'Nenu Premisthunnanu - Episode 8' - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 22/02/2024
'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీ గా ఉంటాడు. పద్మ చాలా ఓర్పు, నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్.
వంశీ, కాలేజీ లో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్ లో పడతాడు. స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధ పడతాడు వంశీ. తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు. ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించడని తెలుసుకుంటుంది స్వాతి. వంశీ, స్వాతి ఇంటికి వెళ్లి తనతో క్లోజ్ గా మూవ్ అవుతాడు.
పిక్నిక్ లో లక్ష్మి అనే అమ్మాయిని కాపాడతాడు వంశీ.
ఇక నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 8 చదవండి.
పిక్నిక్ లో మనసు పారేసుకున్న లక్ష్మి.. అదే పనిగా వంశీ గురించి ఆలోచిస్తూనే వుంది.. క్లాసు లో టీచర్ చెప్పిన పాఠాలు ఏమీ మైండ్ కి ఎక్కట్లేదు. ఇంట్లో అమ్మ చెప్పిన పని చెయ్యట్లేదు. పడుకుంటే, నిద్ర రావట్లేదు. పోనీ, తినడానికి కూర్చుంటే, ఒక ముద్ద కూడా దిగట్లేదు. ఏమిటో ఈ ధోరణి అనుకుంది లక్ష్మి.
ఇదంతా తెలుసుకున్న తన క్లాసు మేట్ సంధ్య..
"ఏమిటి లక్ష్మి.. ! ఏమిటి ఈ ధోరణి.. సడన్ గా ఇలా అయిపోయావు.. ?"
"ఏమోనే.. ఆ రోజు పిక్నిక్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇలానే ఉంది.. "
"కొంపదీసి ప్రేమలో పడ్డవా ఏమిటి.. ?"
"ఇదేనా ప్రేమంటే.. ఇన్నాళ్ళు చదువు తప్పితే ఏమీ తెలియదు.. ఫస్ట్ టైం ఈ ఫీలింగ్స్ కలుగుతున్నాయి సంధ్య.. "
"అదేనే ప్రేమంటే లక్ష్మి.. ఎవరే ఆ లక్కీ హీరో.. ?"
"మొన్న పిక్నిక్ లో నా ప్రాణాలు రక్షించాడే.. అతనే వంశీ.. అతని స్పర్శ తగిలిన తర్వాత, నాలో ఈ ప్రేమ కలిగింది.. సంధ్య!"
"అయితే అతని దగ్గరకు వెళ్లి ప్రపోజ్ చెయ్యలేకపోయావా.. ?"
"ఏమిటి చేసేది.. అతను నన్ను అసలు పట్టించుకోవట్లేదు.. "
"అయినా అతనిలో ఏమిటే అంతగా నచ్చింది నీకు.. ?"
"వంశీ చూడడానికి బాగుండడమే కాదే.. మంచివాడు.. సహాయం చేసే గుణం ఉన్నవాడు.. చదువులో ఎప్పుడు టాప్ లో ఉంటాడు.. "
"ఇన్ని లక్షణాలున్న అబ్బాయిని.. ఇప్పటికే ఎవరో అమ్మాయి లైన్ లో పెట్టే ఉంటుందే ఈ పాటికి.. " అంది సంధ్య.
"అలా జరగడానికి లేదు.. ఒకవేళ అలా ఎవరైనా ఉన్నా.. నేను ఒప్పుకోను.. " అంది లక్ష్మి.
"అయితే త్వరగా నీ ప్రేమను అతనికి చెప్పు లక్ష్మి..
నువ్వేమో ఆర్ట్స్ గ్రూప్, అతను సైన్సు.. మీ ఇద్దరికీ ఎలా కుదురుతుందే.. "
"ప్రేమకి గ్రూప్స్ తో సంబంధం ఏముందే.. చెప్పు !"
"నువ్వు మార్నింగ్ కాలేజీ కి వస్తావు.. వంశీ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తాడు. ఎలాగ ఇద్దరు కలిసేది.. ?"
"మనసుంటే మార్గం ఉంటుందే.. "
"అయితే, ఒక మంచి టైం చూసి.. వంశీ కు ప్రపోజ్ చెయ్యి లక్ష్మి.. "
"అలాగే! రేపు కాలేజీ అయిపోయిన తర్వాత.. మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉండి.. వంశీ కోసం చూస్తాను.. "
"ఆల్ ది బెస్ట్.. లక్ష్మి"
లక్ష్మి మర్నాడు వంశీ వచ్చే టైం కోసం వెయిట్ చేసింది. వంశీ కరెక్ట్ టైం కే కాలేజీ కి వచ్చాడు. లక్ష్మి ఎదురుగా వెళ్లి.. వంశీ కి 'హాయ్' చెప్పింది..
"హాయ్ వంశీ.. "
"మీరు.. ?.. ?.. ?"
"పిక్నిక్ లో నన్ను వాటర్ ఫాల్స్ దగ్గర కాపాడారు.. గుర్తొచ్చానా.. ?"
" 'ఎస్'.. మీ పేరు లక్ష్మి కదా,,,"
"ఎస్.. "
"ఎలా ఉన్నారు ఇప్పుడు.. "
"ఐ యాం ఫైన్ వంశీ.. "
"మీ క్లాసు లు అయిపోయాయి కదా.. ఇంకా ఇంటికి వెళ్ళలేదా.. ?"
"మీ కోసమే చూస్తున్నాను వంశీ.. "
"ఎందుకు. ?"
"మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి.. అలా బయటకు వస్తారా?'
"పదండి.. ఇప్పుడు.. చెప్పండి లక్ష్మి.. "
"మీరు అండి అనకండి.. 'నువ్వు' అనండి.. మీరు నా మనసుకు చాలా దగ్గర అయ్యారు.. " అంది లక్ష్మి
"అంటే.. "
"మీరు నాకు బాగా నచ్చారు.. మిమల్ని నేను ప్రేమిస్తున్నాను.. "
"మీ బదులు కోసం వెయిట్ చేస్తుంటాను.. ప్లీజ్ 'నో' అని మాత్రం అనకండి.. "
"లక్ష్మి.. ఐ యాం సారీ.. నేను ఇప్పటికే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను.. నేను ఇంక ఎవరినీ ఆ దృష్టితో చూడలేను.. నా మీద ఆశలు పెట్టుకోకండి.. "
"ఎవరా లక్కీ గర్ల్.. తెలుసుకోవచ్చా?"
"టైం వచ్చినప్పుడు తెలుస్తుంది.. నన్ను ఇంక ఇబ్బంది పెట్టకండి.. ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోండి లక్ష్మి.. "
"మరి నన్ను ఎందుకు ఆ రోజు కాపాడారు?"
"మీ ప్లేస్ లో ఎవరు ఉన్నా నేను కాపాడతాను.. "
అలా చెప్పి వంశీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
మర్నాడు మార్నింగ్ కాలేజీ లో అందరూ సీరియస్ గా ఒక విషయం గురించి చర్చించుకుంటున్నారు. వంశీ వచ్చి ఆ విషయం గురించి అడిగాడు.
"మన ఆర్ట్స్ అమ్మాయి లక్ష్మి.. నిన్న సూసైడ్ చేసుకోబోయింది.. ఇప్పుడు హాస్పిటల్ లో ఉంది.. ఏదో లవ్ మేటర్ అని అందరూ అంటున్నారు.. " అని అక్కడ అందరూ అనుకుంటున్నారు..
వంశీ గుండెలో రాయి పడినట్టు అయ్యింది.. ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేసింది.. అందరితో పాటు హాస్పిటల్ కు వెళ్లి చూడాలని అనుకుని.. హాస్పిటల్ కు బయల్దేరాడు వంశీ. హాస్పిటల్ కి చేరుకున్న వంశీ.. డాక్టర్ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పడం విని ఊపిరి పీల్చుకున్నాడు.
"హాయ్ లక్ష్మి.. ఏమిటి ఈ పని.. ?" అడిగాడు వంశీ.
"నువ్వు నిన్న అలా అనేసరికి మనసు చాలా బాధ పడింది.. కిచెన్ లో కత్తి కనిపించగానే, చేతి పై కోసుకున్నాను.. అయినా, నా బాధ ఇంకా తగ్గలేదు.."
"నువ్వు నాకొక మాట ఇవ్వాలి లక్ష్మి.. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యనని.. "
"ట్రై చేస్తాను వంశీ.. "
వంశీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు..
'నిన్ను అంత ఈజీ గా వదులుకోలేను వంశీ.. చూడు ఏం చేస్తానో.. ' అని అనుకుంది లక్ష్మి..
=====================================================================
ఇంకా వుంది..
=====================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments