంగతనంగా అనిపించట్లేదు సర్, ఎందుకంటే వస్తువులన్నీ ఎక్కడిక్కడే ఉన్నాయి. స్టాగల్ చేసినట్టు ఆనవాళ్లు లేవు. సో బాగా తెలిసిన వాళ్ళే ఈ పని చేసి ఉండాలి. "అని చెప్తాడు.
కార్తీక్, "కాని తెలిసిన వాళ్ళే చేసి ఉంటే సుబ్రమణ్యాన్ని పొడిచినప్పుడే మిగితావాళ్లూ అలెర్ట్ ఐయి అరుస్తూ ఇంటి నుంచి బయటికి పారిపోవచ్చు కదా. చుట్టుపక్కల ఉన్న వారి స్టేట్ మెంట్స్ లో ఎటువంటి అలికిడి కూడా విన్నాలేదని ఉంది. బాడీలో సేడ్యుకేటివ్స్ ఉన్నాయన్న ట్రాన్స్ కూడా లేవు. అసలు ఎలా చనిపోయారు?” అంటూ డాక్టర్ ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ చదువుతాడు.
జీప్ స్టేషన్ కి చేరుకుంటుంది. స్టేషన్ లో సుబ్రహ్మణ్యం బంధువులందరు కార్తీక్ కోసం ఎదురుస్తుంటారు. వెంకట్ వాళ్ళలో ఒకరిని కార్తీక్ తో పర్సనల్ గా మాట్లాడవచ్చని చెప్పడంతో, సుభాష్ అనే వ్యక్తి మాత్రం కార్తీక్ తో పాటే తన డెస్క్ కి వెళ్తాడు.
సుభాష్: సర్, మా ఫ్యామిలీ బాడీస్ ఎప్పుడిస్తారు?
కార్తీక్: ప్రొసీజర్ అయ్యిన తర్వాత. ఇంతకీ మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా?
సుభాష్: లేదు సర్, అన్నయ్య ఎప్పుడు అందరితో బాగానే ఉండేవారు.
కార్తీక్: ఓకే, చనిపోయే ముందు తరుచుగా ఎవరినైనా కలుస్తూ ఉండేవారా?
సుభాష్ చెప్పిన సమాధానంతో మరుసటి కార్తీక్ ఒంటరిగా ఒక ఆశ్రమానికి, తరువాతి రోజు కావ్య కాలేజీకి, ఆ తర్వాత చర్చికి, చివరిగా నెల్లూరు కి వెళ్తాడు. ఇలా ఆరు రోజులు గడిచిపోతాయి.
ఏడవరోజు:
ఎస్ పీ ఆఫీస్ లో రామకృష్ణ మరియు కొంతమంది పోలీస్ అధికారులుతో మీటింగ్ జరుగుతుంది. కార్తీక్ కేసు గురించి మాట్లాడతాడు.
"సర్, 8 రోజుల క్రితం తెల్లవారు జామున పోలీస్ స్టేషన్ కి కావ్య అనే అమ్మాయి కాల్ చేసి తన ఇంట్లో దొంగతనం జరిగిందని, దొంగలు తన అమ్మ నాన్న తమ్ముడ్ని చంపి తన కోసం వెతుకుతున్నారని చెప్తూ ఉండగా కాల్ కట్ అయింది. అది నిజమా లేక ప్రాంకా అని తెలుసుకోవడానికి ఇంటికి వెళ్ళిన కానిస్టేబుల్స్ కి అక్కడ మొత్తం ఫ్యామిలీ చనిపోవడాన్ని చూసారు. ఫోరెన్సిక్ డాక్టర్ ప్రకారం హత్య 3 నుంచి 4 గంటల మధ్యలో జరిగిందని, స్టాగల్ అయిన గుర్తులు లేవని డాక్టర్ చెప్పాడు. అప్పుడే సుబ్రహ్మణ్యం తమ్ముడైన సుభాష్ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం, సుబ్రహ్మణ్యం తరచుగా రామచంద్ర బాబాని కలుస్తూ ఉంటాడని, పూజాలు, హోమాలు ఆయనతోనే చేయించేవాడని, అతని పైన చాలా నమ్మకంగా ఉండేవాడని తెలిసింది.
మరుసటి రోజు రామచంద్ర బాబాని కలిసాను. ఆయన స్టేట్ మెంట్ ప్రకారం, కొన్ని రోజుల క్రితం కావ్య తన ఆశ్రమానికి వచ్చి, తన ఇంట్లో కలియుగం అంతమైపోతుందని, అది అంతం అయ్యేముందే 20 రోజులు పూజ చేసి, పౌర్ణమి రోజు బ్రహ్మ ముహూర్తానికి పిల్లల చేతిలో చనిపోతే, పాపాలని తొలిగిపోయాయి పుణ్యతులుగా మళ్ళీ జీవిస్తారని సుబ్రహ్మణ్యం కి చెప్పు, అలా చెప్పకపోతే అడల్ట్ వీడియోలో తన ఫోటోతో మార్ఫింగ్ చేసి ఊర్లో ఉన్నవారందరికి ఫోన్ లో షేర్ చేస్తా, అని తనని బెదిరించిందని చెప్పాడు. అసలు కావ్య ఎందుకిలా చేసిందో అర్థం చేసుకోవడానికి తన కాలేజీకి వెళ్లాను.
అక్కడ తన ఫ్రెండ్ లావణ్య ద్వారా కావ్య, అదే కాలేజీలో చదువుతూ, హాస్టల్ లో ఉంటున్న ఆకాష్ అనే సీనియర్ అబ్బాయిని ప్రేమించిందని తెలియడంతో ఆకాశ్ ని కలవడానికి తన ఊరు వైజాగ్ కి వెళ్లాను.
అక్కడికి వెళ్ళాక ఆకాష్ చెప్పిన విషయం ఏంటంటే తను, కావ్య ప్రేమించుకున్న మాట నిజమే. ఈ విషయం తన తల్లితండ్రులకు కూడా చెప్పాడు. కానీ వాళ్ళు ఆకాష్ కి తెలియకుండా కావ్య గురించి ఎంక్వయిరీ చేయిస్తే, వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే కావ్య అసలు సుబ్రహ్మణ్యం కూతురే కాదని, తనని చిన్నప్పుడే ఆర్ఫనేజ్ నుంచి దత్తత తీసుకున్నారని. కులం తెలియని అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకోమని చెప్పడంతో ఇద్దరు పారిపోవడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం తెలిసిన ఆకాష్ తల్లి తండ్రులు తనని బ్లాక్మెయిల్ చేసి హత్య జరిగిన రోజే బలవంతంగా పెళ్లి చేయించారు.
కావ్య గురించి తెలుసుకోవడానికి ఆర్ఫనేజ్ కి వెళ్తే అక్కడ మదర్ ఏంజెల్ చెప్పిన స్టేట్ మెంట్ ప్రకారం, 20 ఏళ్ళ క్రితం సుబ్రమణ్యమే రక్తపు మరకలతో ఒక పాపని ఇక్కడికి తీస్కోచి, ఆ పాప తల్లితండ్రులని అనుకోకుండా ఆక్సిడెంట్ చేసానని, నేను జీవితంలో సెటిల్ అయ్యాక తనని దత్తత తీసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడని చెప్పింది. ఇదే విషయం కావ్యకి కూడా చెప్పిందని చెప్పింది.
జరిగిన సంఘటనల ప్రకారం, కావ్య తన తల్లిదండ్రుల చావుకి ప్రతీకారం తీస్కోవాలని అనుకుంది. అందుకే సుబ్రహ్మణ్యం ఎంతగానో నమ్మే బాబాతో అబద్ధం చెప్పించి, ముగ్గుర్ని హత్య చేసి ఇంట్లో ఉన్న డబ్బు నగలు తీసుకుని ఆకాష్ తో పారిపోవాలనుకుంది. దొంగలే హత్య చేసి తనని కిడ్నప్ చేసి తీసుకెళ్లారని నమ్మించాలనుకుంది.
హత్య జరిగిన రాత్రి, పౌర్ణమి రాత్రి కావడంతో సుబ్రహ్మణ్యం, సుజాత పూజ చేసి, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు. కావ్య పూజలో వాడిన కత్తితో ఏడు సార్లు ఇద్దర్ని కడుపులో పొడిచి చంపింది. కావ్య, కుమార్ ని కూడా 4 సార్లు పొడవడంతో కుమార్ భయంగా రూమ్ లోకి వెళ్లి దాక్కున్నాడు. తనని వెతికి 3 సార్లు పొడిచి చంపింది.
ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి తన ఇంట్లో దొంగలు పడి, తన ఫామిలీ ని చంపేసి, తన కోసం వెతుకుతున్నారంటూ చెప్పి కాల్ కట్ చేసింది. ఆ తర్వాత ఆకాష్ కి కాల్ చేసింది. కావ్య కాల్ లిస్ట్ లో ఆకాష్ నంబర్ ఉంది. కాని ఆకాష్ కి అప్పటికే పెళ్లి అయిపోయందని తెలిసి దిక్కు తోచని పరిస్థితిలో కావ్య ఎక్కడకి పారిపోవాలో తెలియక, పోలీస్ కి దొరికితే కచ్చితంగా తనని ఉరి శిక్ష పడుతుందని భయపడి ఆత్మహత్య చేసుకుంటుంది. సో ఈ కేసు లో హంతకురాలు కూడా చనిపోవడంతో కేసు ఇక్కడితో ముగుస్తుంది. ”
అని చెప్పి కార్తీక్ కాన్ఫిడెంట్ గా కేసు ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు.
***
శిల్పా నాయక్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు శిల్ప. నేను రచయిత్రిని అని చెప్పలేను. కానీ అప్పుడప్పుడు ఫాంటసీ, భయం కల్పించే కథలు రాస్తుంటాను. కథలు రాయడం ఇప్పుడే నేర్చుకుంటున్నా.
Commentaires