#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #సన్మానం
Neeraja Hari Prabhala Gariki Sanmanam - New Telugu Article on Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 25/11/2024
నీరజ హరి ప్రభల గారికి సన్మానం - తెలుగు వ్యాసం
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
నా గురించి చిరు పరిచయం క్లుప్తంగా….
“నీరజ హరి ప్రభల” గా నేను మీ అభిమాన రచయిత్రిగా మీ అందరికీ సుపరిచయం.
అది డిశెంబరు 23, గురువారం 2023 వ సం...నా జీవితంలో మరపురాని, మధురమైన ఘట్టము.
ఆరోజు సా. 5గం.. లకు రవీంద్రభారతిలో ప్రఖ్యాత వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే రచయిత్రిగా నాకు ఘన సన్మానం జరిగింది.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, నడిచే దైవం, సాక్షాత్తూ సరస్వతీ స్వరూపులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజగారు, ప్రముఖ సాహితీవేత్త శ్రీ వోలేటి పార్వతీశం గారు, ప్రఖ్యాత వంశీ ఇంటర్నేషనల్ సంస్థల అధినేత శ్రీ వంశీ రామరాజు గారు, ప్రముఖ రచయిత్రి, ప్రఖ్యాత వైద్యశిఖామణి, నాకత్యంత ప్రియమైన ఆప్తురాలు డా… కె.వి. కృష్ణ కుమారి (కృష్ణక్క) గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో చాలా ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, వాళ్ల చేత బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నిజంగా నాఅదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
ఆరోజున హైదరాబాద్ లోని మీడియా సంస్థలు, ఈటీవీలో కూడా ఈ వేడుకని గురించి చాలా చక్కగా వివరించారు. ఆరోజున 9 రకాల పత్రికల వాళ్లు వచ్చి ఆ వేడుకని ఆసాంతం తిలకించి ఆ మరుసటి రోజు తమ పేపర్లలో ముద్రించడం నాకు చాలా సంతోషం కలిగింది.
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం. అంతకు ముందే నా రచనలను, నాపుస్తకాలను ఆయన చదివారుట. నా రచనాశైలి చాలా బావుంటుందని స్వయంగా ఆయనే చెప్పి నన్ను అభినందించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అంతా ఆ వాగ్దేవి దయ.🙏
ఆతర్వాత విజయవాడలో ప్రఖ్యాత శారదా కళా సమితి వారిచే ఘన సన్మానం జరిగింది. ఆ సభకు విజయవాడలోని పురప్రముఖులు హాజరయి బహుప్రశంశలు, సిధ్ధార్ధ కళాశాలలో ఘన సన్మానం, ప్రఖ్యాత తుల్యాంక యోగా సంస్థ వారిచే ఘన సన్మానం, ఆతర్వాత పలు సంస్థలవారిచే ఘన సత్కారం పొందడం అంతా దైవ కృప.
నాకు జన్మనిచ్చిన నా జననీజనకుల అమూల్యమైన ఆశీర్వాదం, నాగురుదేవుల కరుణ, నా తోడబుట్టిన వాళ్ల ప్రోత్సాహం, నా కుటుంబం, నా పిల్లలు, అల్లుళ్లు, మనమలు, మనుమరాళ్ల ప్రోత్సాహం చాలా ఉంది.
ముఖ్యంగా నన్ను ఎల్లప్పుడూ ఆదరించి అభిమానిస్తూ, అనుక్షణం వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ “ఉత్తమ రచయిత్రి” అవార్డుతో రవీంద్ర భారతిలో నన్ను ఘనంగా సన్మానం చేసిన మన తెలుగు కధలు. కామ్ వెబ్సైట్ వారికి ఆ జన్మాంతం ఋణపడి ఉంటాను. అమూల్యమైన ఆ దంపతుల, ఆ కుటుంబం ఋణం తీర్చుకోలేనిది. 🙏
నిత్యం నా రచనలను ప్రోత్సహించి నన్ను ఎంతగానో అభిమానిస్తున్న పాఠక దేవుళ్లకు చాలా చాలా ధన్యవాదాలు.🙏
రచనలే నా ఊపిరి. కవితలే నా శ్వాస. పాఠకులే నా దేవుళ్లు. కడదాకా ఇలాగే మంచి రచనలు చేస్తూ మీ అందరి అశేష ఆదరాభిమానాలను పొందాలని ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Congratulations.