top of page

నరకాపురంలో వార్తలు..

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #Narakapuramlo Varthalu, #నరకాపురంలో వార్తలు, #TeluguChildrenStories


Narakapuramlo Varthalu - New Telugu Story Written By P V Padmavathi Madhu Nivrithi

Published In manatelugukathalu.com On 26/04/2025

నరకాపురంలో వార్తలు - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)

ఆ నగరం అసలు పేరు ఎవ్వరికీ తెలీదు. అందరూ దానిని 'నరకాపురం' అని పిలిచే వారు. అది దేశమంతా ఆ పేరుతోనే ప్రసిద్ధి. 


ఎందుకు అలా ???


ముందు బాగానే ఉండేది. కొన్ని నెలల క్రితం.. ఎక్కడినుండో కొందరు అఘాంతకులు - దుండుగులు - గూండాలు - రౌడీలు వచ్చి.. ఆ మంచి ఊరు - మంచి రూపమే మార్చేశారు. 


రోజూ అక్కడ అన్నీ అఘాంతకాలే. అది పాపాల భైరవుల ఊరు. చోరీలు, ఏడిపిచ్చటం, అన్యాయాలు, అక్రమాలు, జీవ హింస, మోసాలు, ఖూనీలు, మానభంగాలు, కష్టం నష్టం ఇవ్వటం, అసంతుష్ట నిర్వహణ, అసహజ నిర్వహణ, కల్తీ సామాన్లు.. మద్యం, పొగాకు, జూదం.. ల కు నిలయం. 


ఇవి నరకాపురంలో ని దిన వార్తలు.. రోజూ వారి వార్తలు. 

------------------------------------


2) 

హైదరాబాద్ లో మేనేజ్మెంట్ చదువుతున్నారు ముగ్గురు ఆడ - స్నేహితులు. వారి పేర్లు అ, ఆ, ఇ. 

(వీరి గురించి మరిన్ని వివరాలు సూపర్ గర్ల్స్ - రాక్షస లంక కథలో చదవండి.)


ఇవి పేర్లా? ఇవేం పేర్లు ?.. అనుకుంటున్నారా?


"అ"నురాధ, "ఆ"మని, "ఇ"లియ.. వారి అసలు పేర్లు. 

వారు ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్ - ప్రాణ స్నేహితులు. ప్రేమ సూచకంగా 

అ, ఆ, ఇ అని అక్షర రూపంలో పిలుచుకుంటారు అంతర్గతంగా. 


అందరికీ కూడా అదే అలవాటు అయిపొయింది. 


ఇది వారి ఆఖరి సెమిస్టర్. మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి (3 - 6 నెలల్లో). 


ఆ రోజు తరగతి గది లో వారి టీచర్ ప్రకటన చేశారు, 

"మీరందరూ నరకాపురం వెళ్లి ప్రాజెక్ట్ స్టడీ చేసి.. ప్రాజెక్ట్ రిపోర్ట్ - సమాచార పట్టిక - నివేదిక.. తయారు చేయాలి.. 4-6 నెలల్లో", అని. 


"అక్కడికి వెళ్లాలా?", అంటూ కెవ్వు మని అరిచారు.. తరగతి లో ఉన్న మొత్తం విద్యార్థులు. 


"ఏం భయం లేదు. మీ అందరికీ కరాటే వచ్చు కదా", అని తేలికగా కొట్టి పడేశారు టీచర్. 


"మీరంతా అసలైన మేనేజ్మెంట్ విద్యార్థులు అయితే మంచిగా మేనేజ్ చేయాలి నరకపురం ను.. ఈ రోజు సాయింత్రమే రైల్లో ప్రయాణం.. ఇవిగో మీ అందరి రైలు టిక్కెట్లు టేబుల్ మీద పెట్టాను.. మీ అందరికీ సీట్లు - బెర్తులు ఒకే బోగీ లో వచ్చేలా ఏర్పాటు చేసాము", అంటూ చక చక నడుచుకుంటూ బయిటికి వెళ్లి పోయారు ప్రాజెక్ట్ టీచర్. 

----------------------------------------------------


3) 'అ, ఆ, ఇ' ల తల్లి దండ్రులు టి. వి. ఆన్ చేశారు మరునాడు సోమవారం ఉదయం. 


----- నరకాపురం సోమవారం టి. వి వార్తలు (వస్తున్నాయి) ------


నరకాపురం స్టేషన్ లో దిగగానే, హైదరాబాద్ నుండి వచ్చిన ముగ్గురు కరాటే డ్రెస్ లో ఉన్న మేనేజ్మెంట్ విద్యార్థినిలు.. 'అ, ఆ, ఇ' లు.. కొందరు దుండగులను కరాటే దెబ్బలతో చితక బాదారు అమర్యాదకరంగా ప్రవర్తిస్తే.. డబ్బులు అడిగితే.. ఆ దుష్టులు రక్తం మడుగు లో పడి ఉంటే.. పోలీసులు వచ్చి తీసుకెళ్లారు"


చూడండి ఎలా ఎగిరి ఎగిరి తన్నారో.. కరాటే దెబ్బలు వేశారో.. 


4) 

----- నరకాపురం మంగళ వారం టి. వి వార్తలు (వస్తున్నాయి) ------



నరకాపురం కాలేజీ లో.. ఎవరో రాగింగ్ చేస్తూ ఉంటే.. హైదరాబాద్ విద్యార్థినిలు 'అ, ఆ, ఇ' లు.. అక్కడికెళ్లి.. కరాటే డ్రెస్సులో.. చేతితో వాళ్ళ మెడల మీద కరాటే దెబ్బలు కొట్టి.. మట్టి కరిపించారు. 


"ఎవరు రాగింగ్ చేసినా ఇదే గతి పడుతుంది.. " అని టి. వి. లోనే హెచ్చరించారు. 


5) 


----- నరకాపురం బుధ వారం టి. వి వార్తలు (వస్తున్నాయి) ------


నరకాపురం లో ఓ మద్యం దుకాణం ముందు జగడం. ఈ సారి పెద్ద సంఖ్యలో గూండాలు పైన బడ్డారు 'అ, ఆ, ఇ' ల పైన. 


"దమ్ముంటే ఒక్కొక్కరు రండి రా.. " అని అరిచినా వినలేదు ఆ పోకిరి గూండాలు. మూకుమ్మడి గా వచ్చి పడ్డారు 'అ, ఆ, ఇ' ల పైన. 


ముందుగానే పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్టు. 


ఇక 'అ, ఆ, ఇ' ల పని అయిపోయింది అనుకున్నారు అందరూ. 


అంతలో అకస్మాత్తుగా 'అ, ఆ, ఇ' లు వారి వారి జేబుల్లో నుండి పిస్తోల్లు తీసి.. గూండాల గ్యాంగ్ పై కాల్పులు చేశారు.. స్వయం రక్షణ కొరకు (డాం - డాం - డాం). పిట్టల్ని కాల్చి నట్టు చంపేశారు వారందరినీ అక్కడికక్కడే. 


పోలీసులు వచ్చి తీసుకెళ్లారు ఆ ఎర్ర రక్తం మడుగులో ఉన్న గూండాల శవాలను. 


"మద్యం అమ్మే షాపులను అన్నీ మూసేయండి.. లేకుంటే మీకూ ఇదే గతి పడుతుంది.. కాల్చి నరకానికి పంపిస్తాం" అని వార్నింగ్ ఇచ్చారు 'అ, ఆ, ఇ' లు టి. వి. లోనే. 


అన్ని మద్యం మరియు పొగాకు దుకాణాలను మూసివేశారు నరకాపురంలో.. మొదటి సారిగా. 


ఒక నిజం తెలిసింది అందరికీ.. కరాటే రాణులు 'అ, ఆ, ఇ' ల వద్ద పిస్తోల్లు కూడా ఉన్నాయని.. కాల్చేస్తారని.. చంపేస్తానని. 


6)

---- నరకాపురం గురు వారం టి. వి వార్తలు (వస్తున్నాయి) ------


జూద గృహం వద్ద.. కొందరు దుండగులతో చాలాసేపు పోట్లాట. 

 'అ, ఆ, ఇ' లు గాలిలొ ఎగిరి ఎగిరి తన్నారు వారిని. 


గూండాలు ఫోన్ చేస్తే.. రెండు కార్లలో.. వారి గాంగ్ వచ్చింది అక్కడికి. 


అప్పటికే అలసిపోయారు 'అ, ఆ, ఇ' లు.. కరాటే రాణులు. 


గూండాలు కనీసం 20 మంది ఉంటారు ఇప్పుడు. 


ఎవరో అరిచారు అక్కడ ప్రోగైన జనం లో నుండి "పిస్తోలు తీసి కాల్చండి.. ఆ గూండాలను" అని. 


ఇక వేరే మార్గం లేదు. 


మళ్లీ 'అ, ఆ, ఇ' లు వారి వారి జేబుల్లో నుండి పిస్తోల్లు తీసి.. గూండాల గ్యాంగ్ పై కాల్పులు జరిపి చంపేశారు. 


పోలీస్ జీప్లు వచ్చి వారి శవాలను తీసుకు వెళ్ళింది. 


7)

 ---- నరకాపురం శుక్ర వారం టి. వి వార్తలు (వస్తున్నాయి) -----


ఎవరో వ్యాపారులు.. అమాయక పేద ప్రజలను మోసం చేస్తూంటే.. కల్తీ వస్తువులతో - ఎక్కువ ధరలతో.. 


అటు గా వెళుతున్న 'అ, ఆ, ఇ' లు చూసారు. 


వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. 


కిరాయి రౌడీలు చేరారు అక్కడికి. 


పోటా పోటీ యుద్ధం లా ఉన్నది అక్కడి దృశ్యం. 


ఈ సారి పెద్ద పెద్ద కర్రెలతో.. ఆ రౌడీలకి బుద్ధి చెప్పారు. 


కానీ కాసేపు అయ్యాక రౌడీలు కర్రెలు లాగేసుకున్నారు. 


జేబు నుండి మిరప పొడి తీసి వాళ్ళ కళ్ళలో కారం కొట్టారు.. 'అ, ఆ, ఇ' లు (కరాటే రాణులు). 


ఈ అకస్మాత్తు సంఘటన కు.. బెదిరి పోయి.. రౌడీలు పారి పోయారు. 


అంతలో.. పోలీసులు జీవులలో వచ్చి.. ఆ మోసం చేసే వ్యాపారులను పోలీస్ జీప్ ఎక్కించారు. 


"ఇంకో సారి ఎవరైనా.. ఇలా మోసం చేస్తే.. వారికీ ఇదే గతి", అని టి. వి. లోనే వార్నింగ్ ఇచ్చారు.. 'అ, ఆ, ఇ' లు (కరాటే రాణులు). 


8)

 ---- నరకాపురం శని వారం సెలవు రోజు టి. వి వార్తలు (వస్తున్నాయి) -----

ఈ రోజు.. ఒక దుర్ఘటన కూడా జరగలేదు.. నరకాపురం లో


9)


 ---- నరకాపురం ఆది వారం సెలవు రోజు టి. వి వార్తలు (వస్తున్నాయి) -----

ఈ రోజు.. ఒక దుర్ఘటన, కీడు కూడా జరగలేదు.. నరకాపురం లో


మరు రోజు.. 


 ---- నరకాపురం సోమ వారం టి. వి వార్తలు (వస్తున్నాయి) -----


గత రెండు రోజులుగా.. ఒక దుర్ఘటన, కీడు, మోసం, అఘాయిత్యం కూడా జరగలేదు. మద్యం, పొగాకు షాపులు - జూద గృహాలు మూసి వేశారు. నిషేధించారు అన్ని రకాల మోసాలను. 


నరకాపురం ఊరు పేరు 'స్వర్గ పురం' గా మార్చి వేశారు.. ఈ రోజు నుండి. 


అ, ఆ, ఇ లను "సూపర్ గర్ల్స్" - "జగత్ రక్షకులు" బిరుదుతో సత్కరించారు.. ఆ ఊరి వారు


10)


ఆ రోజు తమ పని ముగించుకొని ఇంటికి చేరు కుంటే.. అ, ఆ, ఇ ల తల్లి దండ్రులు వేచి ఉన్నారు వీరి కోసం. 


"రండి.. హైదరాబాద్ ఇంటికి వెనక్కి వెళ్లి పోదాం.. మళ్లీ ఆ గూండాలు కక్ష గట్టి మీ మీద దొంగ దెబ్బ తీయ వచ్చు.. ఏమైనా హాని - కీడు చేయ వచ్చు.. " అని. 


అ, ఆ, ఇ లు గట్టిగా నవ్వారు. 


అదే ఇంట్లో, పక్క గది, అదే పెద్ద హాల్ లో ఉన్న వారి మగ స్నేహితులను (class mates boys) ను పిలిచారు. 


వారు నవ్వుతూ.. రక రకాల గూండాల వేషాలు.. వేసి చూపించారు (వివిధ డ్రెస్సులతో, మీసాలతో.. ఇత్యాది). 


అంటే ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చిన.. మేనేజ్మెంట్ తరగతి స్నేహితులు అందరూ కలసి వేసిన వేషాలు అవి. అది నిజమైన రక్తం కాదు. ఎర్ర రంగు. అవి ఉత్తుత్తి తుపాకీలు. అవి అన్నీ ఉత్తుత్తి జగడాలు, ఫైటింగ్ లు, కాల్చడాలు (ఆడ - మగ స్నేహితుల నడుమ). 


అందులో ఒక విద్యార్థి యొక్క నాన్న, ఒక పోలీస్ ఉద్యోగి. పైన పోలీస్ కమీష్ణర్ కు స్నేహితుడు కూడా. 


అంటే పోలీసులు, మేనేజ్మెంట్ విద్యార్థులు ఆడిన నాటకం అన్న మాట.. ఉన్న మాట. 


అ, ఆ, ఇ ల తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.. తేలికగా. 


"నరకాపురంను.. స్వర్గాపురం గా ఒక్క వారం లో మార్చిన మీరందరూ నిజమైన - అసలైన మేనేజర్లు - నిర్వాహకులు" అంటూ ఆశీర్వదించారు అందరూ విద్యార్థులను. ఆ తరువాత.. తిరిగి హైదరాబాద్ కు 

వెళ్ళిపోయారు. 


11)


6 నెలలు ఇట్టే గడచి పోయాయి. మేనేజ్మెంట్ విద్యార్థుల ప్రాజెక్ట్ పని ముగిసింది.. ఏ ఆటంకాలు లేకుండా.. నారకాపురం లో.. అదే అదే.. ఇప్పుడు మంచికి మరో పేరు గా మారిపోయిన స్వర్గాపురంలో. 


ఆ ఏడు.. ఆ కాలేజీ లో.. మేనేజ్మెంట్ విద్యార్థులు.. ఒకటి మాత్రమే కాదు.. తలా రెండు ప్రాజెక్టులు సమర్పించారు. 


ఒకటి.. తాము పరిశ్రమ - సేవా సంస్థ లో చేసిన ప్రాజెక్ట్. 


రెండు.. తాము నరకాపురం ను.. స్వర్గాపురం గా మార్చిన ప్రాజెక్ట్. 


అది ఉత్తుత్తి ఫైటింగ్ లు, కాల్చటాలు, ఎర్ర రంగు రక్తం.. అని ఇతరులకు తెలీదు. 


మరి మేనేజ్మెంట్ అంటేనే.. అదే మరి.. నిశ్శబ్ధంగా అందరికీ మంచి - మేళ్లు - నిర్మాణాత్మక త - సంతోష పూరిత నిర్వహణ - ఆనంద పూరిత పరిష్కారాలు - అనుకూల వాతావరణం - తరచు మంచి శిక్షణ.. కలిగించటం కదా! 


--- X X X --- X X X ---- X X X ---


నీతి:

మేనేజ్మెంట్ అంటే.. నిశ్శబ్ధంగా.. అందరికీ.. మంచి - మేళ్లు - నిర్మాణాత్మక త - సంతోష పూరిత నిర్వహణ - ఆనంద పూరిత పరిష్కారాలు - అనుకూల వాతావరణం - తరచు మంచి శిక్షణ.. కలిగించటం!


------ (చిన్న కథ సమాప్తం) ----------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






Comments


bottom of page