top of page
Writer's pictureGadwala Somanna

నవ్వులే!! విరిసిన పువ్వులు

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #NavvuleVirisinaPuvvulu, #నవ్వులేవిరిసినపువ్వులు


Navvule Virisina Puvvulu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 06/01/2025

నవ్వులే విరిసిన పువ్వులు - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


అధరాల వనంలో

వికసించిన పువ్వులు

చిన్నారుల ముఖంలో

అరవిరిసిన నవ్వులు


వదన గగనంలో

వెలిగేటి తారకలు

హృదయ క్షేత్రంలో

సంతోష వీచికలు


నవ్వులేని ముఖములు

నూనె లేని ప్రమిదలు

అమావాస్య రాత్రులు

అగుపించవు సొగసులు


నవ్వుల వానలోన

తడిస్తే ఆరోగ్యము

దరహాస ఓడలోన

ఎంతో ఆనందము


నవ్వు గొప్ప కానుక

జీవితాన దీపిక

ఎప్పుడూ పెదాలపై

ఉండాలోయ్! తప్పక



-గద్వాల సోమన్న



19 views0 comments

Comentarios


bottom of page