అంతర్జాతీయ కవితా దినోత్సవ సందర్భమున
'Narudu Namathudu' - New Telugu Poem Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 21/03/2024
'నరుడు - నమతుడు' తెలుగు కవిత
రచన : సుదర్శన రావు పోచంపల్లి
మందసానుని గమనము గన
మనిషి బ్రతుకుండు నటులె
పచ్చ తత్తడుల విజీరుడు
పసుపు చాయతొ ఉదయించి
బాల భాను డుండు బంగరోలె
కాల గమన మందు కాంతులీని
పట్టపగలు జూపు ప్రతాపమెంతొ
తల్లి గర్భము చెంత తానరుగు చుండ
చల్ల బడుచుండు క్షణ క్షణము
క్షాంతి నొదిలి తన దారి సంచరించ
అటులె శిశువులు బెరుగుచు
మారుచుందురు మార్తాండు గమనమోలె
ఉంగ ఉంగ యనుచు స్తనపాయి
చెంగు చెంగున గంతేయ బెరిగి
యుక్తవయసందు తన ఉనికి గ్రహించి
సంసృతి మార్గ మెంచు చక్కగాను
ముదిమి వయసును మనుమలతొ ముచ్చటించు
కడకు కంచారుడు రీతి కాల గర్భము జేరు.
కాన సూర్యుడే సృష్టికి మూలము.
{మందసానుడు=సూర్యుడు,పచ్చతత్తడులవజీరు=సూర్యుడు,ప్రతాపము=వేడి,క్షాంతి=భూమి,మార్తాండుడు=సూర్యుడు,స్తనపాయి=పసిబిడ్డ,సంసృతి=సంసారము, కంచారుడు =సూర్యుడు,-----నమతుడు=సూర్యుడు.
మనిషి బ్రతుకు సూర్యోదయము నుండి సూర్యాస్తమయము రీతి వివిధ దశలు గోచరించును.మొత్తము మీద జీవన విధానము సూర్యుని బోలియే ఉండును.కనుక ఈ సృష్టికి మూలము సూర్యుడే అని గ్రహించాలి.
--సుదర్శన రావు పోచంపల్లి
Comentarios