top of page
Mana Telugu Kathalu - Admin

నవలల పోటీలు మరియు కథల పోటీలు


Ugadi 2023 Novel And Story Competition By



మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది 2023 ధారావాహిక నవలలు మరియు కథల పోటీలు



విషయ సూచిక

1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )

2. అక్టోబర్ 2022 NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విజేతల వివరాలు

3. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు

4. ఉగాది 2023 కథల పోటీలు

5. ఉగాది 2023 జోక్స్ పోటీలు

6. రచయితలకు సన్మానం

7. రచయితల ప్రొఫైల్స్

1 .బహుమతులకు సహకరిస్తున్న వారు

వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.

ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.

*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.

*శ్రీమతి పెండేకంటి లావణ్య కుమారి గారు తమ దివంగత మాతృమూర్తి శ్రీమతి పెండేకంటి లక్ష్మీపద్మావతమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.

2. అక్టోబర్ 2022 NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విజేతల వివరాలు:

( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి ).

విజేతలను అభినందిస్తూ మెయిల్ చేశాము. e - ప్రశంసా పత్రాలు పంపించాము.

బహుమతి మొత్తాన్ని 20/11/2022 లోగా అందజేస్తాము.

3. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు

ఏకైక ప్రథమ బహుమతి రూ: 15000 /-

ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 1000 /-

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.

నిబంధనలు :

*సీరియల్ నవల కనీసం పది భాగాలుగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు.

*ప్రతి భాగంలో సుమారు 8౦౦ పదాలు ఉండాలి.

*వారానికి ఒక ఎపిసోడ్ ప్రచురింపబడుతుంది.

*మొత్తం నవల ఒకేసారి పంపాలి.

*రచయితలు తామే ఎన్ని వారాలు ప్రచురించాలనుకుంటున్నారో అన్ని భాగాలుగా విభజించి పంపాలి.

*మరుసటి భాగం కోసం పాఠకులు ఎదురు చూసేలా రాయాలి.

*సీరియల్ నవలలు పంపాల్సిన చివరి తేదీ 15/01/2023.

*కాపీ నవలలు, ఇదివరకే ప్రచురింపబడ్డ నవలలు, అనువాద నవలలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న నవలలు పంపరాదు.

*మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.

*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ నవలలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.

*ఒకరు ఎన్ని సీరియల్ నవలలైనా పంపవచ్చును.

*వెంటనే మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.

* మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

*పి.డి.ఎఫ్ రూపంలో పంపే నవలలు పరిశీలింపబడవు.

*ఫలితాలు 15/04/2023 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.

*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

*గమనిక: ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.

*మనతెలుగుకథలు.కామ్ లో ఒకసారి ప్రచురింపబడ్డ కథలు, నవలలు ఎట్టి పరిస్థితులలోను తొలగింప బడవు. ఇందుకు సమ్మతించేవారే తమ రచనలను పంపవచ్చు.

*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.

*బహుమతులను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రద్దు చేయడానికి, మార్పులు చేయడానికి మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉన్నాయి.

4. ఉగాది 2023 కథల పోటీలు

సంక్రాంతి 2021, విజయదశమి 2021, ఉగాది 2022 మరియు విజయదశమి 2022 కథల పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము

ఇప్పుడు ఉగాది 2023 కథల పోటీని ప్రకటిస్తున్నాము.

ఉగాది 2023 కథల పోటీ బహుమతుల వివరాలు :

ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /-

ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.

నిబంధనలు :

*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.

*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.

*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.

*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.

మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.

*వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.

* మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.

*లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

*పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.

*కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 20 /03/2023

*ఫలితాలు 15/04/2022 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.

*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

*ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.

*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.

5. ఉగాది 2023 జోక్స్ పోటీలు

*16/09/2022 నుండి 20 /03 /2023 వరకు ఎక్కువ జోక్స్ పంపిన వారికి రూ: 1000 /- బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.

*ఫలితాలు 15/04/2022 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి.

6. రచయితలకు సన్మానం

30 /10 /2022 న రవీంద్ర భారతి లో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఇందుకు సహకరించిన వారందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

ఆ పోస్ట్ చూడనివారి కోసం లింక్ ఇస్తున్నాము.


ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం చేపట్టమని పలువురు రచయితలు కోరుతున్నారు.

ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము.


7. రచయితల ప్రొఫైల్స్

రచయితలందరినీ వారి ప్రొఫైల్ లో లాగిన్ కమ్మని కోరుతున్నాం.

వారి వారి ప్రొఫైల్స్ ను తమ సన్నిహితులకు షేర్ చేసి ఫాలో కమ్మని కోరమని అభ్యర్థిస్తున్నాము. అందువల్ల మీ రచనలు పబ్లిష్ అయినప్పుడు అనుసరించిన వారికి నేరుగా సమాచారం అందుతుంది. కామెంట్ చెయ్యడం కూడా సులభమవుతుంది.


అలాగే సాటి రచయితల ప్రొఫైల్స్ ను ఫాలో చెయ్యమని కోరుతున్నాం.

మనతెలుగుకథలు.కామ్ కి తరచుగా రచనలు పంపేవారు అరవై మందికి పైగా ఉన్నారు.

అప్పుడప్పుడు రచనలు పంపేవారు వంద మందికి పైగా ఉన్నారు.

రచయితలు సాటి రచయితల కథలను వీలునుబట్టి చదివి కామెంట్స్ పెడుతూ వుంటే వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఇప్పుడు రచయితలే కాక, పాఠకులు కూడా తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని లాగిన్ కావచ్చును.


మనతెలుగుకథలు.కామ్ పాఠకులకు, రచయితలకు మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.


104 views0 comments

コメント


bottom of page