top of page
Writer's pictureMohana Krishna Tata

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 7



'Nenu Premisthunnanu - Episode 7'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 17/02/2024

'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక 

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీ గా ఉంటాడు. పద్మ చాలా ఓర్పు, నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్. 


వంశీ కాలేజీ లో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్ లో పడతాడు. స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధ పడతాడు వంశీ. తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు. ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించడని తెలుసుకుంటుంది స్వాతి. వంశీ, స్వాతి ఇంటికి వెళ్లి తనతో క్లోజ్ గా మూవ్ అవుతాడు. 


ఇక నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 7 చదవండి. 


పిక్నిక్ కి వెళ్ళే రోజు వచ్చింది. అందరూ పిక్నిక్కి కాలేజీ బస్సు లో బయల్దేరారు. కాలేజీ లో సైన్సు స్టూడెంట్స్, ఆర్ట్స్ స్టూడెంట్స్.. స్టాఫ్ అందరూ ఒక చోట కలిసారు. మొత్తం కాలేజీ అంతా పిక్నిక్ కు రెడీ అయ్యింది. 


కాలేజీ లో ఉదయం ఆర్ట్స్ సెక్షన్స్ కి క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి సైన్సు క్లాసులు స్టార్ట్ అవుతాయి. వంశీ, స్వాతి, ఫ్రెండ్స్ అందరూ సైన్సు గ్రూప్. పిక్నిక్ రోజు బస్సు లో స్వాతి పక్కన కూర్చోవాలని వంశీ అనుకున్నాడు. దాని కోసం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టడానికి వారిని ఏదో గేమ్ లో బిజీ చేసాడు. ఇప్పుడు స్వాతి పక్క సీట్ ఖాళీ గానే ఉంది. 


స్వాతి పక్కనే నిల్చున్న వంశీ.. ఆమె సిగ్నల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. కొంతసేపటికి.. బస్సు స్టార్ట్ అయింది.. ఆ జర్క్ కి వంశీ పడబోతుంటే, ఆమె పట్టుకుని.. తన పక్క కూర్చోమంది. తన చేతి తో వంశీ చేయి పట్టుకున్నప్పుడు కలిగిన ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. ఆమె పక్కనే కూర్చున్న వంశీ అలా మాటలు కలిపాడు. బస్సు లో మిగిలిన వాళ్ళంతా.. ఎవరి హడావిడి లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది పాటలు పాడుతుంటే, మరి కొందరు చుట్టూ ప్రకృతిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పిక్నిక్ స్పాట్ కాలేజీ కి చాలా దూరం.. చాలా సేపు జర్నీ తర్వాత.. పిక్నిక్ స్పాట్ కు చేరుకున్నారు. 


అక్కడ అందరూ బ్రేక్ ఫాస్ట్ చెయ్యడానికి వెళ్లారు. స్వాతి తన ఫ్రెండ్స్ తో కూర్చొని ఉంది.. వంశీ బ్రేక్ ఫాస్ట్ వేరే తన ఫ్రెండ్స్ తో చేస్తున్నాడు. స్వాతి వంశీ కు సైగ చేసి తమ తో జాయిన్ అవమని అంది. సిగ్నల్ అందిన వెంటనే, వెళ్లి ఆమె పక్కనే కూర్చున్నాడు వంశీ. అలా బ్రేక్ ఫాస్ట్ అయిన తరవాత అందరూ వాటర్ లో ఆడదానికి వెళ్లి ఎంజాయ్ చేసారు. 


వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుతున్నప్పుడు ఒక అమ్మాయి స్లిప్ అయ్యి వాటర్ లో పడిపోయింది. హెల్ప్ అని అరుస్తుంటే, వెంటనే అక్కడ ఉన్న వంశీ.. తన ఫ్రెండ్స్ తో కలిసి.. ఆ అమ్మాయిని కాపాడారు. అమ్మాయిని ఒడ్డుకు తీసుకుని వచ్చి.. వంశీ ఫస్ట్ ఎయిడ్ చేసాడు. 


"మీ పేరు ఏమిటి.. ?" అడిగాడు వంశీ.


"నా పేరు లక్ష్మి.. "


"కాలేజీ లో ఎప్పుడూ చూడలేదే.. ఏ సెక్షన్.. ?"


"నేను ఆర్ట్స్ సెక్షన్.. మార్నింగ్ కాలేజీ.. "


"ఓకే.. లక్ష్మి.. టేక్ కేర్.. " అని చెప్పి వంశీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. 


ఆ రోజు నుంచి.. లక్ష్మి దృష్టిలో వంశీ ఒక హీరో.. 


పిక్నిక్ హడావిడి అంతా అయిపోయిన తర్వాత.. సాయంత్రం అందరూ రిటర్న్ బయల్దేరారు. బస్సు బయల్దేరిన కొంతసేపటికి ఆగిపోయింది. చెక్ చేసి, రిపేర్ కి ఎక్కువ సేపు పడుతుందని చెప్పడంతో.. అందరూ అక్కడే నైట్ స్టే చేయాల్సి వచ్చింది. చుట్టూ పక్కల అంతా అడవే.. ఏమి లేవు.. బాయ్స్ అందరికీ టెంట్స్ ఏర్పాటు చేయాల్సింది గా టీచర్స్ ఆర్డర్ వేసారు. వంశీ.. ఫ్రెండ్స్ అంతా కలిసి టెంట్స్ ఏర్పాటు చేసారు. తినడానికి స్నాక్స్ కుడా టౌన్ నుంచి తెచ్చారు. అన్నీటికీ వంశీ చేసిన హెల్ప్ కి అందరూ మెచ్చుకున్నారు. 


ఇంత హెల్ప్ చేసిన వంశీ ని చూసిన లక్ష్మి, వంశీ లవ్ లో పడిపోయింది. బస్సు రిపేర్ అయ్యాక.. రాత్రి స్టార్ట్ అయ్యింది. అందరూ ఊపిరి పిల్చుకున్నారు. అందరూ ఇంటికి వెళ్లారు. 


మర్నాడు కాలేజీ లో.. 


"స్వాతి! లైలా! ఒక గుడ్ న్యూస్.. నా మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసారు.. నెక్స్ట్ వీక్ లోనే నా మ్యారేజ్.. అందరూ తప్పకుండా నా పెళ్ళికి రావాలి.. ఇంతకీ వంశీ ఎక్కడ.. ?" అంది స్నేహ.


"ఇంకా రాలేదు.. ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయంట.. బిజీ గా ఉన్నాడు.. "


"ఉండు.. నేను వెళ్లి పిలుస్తాను.. "


"వంశీ.. ! బిజీ గా ఉన్నావా.. ?"


"చెప్పు స్నేహ"


"నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది.. నువ్వు తప్పకుండా రావాలి అని కార్డు ఇచ్చింది.. ఐ విల్ బి వెయిటింగ్.."

"సరే.. స్నేహ.. "


మ్యారేజ్ రోజు ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ గా స్నేహ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు.. హడావిడంతా ఫ్రెండ్స్ దే ఆ రోజు. అందంగా అలంకరించిన కళ్యాణ మండపం.. ఫ్రెండ్స్, బంధువులతో చాలా హడావిడిగా ఉంది. స్నేహ తను ఎప్పటినుంచి కలలుకంటున్నా తన బావ తో పెళ్ళి చేసుకుంది. ఈవెనింగ్ రిసెప్షన్ లో అందరూ బాగా ఎంజాయ్ చేసారు.. 


"చూసావా స్వాతి! స్నేహ ఎంత ఆనందంగా ఉందో? లవ్ మ్యారేజ్ లో ఎంతో సంతోషం ఉంటుందంటే ఏమో అనుకున్నా.. చూస్తుంటే తెలుస్తుంది.. నచ్చిన మనిషి కోసం వెయిట్ చేసి.. పెళ్ళి చేసుకోవడం లో ఉన్న ఆ ఆనందమే వేరు.. "


"ఏమో వంశీ! అందరికి ఆ అదృష్టం ఉండొద్దు.. వాళ్ళ పేరెంట్స్ తన లవ్ కి ఎప్పుడో 'ఎస్' చెప్పారు.. అందరి పేరెంట్స్ అలా ఉండాలని ఏముంది చెప్పు.."

"ఇంతకీ మీ పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్.. వంశీ?"

"లవ్ మ్యారేజ్ లాంటిదే.. మా పేరెంట్స్ కుడా కాలేజీ లో ఫ్రెండ్స్.. పెళ్ళి చూపులలో ఆ విషయం ఇద్దరికీ తెలిసింది.. "


"అయితే నువ్వు నన్ను లవ్ మ్యారేజ్ చేసుకుంటే, మీ పేరెంట్స్ ఒప్పుకుంటారేమో.. !"


"ఒప్పుకున్నా.. లేకపోయినా.. మనకి కావాల్సిన లైఫ్ పార్టనర్ కోసం మనమే ఒప్పించాలి.. లేకపోతే పోరాడి సాధించాలి.. మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి స్వాతి.. "


అంతా విన్న స్వాతి.. ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది.. 


=====================================================================

ఇంకా వుంది.. 

=====================================================================


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

67 views0 comments

Comments


bottom of page