top of page

నీతి పద్యములు

Updated: Jan 29

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #నీతిపద్యములు, #NeethiPadyamulu


Neethi Padyamulu  - New Telugu Poems Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 23/01/2025

నీతి పద్యములు - తెలుగు పద్యములు

రచన: యశోద గొట్టిపర్తి


కాలము


మంచు కరిగినట్లు మాయము నిమిషము

పంచుకోను మరల పనికిరాదు 

మంచి సమయ మoటు మంతన మొద్దుర

తలచినంత పెంచు తపన పరుగు


ఉదయ కాంతి లాగ ఉత్సాహ పడుము 

పట్టపగలు యువత కష్ట మల్లె

అస్తమించు సూర్య అణుకువ లోనుండు

మూడు కాలములకు మూలమవ్వు


సంస్కారం


చదువు నేర్చి కూడ సంస్కార మునులేక 

సార్ధకంబు కాదు సాధ నెపుడు

విద్య వినయమున్న విలసిల్లు 

విజయ పథము నందు వెలుగులీను

 

పుడమి తల్లి 


అరక చేత బట్టి ఆనందమున సాగు

పొలమునంత దున్ని పచ్చ చేయు 

కాలము కలిసి రాక కన్నీటి పంటలు 

నేటి రైతు అవని నేరబిడ్డ


హరిత వనము చేస్తె హేమకాంత మగను 

పుడమిలోన పచ్చ పసిమి దొరుకు 

కలుషితములకు కల కష్టము తల్లికి 

తొలగిపోవు మంచి తరుణ మొచ్చు

***


యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం




Comentários


bottom of page