#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #NannaGariPalukulu, #నాన్నగారిపలుకులు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 33
Nanna Gari Palukulu - Somanna Gari Kavithalu Part 33 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 13/03/2025
నాన్న గారి పలుకులు - సోమన్న గారి కవితలు పార్ట్ 33 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
నాన్న గారి పలుకులు
అన్నింటిలో దూకుడు
పనికిరాదు ఎప్పుడు
ఇకనైనా సత్యము
తెలుసుకొనుము తమ్ముడు
ఎగసిపడే కెరటము
నేర్పునోయ్! పాఠము
"పెరుగుట విరుగుట కొరకు"
అను సామెత మరువకు
ఉప్పెనలాంటి కోపము
అదుపు చేస్తే లాభము
అతివేగంఅనర్ధము
తెచ్చును బహు నష్టము
అనుమానం భూతము
ఆవరిస్తే కష్టము
ఛిద్రమగును బ్రతుకులు
ఆరిపోవు అసువులు
తగినంత వాడితే
చరవాణి లాభము
లేకుంటే మాత్రము
చేకూర్చును నష్టము

సూక్తి రత్నాలు
----------------------------------------
సృష్టిని నడిపించే
శక్తి ఒకటి ఉన్నది
దేవుని పరీక్షింప
మనిషి మెదడు చిన్నది
శ్రద్ధగా స్మరిస్తే
దైవమే వశమగును
భక్తితో ప్రార్థిస్తే
దీవెనలు ఒసంగును
భగవంతునికి చోటు
ఇవ్వాలి హృదయాల్లో
మంచిది దిద్దుబాటు
మానవ జీవితాల్లో
అందరూ దైవ సృష్టి
మంచినే చూడాలి
లోపాలు వెదకరాదు
ప్రేమనే చాటాలి

హితోక్తుల వెలుగులు
----------------------------------------
అన్నం పెట్టిని చేతిని
జ్ఞానం పంచిన గురువుని
ఎన్నడూ మరవరాదోయ్!
కృతజ్ఞతలు తెలపాలోయ్!
సరిహద్దు సైనికులను
పారిశుద్ధ్య కార్మికులను
గుర్తించుకోవాలోయ్!
సదా గౌరవించాలోయ్!
జన్మనిచ్చిన వారికి
మనం పుట్టిన ఊరికి
కీర్తి తెచ్చి పెట్టాలోయ్!
స్ఫూర్తి కొంత పంచాలోయ్!
నిజమైన స్నేహితులకు
మహిలోన మహనీయులకు
ద్రోహము తలపెట్టకోయ్!
అనిశము కాపాడుకోయ్!

అక్షర సుభాషితాలు
----------------------------------------
వెదకరాదు తప్పులు
పెట్టరాదు తిప్పలు
మనిషిలోని మంచిని
చూసు వారు మాన్యులు
ఇతరుల భావాలను
మదిలో ఇష్టాలను
గౌరవిస్తే చాలు
అందరికి బహు మేలు
స్నేహితుల మధ్యలో
రేపరాదు గొడవలు
పచ్చని కాపురాల్లో
రగిలించకు మంటలు
ఎదుటివారి క్షేమము
కాసింత యోచించు!
అందరి సంక్షేమము
మెండుగా కాంక్షించు

నీతి సూక్తులు
----------------------------------------
పెల్లుబికిన లావాలా
పెనుముప్పు దురుసుతనము
తగలబెట్టు నిప్పులా
దహించు అహంకారము
చెట్టుకు పట్టిన చెదలలా
తినివేయును నీచగుణము
గర్జించే సింగంలా
చీల్చివేయును కోపము
ముంచివేయు ఉప్పెనలా
మదిని ఓర్వలేనితనము
వాడిపోయే పూవులా
క్షీణించునోయి అందము
వెంటాడే పీడలా
ఉండునోయి లోభత్వము
హానిచేయు చీడలా
పనిచేయు దానవత్వము
-గద్వాల సోమన్న
Comments