కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
![](https://static.wixstatic.com/media/acb93b_7e2eb3dbd16441b2a658197e3db0a04b~mv2.jpg/v1/fill/w_540,h_619,al_c,q_80,enc_avif,quality_auto/acb93b_7e2eb3dbd16441b2a658197e3db0a04b~mv2.jpg)
'Natho Pettukoku' Written By Bhagyalakshmi Appikonda
రచన: భాగ్యలక్ష్మి అప్పికొండ
బిచ్చగాడికి చిల్లర వెయ్యక పోగా క్లాస్ పీకాడు అతను.
మరి ఆ బిచ్చగాడు వూరుకున్నాడా?
'నాతో పెట్టుకోకు' అనే రేంజ్ లో రివెంజ్ తీసుకొన్నాడు.
భాగ్యలక్ష్మి అప్పికొండ గారు రాసిన ఈ చక్కటి హాస్య కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
"అమ్మా! ధర్మం చేయండి.. " అంటూ అరుస్తున్నాడు బిచ్చగాడు ఒక పెద్ద బంగ్లా బయట.
ఆ అరుపులు విన్న ముత్తైదువ మహాలక్ష్మి, తలనీలాలు ఇచ్చినందువలన గుండుని కొంగుతో కప్పుకొని బయటకొచ్చి , "ఏమిటయ్యా ఆ కేకలు చిల్లర లేదు, పక్కకెళ్లు" అని గద్దించింది.
"అమ్మా! మా తల్లివికదు.. తలనీలాలు ఇత్తే పున్నెం వత్తాదేటమ్మ.. మాలాటోల్లకి దానం సేస్తే వత్తాది. మీదే సివరాకరి బోణి తల్లి, వెయ్యండమ్మ " అంటూ దీనంగా అర్ధించాడు బిచ్చగాడు.
"అయ్యొ చిల్లర లేదయ్యా "అంటూ తల పట్టుకుంది.
"ఎందుకు లేదమ్మా! మీ ఆయన పాంట్ ఎడమవైపు జేబులో ఎనిమిది వంద నోట్లు, రెండు ఏభై నోట్లు, రెండు పది నోట్లు వుంటాయమ్మ. ఆ రెండు పదినోట్లు నాకెయ్యండమ్మ" అన్నాడు దీనంగా.
"ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవయ్యా" అంది అనుమానంగా చూస్తూ.
"ఎందుకు సెప్పలేనమ్మా! ఇందాకనే ఆ పక్క వీధి లో అయ్యగోరు నాకు ముప్పై రుపాయలు కమీసనిచ్చి వెయ్యి రూపాయలు చిల్లర తీసుకున్నారు. ఏభై రూపాయలు ఏవో కొనుక్కొని వచ్చారు.... ఆ మిగిలన ఇరవై ఇప్పించడమ్మా!" అంటూ నీరసంగా వివరించాడు.
"అయినా నీకు ముప్పై రూపాయలు కమీషన్ ఇచ్చి ఆయన యాబై రూపాయలు ఏంటి కొన్నారు" అని అడిగింది లేడి డిటెక్టివ్ రేంజ్ లో
ఆ అనుకొని ప్రశ్నకి కాస్త తటపటాయిస్తూ తత్తరపడుతూ " అదేం లేదమ్మా! రేపొత్తా ఈ యాలోద్దు .... నాను అబద్ధాలడకూడదు" అని బిచ్చగాడు తలగోక్కొని వెళ్లి పోతుంటుంటే
"చెప్తే కాని కదలడానికి వీల్లేదు" అని చీపురకట్ట పట్టుకుంది మహాలక్ష్మి
ఇక చేసేదేమిలేక "మల్లెపూలు" అని చెప్పి కాళ్ళకి బుద్ది చెప్పాడు బిచ్చగాడు
అది విన్న మహాలక్ష్మి కనకదుర్గ అవతారమెత్తి అదే చిపురకట్టతో లోపలికెళ్లింది.
లోపల నుంచి పెద్ద సౌండ్ తో ఒక పాట వినబడుతుంది.
"రగులుతోంది మొగలిపొద.......వగలమారి కన్నెఎద"
ఆ పాటకు అనుగుణంగా తన శ్రీవారితో చీపురుకట్టతో నాగిని డాన్స్ చేయిస్తూంది.
కాస్త దూరం వెళ్ళాక బిచ్చగాడు "నేను బిచ్చమడిగితే వెయ్యనంటావా? గవర్నమెంటు పనులు జరగడానికి బిచ్చమెత్తావు, దేవుడి దగ్గర బిచ్చమెత్తుకుంటావు . ఓట్లు అడిగిన వాడికి కన్ను మిన్ను కానకుండా ఎత్తావు బిచ్చం. నాకు బిచ్చమెయ్యమంటే దందాలని, చందాలని, మాఫియాలని సోది సెప్పి........ పోలిసోన్ని పిలుత్తానని బెదిరిత్తావా!? నీ ఎముకల్లో సున్నం మిగలాలంటే మీ తాతలు దిగిరావాలి.... బిచ్చేశ్వరరావా..మజాకా!!"అంటూ చేతిలోని బొచ్చు పై తాళమేసుకుంటూ, చిరంజీవి లెవల్లో స్టెప్పులేసుకుంటూ, స్టైల్ గా నవ్వుతూ వెళ్లిపోయాడు.
శుభం
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
Comentários