'Nanna Okkade' New Telugu Poem Written By Lakshminageswara Rao Velpuri
'నాన్న ఒక్కడే' తెలుగు కవిత
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
నవమాసాలు నిన్ను తన గర్భంలో పదిలంగా ఉంచి, ప్రపంచంలోకి తెచ్చేది తల్లి అయితే,
నూరేళ్ళు నిన్ను అదే ప్రపంచంలో చరిత్రకారుడు గా తీర్చి దిద్దేది నాన్న ఒక్కడే
బుడి బుడి నడకలు తో నీ అడుగులు సక్రమమైన దారిలో పడేలా చేసేది, నాన్న ఒక్కడే,
తాను పస్తులుండి, నీకు పరమాన్నం తినిపించే వాడు కూడా నాన్న ఒక్కడే,
'నిన్ను దేశాన్ని కాపాడే సైనికుడిలా చెయ్యాలన్నా,
నిన్ను దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్త ను చెయ్యాలన్నా,
నాన్న ఒక్కడే!
నిన్ను అన్నివిధాల అనుక్షణం కాపాడుతూ, వెన్నంటి ఉండే వాడే,
ఈ కలియుగంలో ప్రత్యక్ష దేముడు మీ నాన్నగారు.
"కలియుగ వెంకటేశ్వరుడు ప్రజలందరికీ కన్న తండ్రి అయితే,
మా నాన్న భుజాలే నాకు ఏడుకొండలు"
🙏🙏🙏
'బాల్యము నుండి యుక్త వయసు వచ్చేవరకు, నిన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ప్రత్యక్ష దేవుడు మీ నాన్న,
'నీకు ఆరోగ్యం బాగోలేదన్నప్పుడు, తల్లడిల్లి పోయేవాడు మీ నాన్న,
అమ్మ చాటు బిడ్డగా నువ్వు ఎదుగుతున్నా,, నీ మంచి కోరి నీకు నియమ నిబంధనలు విధిస్తూ,
క్రమశిక్షణలో పెంచేవాడు మీ నాన్న,!
ఈనాడు నీ ప్రయోజకత్వం అంతా నాన్న గీసిన బాటలో నడవబట్టే రా నా కొడకా!,
అన్న తల్లి మాటలు సద్దన్నం మూటలు,
నువ్వు ఎంత ఎదిగినా తల్లిదండ్రులను కించపరచక,
వారికి నీ శాయశక్తుల సేవ చేసి,
కన్నవారిని ఆనందపరిచే పుత్రుడే
మానవజాతికి మూల పురుషుడు.
*****
వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Commentaires