#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Navvithe, #నవ్వితే
Navvithe - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 11/12/2024
నవ్వితే - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
సూర్యుడే! నవ్వితే!!
వెలుబడుతాయి వెలుగులు
పసి పాప నవ్వితే
రాలుతాయి ముత్యములు
ప్రకృతి మాత నవ్వితే!
అంతటా పచ్చదనము
జాబిలమ్మ నవ్వితే
కురియును చల్లదనము
నవ్వుకుంది అందము
ముఖాలతో బంధము
దరహాసము తెచ్చును
మధుమాసము ఖచ్చితము
నవ్వులేని ముఖాలు
కాంతిలేని గృహాలు
ఎండినట్టి చెరువులు
ఆకులేని తరువులు
నవ్వుకో! హాయిగా!
బ్రతుకంతా తీయగా!
ఖర్చు లేనిది నవ్వు
గుబాళించే పువ్వు
నవ్వుతో లాభాలు
బలపడును బంధాలు
చిరునవ్వుతో బ్రతుకు
దైవ వరమది మనకు
-గద్వాల సోమన్న
Comments