'Navvu' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 09/11/2023
'నవ్వు' తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
కన్నులనుండి నవ్వు
కడు చిన్నగ బుట్టి
చిరు బుగ్గలు దాకి
పెదవుల పెన్నిధి వోలె
నుట్టి పడి నిక తిన్నగ
సాగు దరహాస మానన మంతటన్
రసిక హృదయులు
రమణీ మణులున్
ముసి ముసి నవ్వుల
ముదుసలి మోమున్
పసి కందుల కెందమ్మి
అందము నందున్
వికసితమగు రసికత
విరులన్ బోలన్
హాసము మందహాసము
దరహాసము పరిహాస హాస
విలాస మెరుగని విరాగి
సహవాస మెరుంగునె
జన వాసము లందున్
అధికారి దరి జేరి అర్థించ బోవ
పెదవిప్పి సరెననంటు
ముదముతో బలుక
మదినున్న దిగులింక మరుగు జేరి
పదిలమై హృదయము పరవశించు
అతిస్మితమతి మగడును యన సరి
యతి స్మితమగు మగువయు గాగన్
స్మిత మతు లెరుగని సతి పతులకు
సుతి గుదురునె సూక్ష్మంబైనన్
నవ్విన నాతి నెమ్మోముయు
నవ్వించిన నాథు నగు మోముయు
కవ్వింపుగాదు నెంచ నది
స్వ్యంబగు సంసార సారంబనగన్.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments